చిత్రం: యుద్ధం శరణం (2017)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: ప్రదీప్ కుమార్
నటీనటులు: నాగ చైతన్య , లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్
దర్శకత్వం: కృష్ణ మరిముత్తు
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 08.09.2017
ఎన్నో ఎన్నో భావాలే
పెనవేసే యెదలో రాగాలే
పులకించే బంధాలన్నీ ఒకటై
ఆలకించే అందాల పాటే
కనబడగా కనబడగా స్వర్గం
కదిలే ఈ క్షణమే
కాదా ఒక వరమే పులకించే
బంధాలన్నీ ఒకటై
ఆలకించే అందాల పాటే
ఎన్నో ఎన్నో భావాలే
పెనవేసే యెదలో రాగాలే
ఈ వీచే గాలే కోరే
ఓ కరిగే కాలం ఆగి
ఉండిపోవా ఎప్పుడిలాగే
చిరునవ్వుల వెన్నెలలోని
వె వన్నెల వన్నెలు అన్ని
నెమ్మదిగా బంధిలైపోని
ఈ చక్కని చిత్రం లోని
ఓ చిలిపి వర్ణం నేనై
ఎల్లప్పుడూ సందడి చేసేయ్ ని
మది కోరే ఆశే తరమగా
కనిపించే మారo
ఎద చేసే భాషే నిమరగా
ఒలికించే గారం
ఆణువణువూ నాలో
ఎన్నో పదనిసలె
పలికే పరవశమే
పులకించే బంధాలన్నీ ఒకటై
ఆలకించే అందాల పాటే
********* ********* *********
చిత్రం: యుద్ధం శరణం (2017)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: ట్రాసీ థోర్టన్
అదేదో మాయల్లె
అలా అలా అల్లిందా
ఎద ఏదో లోయల్లో
ఇలా జారింది మెల్లగా
ఆ .. ఆ ..ఆకాశం వాలీ
కళ్ళలోన దాగింది
చూపుల్లో చూపే
అలాగే మెరుపు తీగాల్లె
ఆ ..అందాలే
మచి చూపిందా
సూదల్లె గుండె గుచ్చి గుచ్చి
చంపుతుంది
కంగారే .. దాహoగా మారిందా
గుటక వేసి చూస్తూనే
మొహమాటం అడ్డం వచ్చి ఆరాటం
అయ్యో ఉహలతో సద్దుకుందిగా
అయ్యో అయ్యో చెయ్యి జారుతున్న
ప్రాణం తానే అందుకుందా
ఏదో ఏదో హాయి చేరుతుందా
తీరే కొత్తగా తోచిందా
సైగలో దాగిన భావమే తెలియాలంటే
భాషకే అందని విధంగా మనమే చేరి
ఈ పెదవి పై తాకేలా
మొహమాటం అడ్డం వచ్చి ఆరాటం
అయ్యో ఉహలతో సద్దుకుందిగా
మొహమాటం అడ్డం వచ్చి ఆరాటం..ఏదో
ఉహలతో సద్దుకుందిగా
******** ******* ********
చిత్రం: యుద్ధం శరణం (2017)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: శ్రేష్ట
గానం: కార్తీక్
ఆఁ.... పాలనకున్నా చూసే కన్నులని
రెప్పే పడదే ఎలాగా
దాచాలనుకున్నా నాలో ఆశల్ని
మనసే వినదే ఎలాగా
కుదురుగా లేనే లేనే నీవలనే
ఏం చేశావేమో ఏమో నీవే
గిలిగింతలు ఎన్నెన్నో ఎదలో కలిగే
ఏం చేశావేమో ఏమో నీవే నీవే
నాలో నన్నే మాయం చేసి
ఎదో మాయే నీవై
నీవలనే నీవల్లనే ఇంతలా సందళ్ళే
నీవలనే నీవల్లనే ఓ ఓ
నీవలనే నీవల్లనే గుండెల్లో సవ్వళ్ళే
కురిపించే ఈ అనురాగమంతా
కలకాలం నిలవాలన్నా
కలలే నిజమై పోనీ
నిజమే నిత్యం కానీ
పెనవేసే ఆనందాలింకెంతో పెరగాలిలా
పద పద పద పద మది ఇలా
పదే పదే పదే నీ వైపుకే ఇలా
నేననే మాటే నేనే మరిచేలా
ఓ...ఓ... ఏం చేశావేమో
ఏమో నీవే ఎదగిల్లి నన్నే దోచి
ఏం చేశావో ఏమో నీవే నీవే
కవ్వించే కరిగించే వలపన్ని
నీలోనే బంధించి వేశావే
దాచాలనుకున్నా నాలో ఆశల్ని
మనసే వినదే ఎలాగా
ఏనాడు తెలియని ఎదో గమకమే
ఇపుడే ఇపుడే నను తాకే
ఈ మైమరుపులే పెట్టే మెలికలే
రేపే తీపి ఆశల్నే
నీవలనే నీవల్లనే ఇంతలా సందళ్ళే
నీవలనే నీవల్లనే ఓ ఓ
నీవలనే నీవల్లనే గుండెల్లో సవ్వళ్ళే
నీవలనే నీవల్లనే
నీవలనే నీవల్లనే ఓ ఓ
******** ******* ********
చిత్రం: యుద్ధం శరణం (2017)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: శక్తిశ్రీ గోపాలన్
ఓ యెలుగుల తెరలే
పరుసుకు చూసే సూరీడుని నేనంటా..
