చిత్రం: యుగ పురుషుడు (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల నటీనటులు: యన్.టి.రామారావు, జయప్రద, జయలక్ష్మి దర్శకత్వం: కె.బాపయ్య నిర్మాత: సి.అశ్వనీదత్ విడుదల తేది: 14.07.1978
Songs List:
ఇడిగిడిగో మన హీరోగారు పాట సాహిత్యం
చిత్రం: యుగ పురుషుడు (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి. బాలు, పి.సుశీల ఇడిగిడిగో మన హీరోగారు ఇతనికి పోటీ ఇంకెవరూ లేరు తీసుకొచ్చాను ఏంచేసుకుంటారో వెల్కం టూ యూ ! హౌడూయూడూ?? కండలు పెంచి కరాటే నేర్చి గుండెలు తీసిన వీరుడు కొండలు పిండే కొడతాడు ఆడాళ్ళకంతా మగవాడు మగాళ్ళలోకి మొనగాడు దొరికాడంటూ సంబరపడితే దూసుకుపోతాడు ఏదీ నీ చేతివాటం చూపించు చూపిస్తా చూడాలని వుందా రుచి చూడాలని వుందా YES ! O YES ! OF COURSE మిడిసి పడితే ఒడిసి పడతా బెడిసి కొడితే మడతబెడతా కన్ను కొడితే చేయి పడతా మనసు పడితే మల్లెపూల చెండుతో కొడతా WELCOME TO YOU హౌడుయూడూ : కమాన్ యంగ్ గర్ల్స్ ఇంతటివాడు అంతటివాడు ఇంతుల చేతికి చిక్కాడు పూబంతుల చేతికి చిక్కాడు చక్కని కన్నెల చిక్కంలో చిక్కిన వాడికి చిక్కేముంది అన్ని పూలకు ఒక్క తుమ్మెదే జవాబు చెబుతుంది
గాలి మళ్లింది నీ పైన..పాట సాహిత్యం
చిత్రం: యుగ పురుషుడు (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు పల్లవి: గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా ఆగనంటుంది.. రేగమంటుంది.. ఆపైన అడగకు ఏం జరిగినా గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా ఆగనంటుంది.. రేగమంటుంది.. ఆపైన అడగకు ఏం జరిగినా అహహ.. గాలి మళ్లింది నీ పైన చరణం: 1 వయసల్లె వచ్చింది జడి వానా.. తడి ముద్ద చేసింది పైపైన వయసల్లె వచ్చింది జడి వానా.. తడి ముద్ద చేసింది పైపైన సెగ ఎగిసి వచ్చింది లోలోనా.. సెగ ఎగిసి వచ్చింది లోలోనా.. మొగ గాలితో దీన్ని చల్లార్చుకోనా గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా... చరణం: 2 వానేమి చేస్తుంది వయసుండగా.. వయసేమి చేస్తుంది జత ఉండగా వానేమి చేస్తుంది వయసుండగా.. వయసేమి చేస్తుంది జత ఉండగా జతకుదిరి తీరాలి చలి ఉండగా.. చలి మంట ఎందుకు నేనుండగా అహ... గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా ఆగనంటుంది.. రేగమంటుంది.. ఆపైన అడగకు ఏం జరిగినా అహ.. గాలి మళ్లింది నీ పైన చరణం: 3 పదహారు దాటే ప్రాయానా.. పరవళ్లు తొక్కే చినదానా పదహారు దాటే ప్రాయానా.. పరవళ్లు తొక్కే చినదానా వేడెంత ఉన్నదో నీలోనా.. వేడెంత ఉన్నదో నీలోనా... ఈ వేళ తేలాలి నా జతలోనా గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా ఆగనంటుంది.. రేగమంటుంది.. ఆపైన అడగకు ఏం జరిగినా...
