చిత్రం: నిప్పు (2012)
సంగీతం: యస్. యస్. థమన్
సాహిత్యం: విశ్వా
గానం: జావేద్ అలీ
నటీనటులు: రవితేజ, దీక్షాసేథ్
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: వై. వి.యస్.చౌదరి
విడుదల తేది: 17.02.2012
ఆలీబాబా ఆలీబాబా
ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబా
లెట్స్ గో (లేట్ అస్ గో)
ఏ దోస్ తీ గమ్మత్తుదీ
పణవెట్టే ప్రాణం సైతం తృణ మంటుందీ
ఏ దోస్ తీ గమ్మత్తుదీ
ఉండగానే మిత్రుడు అన్ని తానై
పైసలతో పనేమి సబ్ అప్ నా హై
చలో పదా మరీ జమానా జీత్ నే
అల్లుకున్న ఆశలేరా ప్రేమంటే
ఆశ లేని పాశమేర మైత్రంటే
కాన ఎప్పుడూ ఫ్రెండ్స్ లవ్ యూ
జత నస వస పిసినారైనా
చెల్లుర సుమతీ
లోకమంత వింటదీ చెప్పేదీ
చెప్పలేక వున్న వింటదీ ఈ దోస్తీ
అందుకే ఇదీ సాటిలేనిదీ
నమ్మకాల దొంతరల్లో పుట్టేదీ
అంతరాల అడ్డుకట్ట నెట్టేదీ
నిన్నోడ నివ్వనీ తోడూనీడిదీ
స్నేహమన్న ఒక్క నీతి కారణాన
రారాజు కూడ చేరెలే స్వర్గానా
మైత్రి మారునా యుగాలు మారినా
******** ******* ********
చిత్రం: నిప్పు (2012)
సంగీతం: యస్. యస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహాదేవన్
వేగ వేగ వేసేయ్యర అడుగు
వేగం అంటే గాలిని అడుగు
గాలే తాకి మబ్బే కరుగు
మబ్బే కరిగి చినుకై దూకు
చినుకు చినుకు ఏరై ఉరుకు
ఏరే కడలై నీరై పొంగు
నీరే పొంగి నిప్పై మరుగు
నిప్పవరంటే నన్నే అడుగు
అడుగులు అడుగులు పిడుగులు అడుగులు
చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు
మనసుకు భయపడు మనసుల జతపడు
మనసుని గెలిచిన మనిషే దేవుడు
ఎవర్ని ఫాలో కాను నాతో నేను పోతుంటాను
ఎవరికీ పోటి కాను నాకే నేను ఎదురొస్తాను
ఎవరితో పంతం లేదు నాతో నేను కలిసుంటాను
ఎవరికీ అర్ధం కాను నాకే నేను తెలిసుంటాను
ఎవరికీ ఉండని దారుంది
వేరెవరికి చెందని తీరుంది
పరులెవరికి లొంగని ఫైరుంది
నేన్నాలా ఉంటె తప్పేముంది
ఎరగను ఎరగను ఎవరిని కెలుకుడు
కెలికితే జరుగును ఎముకల విరుగుడు
తొడగను తొడగను మనసుకి ముసుగును
మనిషిగ మసలిన మనిషే దేవుడు
ఎటైనా వెళ్తుంటాను భారం లేదు తీరం లేదు
ఏదైనా చేస్తుంటాను ఆశే లేదు హద్దే లేదు
ఎలాగో బతికేస్తాను స్వప్నం లేదు సొంతం లేదు
ఇలాగే గడిపేస్తాను గమ్యం లేదు లక్ష్యం లేదు
నిన్నటి గురుతే లేకుంది
మరి నేటికి కొరతే లేకుంది
మరునాటికి కలతే లేకుంది
ఏదీ లేకుంటే లేనిది ఏది
ఎగసిన పిలుపుకి బదులిక వినపడు
మెరిసిన కనులకి చెలిమిక కనపడు
తెరిచిన మనసుకి మనసుతో ముడిపడు
మనిషిగ ఎదిగిన మనిషే దేవుడు