హా.. హా
ఓ సొరవగ చుసే
ఎండల్లో జబిల్లే నువ్వే కదా
తలల తలల తలల ల ల ల ల ల..
తలల తలల తలల ల ల ల ల ల..
పరుగెడుతూ నా దారే
తీరె మాయె ఇదా
అలల్లా ఎగసే మునిగి తడిసే
వలల్లో పరిసే మదీ
కుదురే మరిసి తిరిగీ ఆలిసీ
ఇక ఎనకెనకే పడుతున్న కలల సడులివీ
తలల తలల తలల ల ల ల ల ల..
తలల తలల తలల ల ల ల ల ల..
తలల తలల తలల ల ల ల ల ల..
తలల తలల తలల ల ల ల ల ల..
ఆ చుక్కలు లేని ఆకాశాలని
వదిలిన చినుకల్లే
వచ్చవే ఇరకాటంలో
తడిపేసీ ఇలగా
నా పడవకి నీవే
తెర సాపల్లే మారావటె
హైలేస్సా
మసక వచ్చి కమ్మితే
కనులే ఇక దాటీ
ఎనక ఎనకే పడుతున్నా
కలల సడులివీ
తలల తలల తలల ల ల ల ల ల..
తలల తలల తలల ల ల ల ల ల..
ఓ పొరిమె దాక
నువ్వుంటే మరి నా జతా
తెలవారే తొలి ఏలలలో
పొగ మంచె నువ్వా
కదిలేటీ సెల ఏరుకదా
పరిగెత్తే మనసే….
******** ******* ********
చిత్రం: యుద్ధం శరణం (2017)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: శివమ్, కాలభైరవ
ఆవేశం నిన్నే ప్రాణం తీసెయ్ అంటుంటే
చేసేయ్ సాహసం
విద్వేషం చుట్టు కంచె తెంచెయ్ అంటుంటే
వేగం నీ పతం
కాలం నీ అష్వమై
సాగిపొయె క్షణమే
జాలే తొలగితే
ఇక వేసెయ్ వేటు
నీ ఊపిరే ఇంక మోగుతున్న శంకమవ్వదా
పిడికిలే పిడుగులా గట్టి ఉక్కుపాతరేసి చూపరా ఇలా
బాణంలా ముందుకే
సూటిగా దూసుకు వెల్లగా
ఈ యుద్ధం శరనమే కోరుకోదు
దుమ్ము రేపి చూపరా పదా
స్వేదమే ఇందనం తీసివెయరా నీచుల ప్రాణం
యుక్తమే రక్తమై చెరపదా గుండెలో గాయం
తిప్పలే పెంచరా నిప్పు రవ్వలా ఎగసిన కాలం
ముప్పులా దూకరా ఉప్పెనై మంచు భూగోళం
మతిపోయే వ్యుహమే యెదురై చేరే వేలలో
ఇరకాటం మాయలో గడినే దాటే వీలేదీ
గుండెలో ఊపిరే ఇంక మోగుతున్న శంకమవ్వదా
పిడికిలే పిదుగులా గట్టి ఉక్కుపాతరేసి చూపరా
బాణంలా ముందుకే
సూతిగా దూసుకు వెల్లగా
ఈ యుద్ధం శరనమే కోరుకోదు
దుమ్మురేపి చూపరా పదా
బాణంలా ముందుకే
సూటిగా దూసుకు వెల్లగా
ఈ యుద్ధం శరనమే కోరుకోదు
దుమ్ము రేపి చూపరా పదా