Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bombay (1995)




చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: మణిరత్నం
విడుదల తేది: 10.03.1995



Songs List:



అది అరబీ కదలందం పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: రెమో ఫెర్నాండేజ్, స్వర్ణలత 

అది అరబీ కదలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వనుక్కు కౌగిళ్లడిగానే
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

విప్పారే తామరవే రూపాంత కన్నాలే
నీ పట్టు రైకల విదియ తదియ వైనం చూశాలే
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

చీరె వచ్చి ముందు జారే మోజులకు ఆహా ఎంత సుఖమో
పైలా పచ్చి పసి వేలే తగిలినప్పుడు ఆహా ఎంత ఇహమో
చిత్రాంగి చిలక రాత్రి పగలనక ముక్తాయించే నడుమో
అందం దాని మతమంటే లేని విధమయ్యో దివియ పదమో
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

అది అరబీ కదలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వణుకు కన్నా కన్నె తీరా
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

విప్పారే తామరవే రూపాంత కన్నాలే
నీ పట్టు రైకల విదియ తదియ వైనం చూశాలే
హమ్మా హే హే హమ్మా

ఏదో సరసమిది ఎంతో విరహమిది మొత్తం మీదో చిలకో
తాపం మంచమెక్కి దీపం కొండా ఎక్కి కంట్లో వెలిగే మనస్సు
ఫనా పులుత మీద భూమి విడత పొంగి తల్లో సెగలు పెరిగే
కామం కరిగిపోయే కళ్ళే నిదరబోయే కానీ మనసు బెనికే
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

అది అరబీ కదలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వణుకు కౌగిళ్లడిగానే

హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హే హమ్మా హమ్మా హే హే హమ్మా హమ్మా హమ్మో
హే హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హే హమ్మా హమ్మా
హమ్మా




కన్నానులే కలయికలు పాట సాహిత్యం

 


చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, ఏ.ఆర్.రెహమాన్ & కోరస్ 

మామ కొడుకు రాతిరి కొస్తే 
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ 
మరువకు ఎంచక్కో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

ఊరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం
ప్రియమగు ప్రాయాల కోసం

అందం తొలికెరటం...
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం...
రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగే దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలి మంట

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

గంసుము గంసుము గుప్పుచుప్ప్
గంసుము గుప్పుచుప్
గంసుము గంసుము గుప్పుచుప్ప్
గంసుము గుప్పుచుప్

జలజలా జలజల జక్కములాడె 
జోడి వేటాడి
విల విల విల విల వెన్నెలలాడి 
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరి కొస్తే 
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ 
మరువకు ఎంచక్కో

మామ కొడుకు రాతిరి కొస్తే 
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ 
మరువకు ఎంచక్కో

శృతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాల లూగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాట లాడింది నాలో

ఎంత మైమరపో 
ఇన్ని ఊహల్లో తెల్లారే రెయల్లే
ఎడబాటనుకో 
ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
కన్నానులే...





ఉరికే చిలకా వేచి ఉంటాను పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, చిత్ర

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

నీ రాక కోసం తొలిప్రాణమైన
దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక
చితి మంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
అది కాదు నా వేదనా
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా

ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ
మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే
కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
నీ వేణు గానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ





కుచ్చి కుచ్చి కూనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్ , స్వర్ణలత , GV ప్రకాష్ కుమార్ , శారద 

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె
కోడి కూడా సద్దుచేసే
కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా

హయ్య హయ్య హయ్య
హయ్య హయ్య హైయాయ
హయ్య హయ్య హయ్య
హయ్య హయ్య హైయాయ

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె
కోడి కూడా సద్దుచేసే
కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట

ఆట నెమలికి మెరుపు సుఖం
గాన కోకిలకు పిలుపు సుఖం
చెట్టు వేరుకు పాదు సుఖం
హే అమ్మడను పిలుపు సుఖం
రాకుమారుడి గెలుపు సుఖం
చంటి కడుపుకి పాలు సుఖం
మొగుడు శ్రీమతి అలకలలో
ముద్దుకన్ను ముడుపు సుఖం

రేయి పగలు పన్నిటిలో ఉన్న
రాదు మీనుకి చలి కాలం
అల్లిబిల్లిగా లాలిస్తుంటే
గారాల పూబాల కోరేది సరసం

బుజ్జి బుజ్జి పాపానివ్వు
పోకిరాట వేశమొద్దు హ హ హ హ
బుజ్జికి బుజ్జికి పాపానివ్వు
పోకిరాట వేశమొద్దు
వేడెక్కే అందాలు పెట్టు
వేధిస్తే నా మీదే ఒట్టు

