చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి నటీనటులు: యన్.టి.రామారావు, జమున దర్శకత్వం: యన్.టి.రామారావు నిర్మాత: నందమూరి త్రివిక్రమ రావు విడుదల తేది: 05.01.1962
Songs List:
ఉన్నది చెబుతా వింటారా పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.జానకి, వసంత ఓ... ఉన్నది చెపుతా వింటారా నేనన్నది ఔనని అంటారా తండ్రులకోసం త్యాగం చేసిన తనయు లెందరో ఉన్నారని నే తండ్రిబాస కాపాడి - తనరాచ గద్దె విడనాడి నారచీరలను దాల్చి కానలకు తరలిపోయెనా దశరధరాముడు తండ్రివలపు చెల్లించి పినతల్లి కోర్కెపాటించి బ్రతుకు సాంతముగ బ్రహ్మచర్యమును వ్రతముగ బూనెను భీష్మాచార్యుడు. తండ్రి ఆశ గమనించి అతని తలంపు మన్నించి మిసిమి యౌవనము ధారవోసి - తా ముసలి తనమ్మును గైకొనె పూరుడు
అంబ జగదంబ పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.లీల అంబా జగదంబా నా ఆ రినే ఆలించవా ఏడి నా కన్నయ్య ఏడీ జాడనే చూపించవా నీవె చూపిన కంటి వెలుగును నీవె మాయము నేతువా ఏమిటీ అన్యాయమమ్మా ఎందుకింత పరీక్షలమ్మా ఎన్నొ నోములు నోచి కొడుకును కన్న ఫల మేమున్నదీ అమ్మాయని పిలుచు నా పాపాయి ఒడిలోలేనిది
కాలిగజ్జే కదలకముందే పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.జానకి & కోరస్ కాలిగజ్జె కదలకముందె ఖంగారై పోతా రెందుకు పాచికలను విసరకముందే పరవశమై పోతారెందుకు మా గజ్జెలు ఘల్లంటేనే మీ గుండెలు ఝల్లంటాయి మా అందం మా చందం మీ అందరికాళ్ళకు బంధం మీ ఆటలింక సాగవు మాముందు దొరబాబులంతా బందీలిక ముందు కుచ్చుల తలపాగా చూసి పచ్చలవిడి దాకును చూసి వడి తిరిగిన మీసం చూసి జడుసుకునే దానసు కానోయి. మా చూపే గిలిగింత మా రూపే పులకింత మా చూపే మా రూపే మీగుండెల చక్కిలిగింత మీ ఆట సాగు మాముందు దొరబాబులం బందీలిక ముందు నిరుపేదల నోళ్ళనుగొట్టి నిలవుంచిన బంగరు మొహరీల్ పడతి పొందుకై ఘల్లనిపిస్తే భ్రమసిపడే దానను కానోయి పందానికి మేం పిలిచాము పంతానికి మేం నిలిచాము పందెంలో పంతంలో మిమ్మందరినీ మేం గెలిచాం మీ ఆటలింక సాగవు మా ముందూ దొరబాబులంతా బందీలిక ముందు వెకిలి నవ్వులను ఒలికిస్తూ వెర్రి మొర్రి చేష్టలు చేస్తూ గుడ్లప్పగించి గుటకలు వేనే మీ గోడు వినే దానను కానోయీ పందానికి మేం పిలిచాము - పంతానికి మేం నిలిచాము పందెంలో పంతంలో మిమ్మందరినీ మేం గెలిచాం మీ ఆటలింక సాగవు మా ముందు దొరబాబులం బందీలిక ముందు
అనురాగ పయోనిధి పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల విజయ : అను రాగ పయోనిధిః ఓ జననీ నీ పదమె నమ్మి జనకుని కనులన్ గొనిరా నరుగుచు నుంటిని కనురెప్ప విధాన నన్ను గావవె మాతా !
