చిత్రం: తల్లా? పెళ్ళామా? (1970) సంగీతం: టి.వి. రాజు నటీనటులు: యన్.టి.రామారావు, హరికృష్ణ, చంద్రకళ, దేవిక, శాంత కుమారి దర్శకత్వం: యన్.టి.రామారావు నిర్మాత: నందమూరి త్రివిక్రమ రావు విడుదల తేది: 08.01.1970
Songs List:
తెలుగు జాతి మనది పాట సాహిత్యం
చిత్రం: తల్లా? పెళ్ళామా? (1970) సంగీతం: టి.వి. రాజు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల పల్లవి: తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా యాసలు వేరుగ ఉన్నా మన భాష తెలుగు భాషన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా ఆ... వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా... తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది చరణం: 1 మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో భాగవతం వెలసింది ఏకశిలానగరంలో ఈ రెంటిలోన ఏది కాదన్న ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది చరణం: 2 పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం ఐదు కోట్ల తెలుగువారిది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము స్వతంత్ర భారత్ కి జై గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము వందేమాతరం వందేమాతరం స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము జై విశాలాంధ్ర దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది చరణం: 3 ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు
ఓ..బంగారు గూటిలోని చిలుక పాట సాహిత్యం
చిత్రం: తల్లా? పెళ్ళామా? (1970) సంగీతం: టి.వి. రాజు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: ఓ..బంగారు గూటిలోని చిలుక... పేదముంగిట్లో వాలానని ఉలుకా ఓ..బంగారు గూటిలోని చిలుక... పేదముంగిట్లో వాలానని ఉలుకా ఓ..DON'T BE SILLY ఓ..వగలొలుకు మగసిరి గోరింకా తానై రా చిల్క వచ్చిందని కేరింతా ఓ..వగలొలుకు మగసిరి గోరింకా తానై రా చిల్క వచ్చిందని కేరింతా చరణం: 1 పవళించగ ..పూల పానుపు లేదూ తలవూనగ ..పట్టు తలగడయే లేదు జలకలాడగ ..పన్నీరు లేదు జలకలాడగ ..పన్నీరు లేదు పరిచర్యలు చేయ చెలులైన లేరు ఓ..బంగారు గూటిలోని చిలుక పేదముంగిట్లో వాలానని ఉలుకా SWEETNESS OF THE ROSES.. BRIGHTNESS OF THE SKY.. SMELL IN THE MOON LIGHT.. THRILL OF MY LIFE చరణం: 2 మెత్తని నీ మది విరిపాన్పు కాదా వెచ్చని కైదండ నా అండ లేదా మెత్తని నీ మది విరిపాన్పు కాదా వెచ్చని కైదండ నా అండ లేదా కురిసే వెన్నెల పన్నీరు కాదా కురిసే వెన్నెల పన్నీరు కాదా కొండంత నీ వుండ కోరిక లేలా.. ఓ..వగలొలుకు మగసిరి గోరింకా తానై రా చిల్క వచ్చిందని కేరింతా.. ఓ..బంగారు గూటిలోని చిలుక... పేదముంగిట్లో వాలానని ఉలుకా
తాగితే తప్పేముందే పాట సాహిత్యం
చిత్రం: తల్లా పెళ్ళామా (1970) సంగీతం: టి.వి.రాజు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల తాగితే తప్పేముందే
బ్రహ్మం తాత చెప్పింది పాట సాహిత్యం
చిత్రం: తల్లా పెళ్ళామా (1970) సంగీతం: టి.వి.రాజు సాహిత్యం: కొసరాజు గానం: పి.సుశీల బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం తెలుగుదనమేమి కాదు నీ తెలివి బైట పడబోదూ నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం తెలుగుదనమేమి కాదు నీ తెలివి బైట పడబోదూ నీవాణ్ణే నువ్వు తిట్టకపోతే తెలుగువాడివే కాదు.. బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు హాయ్ ఛాన్స్ తగిలితే మంత్రినవుదునని ప్లాను లేకపోలేదు బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది పదవులకోసం ప్రాకులాడడం ప్రెస్టేజీకి కాదు మన ప్రజలబాగుకు కాదు పదవులకోసం ప్రాకులాడడం ప్రెస్టేజీకి కాదు మన ప్రజలబాగుకు కాదు పూలదండలిక పడబోవేమోనని చింతలేకపోలేదు బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది పంచాయతి ప్రసిడెంటు కావడం గ్రామం బాగుకు కాదు ఆ ప్రక్కకు బుద్దే పోదూ పంచాయతి ప్రసిడెంటు కావడం గ్రామం బాగుకు కాదు ఆ ప్రక్కకు బుద్దే పోదూ ఆహా ఉమ్మడి సొమ్ము భోంచేద్దామని ఊహ లేకపోలేదు బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది బ్రతికున్నప్పుడు నెత్తిననిప్పులు చల్లడమంటే మోజూ అది సహజంరా ఈ రోజు బ్రతికున్నప్పుడు నెత్తిననిప్పులు చల్లడమంటే మోజూ అది సహజంరా ఈ రోజు చచ్చిన పిమ్మట శిలావిగ్రహం స్థాపించడమే రివాజు బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది పేకముక్కలు చేతపట్టితే చీదరించుకొనిరానాడు ఛీఛీ అన్నారానాడూ పేకముక్కలు చేతపట్టితే చీదరించుకొనిరానాడు ఛీఛీ అన్నారానాడూ క్లబ్బుల్లో పేకాటగాళ్ళకే గౌరవమున్నది ఈనాడూ బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే భాగ్యవతన్నారానాడూ సౌభాగ్యవతన్నారానాడూ బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే భాగ్యవతన్నారానాడూ సౌభాగ్యవతన్నారానాడూ బిడ్డలు లేని గొడ్రాలికే గౌరవమన్నారీనాడు బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది ప్రజాక్షేమమే పరమార్ధమ్మని ప్రభువులు పలికారానాడూ పరిపాలించారానాడూ ప్రజాక్షేమమే పరమార్ధమ్మని ప్రభువులు పలికారానాడూ పరిపాలించారానాడూ రకరకాల పన్నులను తగిలించి నీతిని చంపారీనాడూ బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది
నువ్వు నవ్వుతున్నావు పాట సాహిత్యం
చిత్రం: తల్లా పెళ్ళామా (1970) సంగీతం: టి.వి.రాజు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: మహమ్మద్ రఫీ, యస్. జానకి నువ్వు నవ్వుతున్నావు
కాలం ఈ కాలం పాట సాహిత్యం
చిత్రం: తల్లా పెళ్ళామా (1970) సంగీతం: టి.వి.రాజు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఎల్.ఆర్.ఈశ్వరి కాలం ఈ కాలం
కృష్ణయ్య కృష్ణయ్య పాట సాహిత్యం
చిత్రం: తల్లా పెళ్ళామా (1970) సంగీతం: టి.వి.రాజు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: శాంత కుమారి కృష్ణయ్య కృష్ణయ్య