చిత్రం: బంగారు కలలు (1974) సంగీతం: సాలూరి రాజేస్వరరావు నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వహీదా రెహమాన్, లక్ష్మీ దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు నిర్మాత: డి.మధుసూదనరావు విడుదల తేది: 04.06.1974
Songs List:
సింగారం చిందులు పాట సాహిత్యం
చిత్రం: బంగారు కలలు (1974) సంగీతం: సాలూరి రాజేస్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: పి.సుశీల & బృందం సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా పూల బాటగా భ్రమిశేరు ముళ్ళబాట నడచేరు హద్దు మీరి తిరిగేరు అల్లరిపాలౌతారు కలతలున్న సంసారాలు రాలిపోయి వాడిన పూలు ప్రేమ లేని జీవితాలు పాముపడగ నీడలు లోకం పోకడ తెలియకపోతే మోజుల్లో పడి ముందుకుపోతే బతుకు చీకటై పోతుంది చివరకు కన్నీరే మిగులుతుంది
నాలోన వలపుంది పాట సాహిత్యం
చిత్రం: బంగారు కలలు (1974) సంగీతం: సాలూరి రాజేస్వరరావు సాహిత్యం: దాశరధి కృష్ణమాచార్యులు గానం: పి.సుశీల నాలోన వలపుంది. మీలోన వయసుంది ఈ రేయెంతో సొగ సైనది! కన్నుల్లో కైపుంది, చేతుల్లో మధువుంది, తనువూ మనసూ పొంగే వేళ నాట్యాల అలరించి స్వప్నాల తేలించు నీ రాణి నేనే! నారాజు నీవే ! నావారినే వీడి మీ చెంతనే చేరి ఆడీ, పాడి జీవించేను వెతలన్ని మరిపించి మురిపాలు కురిపించు ప్రియురాలు నేనే జవరాలు నేనే !
పుట్టినరోజు జేజేలు పాట సాహిత్యం
చిత్రం: బంగారు కలలు (1974) సంగీతం: సాలూరి రాజేస్వరరావు సాహిత్యం: దాశరధి కృష్ణమాచార్యులు గానం: పి.సుశీల పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి కళకళ లాడే నీ కళ్ళు దేవుడి ఇళ్ళమ్మా కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా కళకళ లాడే నీ కళ్ళు దేవుడి ఇళ్ళమ్మా కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా నీకోసమే నే జీవించాలి నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి ఆటలలో చదువులలో మేటిగ రావాలి మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి నీ పసి హృదయంలో వెన్నెల కాయాలి నా బంగారు కలలే నిజమై నిలవాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాధుడు కావాలి నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాధుడు కావాలి నీ సంసారం పూల నావలా సాగిపోవాలి నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి నిన్నే నే తలచి నే పొంగిపోవాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
చెక్కిలిమీద కెంపులు పాట సాహిత్యం
చిత్రం: బంగారు కలలు (1974) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దాశరథి గానం : సుశీల, రామకృష్ణ చెక్కిలిమీద కెంపులు మెరిసే చిలకమ్మా చక్కదనాలా ముక్కున కోపం యేలమ్మా చెలికాని పై అలకెందుకే నీ జతగానితో తగవెందుకే చిలకను చూసి సిగ్గుపడే ఓ గోరింకా వలపే గాని నీపై అలక లేదింక, అనురాగమే గెలిచిందిలే నీ మనసేమిటో తెలిసిందిలే ! గగనాన మేఘం తొలగిందిలే రవి మోము నేడు వెలిగిందిలే అనుమానాలు తీరాయి అభిమానాలు పెరిగాయి అనురాగమే గెలిచిందిలే నీ మనసేమిటో తెలిసిందిలే నా ప్రేమ గీతం నీవేలే ఆ పాట భావం నీవేలే కమ్మని రాగం నీవైతే కలిసిన తాళం నీవైతే ఆ గానమే మన ప్రాణము నీమీదనే నా ధ్యానము ని బుగ్గమీద నే చుక్కనే పాదాల పై న పారాణినే పచ్చని పెళ్ళిపందిరిలో ముచ్చటగొలిపే సుందరినే ఈ నాటితో నవజీవనం మన జీవితం బృందావనం
సింగారం చిందులు పాట సాహిత్యం
చిత్రం: బంగారు కలలు (1974) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: పి. సుశీల సింగారం చిందులు వేసే అమ్మాయుల్లారా బంగారు కలలే కంటున్నారా పూలబాటగా భ్రమిశేరు ముళ్ళబాట నడిచేరు వలపుపొంగు వయసులోన కన్ను మిన్ను కానలేరు హద్దుమీరి తిరిగారంటే అల్ల రిపాలై పోతారు , విరబూసిన పువ్వులాంటిది అతివ జీవితం మనసిచ్చిన భర్త దొరికితే అదే మధుర జీవితం పడరాని చేతిలో పడితే అదే వెతల జీవితం అదే వెలితి జీవితం అంధకార బంధురం కలతలున్న సంసారాలు రాలిపోయి వాడిన పూలు ప్రాణమున్న పువ్వులే పడుచు పిల్లలు అనురాగమే సుగంధం త్యాగమే మకరందం సొగసులే రంగులు - సోయగాలే ఆకర్షణలు లోకం పోకడ తెలియకపోతే మోజుల్లోపడి ముందుకుపోతే బ్రతుకు భారమైపోతుంది చివరకు కన్నీరే మిగులుతుంది!
