చిత్రం: యువకుడు (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బి.చరణ్
నటీనటులు: సుమంత్ , భూమిక
దర్శకత్వం: కరుణాకరన్
నిర్మాత: అక్కినేని నాగార్జున , యన్.సుధకర్ రెడ్డి
విడుదల తేది: 19.05.2000
మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ
ఇవాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై స్వాగతిస్తుండగా
తేలుతున్నాను నీలి మేఘాలలో
మునుగుతున్నాను తొలిప్రేమ భావంలో
మేలుకున్నాను కలలోన ఉన్నానో
పాటలా ఉంది గాలి ఈలేసినా
ఆటలా ఉంది ఎవరేమి చేస్తున్నా
తోటలా ఉంది ఎటు వైపు చూస్తున్నా
********** ******** *********
చిత్రం: యువకుడు (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పార్థసారథి
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా
కమ్మని జోలలతో చిననాటి ఆ కల
కమ్మిన జ్వాలలతో నిలిచింది కన్నులా
తీరని ఊహలా తీరని ఆశలా
అలనాటి జ్ఞాపకాల కోవెల
కోయిల పాటలా కోరిన కోటలా
పిలిచింది నన్ను కోటి గొంతులా
చెరిగిన శాంతి చెదిరినకాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా
నీ కొనవేలితో మొదలైంది ఈ కదం
నీ చనుబాలతో పదునైంది పౌరుషం
నీ ఎదలో లయ వినపడనీయక
నను ఆపకమ్మ కాలు తూలగా
నీ కనుపాపలో కాంతిని ఈయక
కరిగించకమ్మ కంటి నీరుగా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా