Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Attintlo Adde Mogudu (1991)


చిత్రం: అత్తింట్లో అద్దెమొగుడు (1991)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, నిరోషా
దర్శకత్వం: రేలంగి నరసింహా రావు
నిర్మాత: కె. సి.రెడ్డి
విడుదల తేది: 1991

అండగాడా అందుకోరా
గొల్లభామ చేతిలోని పాలకుండ
చందురరూడా నిండిపోరా
చుక్కలాంటి చిన్నదాని గుండెనిండా
తూరుపింట వేగుచుక్క పొడవకుండా
హ కన్నెపిల్ల సిగ్గులన్ని తడవకుండా
అర్ధరాత్రి కోరికంత ఆరకుండ
ఆశపెట్టి పారిపోకు కోరుకొండ

అండగాడా అందుకోరా
గొల్లభామ చేతిలోని పాలకుండ

ఆకుముక్క లవంగి పోకచెక్క
బిగించు తాంబూలమే ఎంగిలి
తోకచుక్క తడుక్కి చెమ్మచెక్క
సుఖించు నారీమణి కౌగిలి
ఈ ఎడారి క్లబ్ లో
వెన్నెలమ్మ పెగ్గులో
ఈ ఎడారి క్లబ్ లో వెన్నెలమ్మ పెగ్గులో
వేడిముద్దులే నంచుకో
పిల్లసోకు మండపేట పూతరేకు
అందుబాటులోనే ఉంది ముందు మాకు
టముకువేసి టౌన్ కంత చెప్పమాకు
తమకమంత తాగినేల దింపమాకు

అండగాడా అందుకోరా
గొల్లభామ చేతిలోని పాలకుండ

పైటకొంగు అరెస్ట్ చేసుకున్న
జరక్కు జామీను కోరిందిలే
పూల పక్క నలక్క పాపిడంత
చెరక్క ఆనందమేముందిలే
కోడితాచు కోరిక
ఉండనీదు ఊరక
కోడితాచు కోరిక ఉండనీదు ఊరక
సంపంగి సయ్యాటలో

వైఫ్ లాగ చిక్కినావే అమ్మలాలో
లైఫ్ లాంగ్ దక్కనీవే శోభనాలు
బుగ్గకంద నివ్వమాకు బుజ్జిలాలో
బూర గంప తన్నిపోకు బూజిలాలో

అండగాడా అందుకోరా
గొల్లభామ చేతిలోని పాలకుండ
చందురరూడా నిండిపోరా
చుక్కలాంటి చిన్నదాని గుండెనిండా
తూరుపింట వేగుచుక్క పొడవకుండా
హ కన్నెపిల్ల సిగ్గులన్ని తడవకుండా
అర్ధరాత్రి కోరికంత ఆరకుండ
ఆశపెట్టి పారిపోకు కోరుకొండ

అండగాడా అందుకోరా
గొల్లభామ చేతిలోని పాలకుండ


Most Recent

Default