ఎంత వింత లేత వయసు పాట సాహిత్యం
చిత్రం: యుగ పురుషుడు (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ / వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఎంత వింత లేత వయసు
ఎక్కు ఎక్కు తెల్లగుర్రం పాట సాహిత్యం
చిత్రం: యుగ పురుషుడు (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి. బాలు ఎక్కు ఎక్కు తెల్లగుర్రం ఎక్కావా తెలియదులే మిటపల అరచేత చూపుతుంది వైకుంఠం అందులోన వుందిలే అసలైన స్వర్గం ఎక్కనీ ఎక్కనీ తెల్లగుర్రం ఎక్కానా తేలియదులే మిటపలం అరచేత చూపుతుంది వైకుంఠం అందులోనే వుందిలే అసలైన స్వర్గం పెగ్గుమీద పెగ్గు వెయ్యిరాజా నీ సిగ్గుతీరి తెలుస్తుంది మజామజా నీళ్లు కలుపుకున్నాడు నీటుగాడు నీటుగా వేసినాడు ఘాటుగాడు. కళ్ళతోటి వేస్తాను కళ్ళెం నా కాళ్ళదగ్గరుంటావు పందెం అందితేను జుటుపటి జారుతాను కిందకీ అందకుంటే కాళ్ళుపటి పాకుతాను పై పె గ్లాసులోన ముందుగా చుక్కపడ్డది చుక్క మీద తొలిసారి చూపుపడ్డది. చూపుతోబాటు కళ్ళు మూత బడ్డవి మూతబడ్డ కళ్ళమీద ముద్దుపడ్డది
ఒక్క రాత్రి వచ్చిపోరా..పాట సాహిత్యం
చిత్రం: యుగ పురుషుడు (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి.సుశీల పల్లవి : ఒక్క రాత్రి వచ్చిపోరా.. ఒక్క రాత్రి వచ్చిపోరా... వేయి రాత్రుల వెన్నెలిస్తా ఒక్క మాట చెప్పి పోరా... ఏడు జన్మలు వేచి వుంటా ఒక్క రాత్రి వచ్చిపోరా... ఒక్క రాత్రి వచ్చి పోవే... ఒక్క రాత్రి వచ్చి పోవే... వేయి పాన్పుల హయి నిస్తా.. ఒక్క మాట ఇచ్చి పోవే.. ఎన్ని జన్మలైనా కలసివుంటా.. ఒక్క రాత్రి వచ్చి పోవే... చరణం: 1 మెత్త మెత్తగా యెదనే మత్తుగా హత్తుకుపోతా... హాయి అంచు చూస్తా మెత్త మెత్తగా యెదనే మత్తుగా హత్తుకుపోతా... హాయి అంచు చూస్తా కన్నెమోజులే నిన్నల్లుకోనీ.. కన్నెమోజులే నిన్నల్లుకోనీ.. కౌగిలింతలే నా ఇల్లు కానీ ఒక్క రాత్రి వచ్చిపోరా.. చరణం: 2 ఆవిరావిరౌతున్నది నా అందము ఆవురావురంటున్నది నీ కోసము ఆవిరావిరౌతున్నది నా అందము ఆవురావురంటున్నది నీ కోసము నీ సొగసే ఆవిరైతే నా వయసుకు ఊపిరి నీ సొగసే ఆవిరైతే నా వయసుకు ఊపిరి పెదవెంగిలితో తీరును.... ప్రేమ అనే ఆకలి ఒక్క రాత్రి వచ్చి పోవే... ఒక్క రాత్రి వచ్చిపోరా ... వేయి రాత్రుల వెన్నెలిస్తా ఒక్క మాట ఇచ్చి పోవే... ఎన్ని జన్మలైనా కలసివుంటా ఒక్క రాత్రి వచ్చి పోవే.. ఒక్క రాత్రి వచ్చిపోరా ...
బొబ్బర్లంక చిన్నది పాట సాహిత్యం
చిత్రం: యుగ పురుషుడు (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి.సుశీల బ్బబ్బబ్బ.... బొబ్బర్లంక చిన్నది కొబ్బరిలాగా వున్నది అనకాపల్లి బెల్లంముక్క పెడితే వస్తానన్నదీ నేనడిగిందిస్తానన్నదీ..... అమ్మమ్మమ్మో ... బెల్లంపల్లి బుల్లోడు అల్లంలాగా వున్నాడు పాలకొలు బత్తాయిపండు ఇస్తే వస్తానన్నాడు. నా కిస్తే వస్తానన్నాడు గళ్ళకోక చుట్టుకుంటే వళ్ళుమండి పోతుంటే ఆగలేను వేగలేను అన్నాడు సోకులన్నీ నావైతే కోక నిన్నువాటేస్తే ఆగమంటే ఆగుతాడా కుర్రాడు చిచ్చురేగింది కొత్త పిచ్చి పట్టింది గ్లాసులోన ముందుగా చుక్కపడ్డది చుక్క మీద తొలిసారి చూపుపడ్డది. చూపుతోబాటు కళ్ళు మూత బడ్డవి మూతబడ్డ కళ్ళమీద ముద్దుపడ్డది పిచ్చిముదిరి పిల్ల కుదిరి పెళ్ళి అంటుంది ॥ బెల్లంపల్లి ॥ రాగాన పడ్డదిపుడే శృతిమించింది కధ అపుడే ఆ కంటి చూపులు నీ కొంటె పిలుపులు కళలన్ని తెలిపాయిలే పాకాన పడ్డదిప్పుడే రసపట్టయిన కధ యిదిలే పాలేటి పొంగులు జారేటి కొంగులు కధలన్ని చెబుతాయిలే గట్టు తెగుతుంది మనగుట్టు చెడుతుంది పట్టు విడుపు లేని సరసం రటు అవుతుంది పంటుకుంటే పక్క వేడి ఒంటిగుంటే వళ్ళు వేడి ఇద్దరొకటికాక వేడి అన్నాడు ఒంటిగుం టే జంటరావు పండుకుంటే పక్కలేవు కౌగలిస్తే కాకతీరు నీ తోడు ఈడు వచ్చింది నిన్నే తోడు కోరింది పూల పల్లకి ఎక్కమంటూ పోరు పెట్టింది