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా

హయ్య హయ్య హైహయ్య
హయ్య హయ్య హాయ్
హయ్య హయ్య హైహయ్య
హయ్య హయ్య హాయ్
హయ్య హయ్య హయ్య హయ్య
హయ్య హయ్యయ్యయ్యయ్య
హయ్య హయ్య హయ్య హయ్య
హయ్య హయ్యయ్యయ్యయ్య

చిరుత రెక్కలే పక్షివిలే
చిటికె వెలుగులే దివ్వివిలే
తోడు నీడ ఇక నీవేలే
తరగని పుణ్యమిదే
కనువు తోటివే తపనలులే
ఉరుము తోటివే మెరుపులులే
ఉన్న తోడు ఇక నీవేలే
విలువలు తెలియవులే

భూమి తిరగడం నిలబడితే
భువిని తాళమే మారదులే
మగని ఆదరణ కరువైతే
ఇల్లాలి ప్రేమంతా వేసంగి పాలే

పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగా
పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగా
బుద్దిగుంటే మంచిదంట
దూరాలు కోరింది జంట

కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా




పూలకుంది కొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: పల్లవి, శుభ , అనుపమ, నోయెల్ జేమ్స్, శ్రీనివాస్, సుజాతా మోహన్ 

పూలకుంది కొమ్మ పాటకుంది అమ్మ
గుల్లగుల్ల హల్లగుల్ల
నింగి నెల డీడిక్కి నీకు నాకు ఈడిక్కి
గుల్లగుల్ల హల్లగుల్ల

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తెర మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తెర మస్తాన
గుల్లగుల్ల హల్లగుల్ల

పున్నాగ పూలకెలా దిగులు
మిన్నేటి పక్షికేది కంటి జల్లు
జాబిలెన్నడు రాత్రి చూడలేదు
స్వర్గానికి హద్దు పొద్దు లేనే లేదు
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల

కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్లు
మేఘాలు గాయపడితే మేరుపల్లె నవ్వుకుంటాయి
కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్లు
మేఘాలు గాయపడితే మేరుపల్లె నవ్వుకుంటాయి
ఓటమిని తీసేయ్ జీవితాన్ని మోసేయ్
వేదాలు జాతి మాత బేధాలు లేవన్నాయ్

మౌనం లోని గానం
ప్రాణం లోని బంధం
ఎగరేయ్ రెక్కలు గట్టి ఎదనింకా తారల్లోకి
ఎగరేయ్ రెక్కలు గట్టి ఎదనింకా తారల్లోకి
విజయం కోరే వీరం చిందిస్తుందా రఖ్తం
అనురాగం నీలో ఉండే ఆకాశం నీకు మొక్కు

గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల

కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్లు
జీవితాన్ని మోసేయ్ ఓటమిని తీసేయ్
మౌనం లోని గానం
ప్రాణం లోని బంధం
విజయం కోరే వీరం రఖ్తం కోసాంచదా

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
నీలో నేనే ఉన్న రూప్ తెర మస్తాన
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
నీలో నేనే ఉన్న రూప్ తెర మస్తాన




మతమేల గతమేల పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: సుజాతా మోహన్ , 

మతమేల గతమేల మనసున్న నాడు…
హితమేదో తెలియాలి మనిషైన వాడు
నీ దేశమే పూవనం… పూవై వికసించనీ జీవితం…

కన్నీట కడగాలి… కులమన్న పాపం…
మత రక్త సిందూరం… వర్ణాలు అరుణం…
గాయాల నీ తల్లికీ…
కన్నా…! జో లాలి పాడాలిరా…

సరిహద్దులే దాటు ఆ గాలిలా… ప్రసవించనీ ప్రేమనే హాయిగా
నదులన్నీ కలిసేటి కడలింటిలో… తారల్లు విరిసేది గగనాలలో
కలలోకి జారేను ఈ రాత్రులే… వెలిగించి నవ్యోదయం

మతమేల గతమేల మనసున్న నాడు…
హితమేదో తెలియాలి మనిషైన వాడు
నీ దేశమే పూవనం… పూవై వికసించనీ జీవితం

తల ఎత్తి నిలవాలి నీ దేశము… ఇల మీదనే స్వర్గమై
భయమన్నదే లేని భవితవ్యము… సాధించరా సంఘమై…

ఒక మాట… ఒక బాట… ఒక ప్రాణమై..
సాగాలిరా ఏకమై…





ఇదు మాతృభూమి పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం:  చిత్ర, శంకర్ మహదేవన్ ,   సుజాతా మోహన్ , నోయెల్ జేమ్స్, శ్రీనివాస్, శివనేషణ్ , గంగా శ్రీనివాసన్, రేణుకా, అనురాధ శ్రీరాం 

ఇదు మాతృభూమి

Most Recent

Default