చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
నటీనటులు: శ్రీకాంత్ , రవళి
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 02.08.1996
|
మల్లె పూల వాన మల్లె పూల వాన
జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా…
భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
మల్లె పూల వాన..
జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
మల్లె పూల వాన.. వాన వాన వాన
భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
దొరకును దొరకూనా ఎదురెవరుర మనకీ వేళలోన
చరణం: 1
ఓయమ్మా ఈ రోజున వద్దనకమ్మా ఏం చేసినా
నా పాదాలే పరుగులు తీసే గోదారి అలలవుతుంటే ఆగేనా ఎవ్వరాపినా
అష్ట సిరులు నిను ఇష్టపడెనురా కష్టపడితే జత కట్టవచ్చురా
గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక
మహారాజులాగా వేశానుర కోటలో పాగా
పాచిక వేశాక పారక పోదురా నూరారు అయినా
చరణం: 2
మబ్బుల్లో ఆ జాబిలి.. నా జత కోసం రావాలని
ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడే నా జళ్లో చేరాలని
ప్రేమ యాత్రలో పక్క దారులు ఎంత మాత్రము తప్పు కాదురా
రథం నడుపుతారా మా మామను కూర్చోపెట్టి
ఎటెళ్లాలో చెబుతా కళ్లాలను చేత్తో పట్టి
అల్లుడినైపోగా చల్లగ నా కాళ్లు కడిగించుకోనా
******** ********* ********
చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, కళ, శ్రీ
కమ్మగ సాగే స్వరమో
కమ్మగ సాగే స్వరమో
అల్లుడూ…
కమ్మగ సాగే స్వరమో
కమ్మగ సాగే స్వరమో
రమ్మని లాగే చెలిమో
అది ఎవరిదనీ మది అడిగినది
పద వెతకమని అటు తరిమినది
కథ ముదురు మదన మహిమో..
అద్గదీ
కమ్మగ సాగే
అద్గదీ
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
చరణం: 1
తీయని వలపుల సాయం అడిగిన వయసు విన్నపమో
దాగని వలపుల రాగము పలికిన సొగసు సంబరమో
కంగారు కలల కలవరమో శృంగార కళల తొలివరమో
ఏమో….ఓ ఓ ఓ…
కమ్మగ సాగే
శభాష్!
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
చరణం: 2
తొందరపడమని ముందుకు నడిపిన చిలిపి స్వాగతమో
కందిన పెదవుల విందుకు పిలిచిన చెలియ స్నేహితమో
పిల్లగాలి చేస్తున్న రాయబారమో పూల దారి వేస్తున్న ప్రేమ గానమో
ఏమో.. ఓ ఓ ఓ…
కమ్మగ సాగే స్వరమో
రమ్మని లాగే చెలిమో
అది ఎవరిదనీ - మది అడిగినది
పద వెతకమని - అటు తరిమినది
కథ ముదురు మదన మహిమో..
బ్రహ్మాండం!
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
******** ********* ********
చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, మురళి, రాంచక్రవర్తి
జింగిలాలో ఏం గింగిరాలో
బొంగరాలో ఈ భాంగ్రాలో
లెఫ్టు రైటు లేదులో పడుచు బాటలో
ఎర్ర లైటు వద్దురో కుర్ర జోరులో
చిన్నారి ఈ చకోరి చూపింది చిలిపి దారి
ఓరోరి బ్రహ్మచారి.. వదిలేస్తే వెరీ సారీ
పారాహుషారు పాటలందుకో
ఈ పరుగులో బ్రేకులెందుకో
చరణం: 1
పాసుపోర్టు లేదు వీసాల గొడవ లేదు
వయసు దూసుకెళితే దేశాల హద్దులేదు
చాల్లేరా నెల్లూరే వెళ్లాలన్నా బస్ చార్జీ నిల్లేరా
ఇల్లాగే ఫారిన్ టూరు వెళ్లేది ఎలారా
యు.ఎస్ ని ప్యారిస్ ని ఊహల్లో చూడరా
టెక్నికలర్ కలలు కనే టెక్నిక్ మనకుందిరా
ఆ నింగికి సైతం నిచ్చెన వేద్దాం మన ఆశకున్న హార్సు పవర్ చూపిద్దాం
ఏ ఎల్లలైన చెల్లవంటు చాటిద్దాం
శాటిలైటు లాటిదిరా సాటిలేని యవ్వనం
పూట పూట వినోదాలు చూపించే సాధనం
జింగిలాలో ఏం గింగిరాలో
బొంగరాలో ఈ భాంగ్రాలో
చరణం: 2
ఫిల్మ్ స్టారులంతా మనకేసి చూస్తున్నారు
మనం చూడకుంటే మరి ఎలా బతుకుతారు
చల్ చల్ రే… పాకెట్లో పైసాలతో పిక్చర్కే పోయొద్దాం
పోస్టర్లో పాపకి ఓ డ్రస్సు కొనిద్దాం
తాపీగా కూర్చుంటే తోచదురా సోదరా
హ్యాపీగా ఎగరడమే మనమెరిగిన విద్యరా
ఆ గువ్వలమవుదాం.. రివ్వున పోదాం
మేఘాల మీద సంతకాలు చేసేద్దాం
ఓ వానవిల్లు కట్టి తిరిగి దిగి వద్దాం
తుళ్లిపడే అల్లరితో గొల్లుమనే సంబరం
ఆకలనీ దాహమని ఆగదురా ఏ క్షణం
******** ********* ********
చిత్రం: వినోదం (1996)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
పల్లవి:
హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల
శుభలేఖలు రాసిన వేళ!
చరణం: 1
ఎటు చూస్తున్నా శుభ శకునాలే కనపడుతున్నవి కదా
ఎవరేమన్నా పెళ్లి మంత్రాలై వినపడుతున్నవి కదా
ప్రేమా గీమా చాలించేసి పెళ్లాడేసే వేళయ్యింది
ప్రేయసి కాస్తా పెళ్లామయ్యే ఆ సుముహూర్తం వచ్చేసింది
కళ్యాణ వైభోగంతో కన్యాదానం కానీయబ్బాయి
ఆ పైన నా ఓళ్లోనే కాలక్షేపం చెయ్యాలమ్మాయి… చిలకలా
చరణం: 2
వరుడిని నేనై పరిణయమాడే పిల్లకి పల్లకి తేనా
ఇదివరకెపుడు పరిచయమవని సిగ్గుకి దగ్గర కానా
పిల్లామూక పరివారంతో చుట్టాలంతా వస్తారంట
చిన్నా పెద్దా సకుటుబంగా చుట్టూ చేరి చూస్తారంట
ఓ గాలి డివ్వి డివ్వి డివ్విట్టంతో డోలూ సన్నాయి
మొగుడి వేషంలో నిన్నే చూసి నవ్వేస్తానోయి… కిల కిలా