సలామలేకుం సాహెబు గారు పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల , యస్.జానకి సలామలేకుం సాహెబుగారూ బలే షోకుగా వచ్చారా బల్ బలే షోకుగా వచ్చారా సలామాలేకుం అస్సలామాలేకుం పసందుచూపి నిషా చేసి దిల్ ఖుషీ చేయగా వచ్చానే నడుంవంగి గడ్డాము నెరసినా పడతి మోజు పోలేదా పులుపు తగ్గిపోలేదా నీ పులుపు తగ్గిపోలేదా సలా మాలేకుం వయసుతోటి పనియేముందే నా మనసుచూడవె బుల్ బుల్ నా హోయలు చూస్తేనే జిల్ జిల్ ఆ త్తరులో మునిగొస్తేనేమి ఆటను గెల్చుటకల్ల పోటీలో నువు ఢిల్లా మా పోటీలో నువు ఢిల్లా సలా మాలేకుం అత్తరు కంటే మత్తునుచూపే సత్తువవుందే పిల్లా నా చలాకి చక్కెర బిళ్ళా నా చలాకి చంకీ పిల్లా కన్నెలందరం కాలుదువ్వితే రిమ్మతిరిగి పోతుందోయ్ నీ గుండె పీచుమంటుందోయ్ నీ గుండె పీచుమంటుందోయ్ సలా మాలేకుం జబ్బ చరచి నే దూకానంటే దెబ్బకు మీరు పరారు మీ దయ్యం దిగుట ఖరారు అస్సలా మాలేకుం
నన్ను దోచుకుందువటె పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి చరణం: 1 తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు.. సంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి చరణం: 2 నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం... నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి
కలల అలలపై తేలెను పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, జానకి కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై ఎగిసి పోదునో చెలియా నీవే ఇక నేనై కలల అలలపై..... చరణం: 1 జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు (2) తడిసీ తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు (2) చూపుతోనె హృదయవీణ ఝుమ్మనిపించేవెందుకు (2) విరిసీవిరియని పరువము మరులు గొలుపుతున్నందుకు (2) చరణం: 2 సడి సవ్వడి వినిపించని నడిరాతిరి ఏమన్నది (2) జవరాలిని చెలికానిని జంటగూడి రమ్మన్నది (2) విరజాజులు పరమళించు విరుల పానుపేమన్నది (2) అగుపించని ఆనందము బిగికౌగిట కలదన్నది (2)
ఒంటరినైపోయాను పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల ఒంటరినైపోయాను ఇక యింటికి ఏమనిపోనూ ఒంటరినైపోయాను ఇక యింటికి ఏమనిపోనూ చరణం: 1 నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి బుణము చెల్లించనైతిని నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి బుణము చెల్లించనైతిని ఎవరికీ గాక ఏ దరిగానక ఎవరికీ గాక ఏ దరిగానక చివికి చివికి నే మ్రోడైపోతిని చరణం: 2 నన్నె దైవమని నమ్ముకున్న - నా ఇల్లాలిని ఎడబాసితిని బ్రతుకె బరువుగా తిరిగి తిరిగి ఈ బండలలో నొక బండనైతిని "ఒంటరి" చరణం: 3 వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేసి వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేస గుండె ఆవిరైపోవుచుండ ఈ మొండి బ్రతుకు నే నీడ్చుచుంటిని
మదన సుందర నాదొరా పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల మదన సుందర నాదొరా ఓ మదన సుందర నాదొరా నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె ఓ మదన సుందర నాదొరా చరణం: 1 చిన్నదానను నేను - వన్నెకాడవు నీవు (2) నాకూ నీకు జోడు (2) రాకాచంద్రుల తోడు చరణం: 2 మిసిమి వన్నెలలోన - పసిడి తిన్నెలపైన (2) రసకేళి తేలి (2) పరవశమౌదమీవేళ చరణం:3 గిలిగింతలిడ యింత పులకింతలేదేమి (2) ఉడికించకింక (2) చూడొకమారు నా వంక చరణం:4 మరులు సైపగలేను - విరహమోపగలేను (2) మగరాయడా రార (2) బిగికౌగిలి చేర
విన్నావా తత్వం గురుడా పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పిఠాపురం నాగేశ్వరరావు అతితెలివి : విన్నావా తత్వం గురుడా కను గొన్నావా సత్యం నరుడో నరుణా విన్నావా తత్వం గురుడా నువ్వు విన్నావా తత్వం గురుడా' జుట్టు మట్టమై పోతుందంట బొట్టు మాయమై పోతుందంట మిస మిసలాడే కోర మీసాలకు అసలుకే మోసం వస్తుందంట కన్న తల్లి విషమౌతుందంట పెళ్ళామే బెల్ల మౌతుందంట అత్తల నెత్తికెక్కి కోడళ్ళు పెత్తనాలు వెలిగిస్తారంట
మాత జగన్మాత పాట సాహిత్యం
చిత్రం: గులేబకావళి కథ (1962) సంగీతం: జోసెఫ్ - విజయకృష్ణ మూర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల విజయ : మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా మీకన్నా లోకంలో నా కింకెవరున్నారు మీ చల్లని చూపుంటే మీరే నా దావుంటే భస్మరాశి ఇపుడే బంగారు జలం కావాలి వెన్నెల వెలుగున రవ్వల పువ్వే వికసించాలి అమ్మ మాట చెల్లించుట ఆపరాధ మ్మయితే నాన్నకు చూపివ్వడమే నా నేరమ్మైతే అందుకు నా చూపే పరిహారం కెందుకు యీ కన్నే బలిహారం యీ కన్నే బలిహారం