నీ కన్నులలో పాట సాహిత్యం
చిత్రం: బంగారు కలలు (1974) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: దాశరథి గానం : సుశీల, రామకృష్ణ పల్లవి: నీ కన్నులలో నే చూశానులే.. నీ కన్నులలో నే చూశానులే.. అది నా రూపమే అందుకనే యిద్దరిదీ వీడని బంధం.. ఈ అనుబంధం నా హృదయంలో నే దాచానులే.. అది నీ రూపమే అందుకనే యిద్దరిదీ వీడని బంధం.. ఈ అనుబంధం చరణం: 1 పున్నమి వెన్నెలలో.. కన్నులు కలిపావూ.. చిటపట చినుకులలో.. చెంతకు చేరావూ పున్నమి వెన్నెలలో.. కన్నులు కలిపావూ.. చిటపట చినుకులలో... చెంతకు చేరావూ చలి చలి గాలులలో వలపులు రేపావు అందుకనే తొందరగా మెడలో తాళి.. మెరిపించాలి నా హృదయంలో నే దాచానులే.. అది నీ రూపమే అందుకనే యిద్దరిదీ వీడని బంధం.. ఈ అనుబంధం చరణం: 2 అల్లరి చూపులతో ఆశలు పెంచావూ.. చల్లని మాటలతో మల్లెలు చల్లావూ అల్లరి చూపులతో ఆశలు పెంచావూ.. చల్లని మాటలతో మల్లెలు చల్లావూ తీయని నవ్వులతో తేనెలు చిందావూ అందుకనే తొందరగా.. ఆలూ మగలం.. అయితే అందం నీ కన్నులలో నే చూశానులే.. అది నా రూపమే అందుకనే యిద్దరిదీ వీడని బంధం.. ఈ అనుబంధం నా హృదయంలో నే దాచానులే.. అది నీ రూపమే అందుకనే యిద్దరిదీ వీడని బంధం.. ఈ అనుబంధం
మంచితనానికి తావేలేదు పాట సాహిత్యం
చిత్రం: బంగారు కలలు (1974) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: ఆత్రేయ గానం : ఘంటసాల మంచితనానికి తావేలేదు మనిషి గ మసలే వీలులేదు మనసుకు మమతకు విలువేలేదు నీకు తెలుసు నిన్నెందుకు ఆదరించి నానో నాకు తెలుసు నన్నెందుకు దూరంచేశావో తెలియనదొకటే మనకు లోకం విసిరిన బాకు ఎంత గాయం చేస్తుందో ఎవరి బ్రతుకు ఏమౌతుందో ! అనుమానానికి అనురాగాన్నే బలిచేశావు నీకిచ్చిన మనసు ఎంత స్వచ్ఛమో ఎరుగక నిందించావు నిజమన్నది నిప్పువంటిది నివురు గప్పి అది వుంటుంది ఎవరి గుండెలో ఎంత రగులుతుందో ఏమి మిగులుతుందో ! నాకు తెలుసు ఆప్తులే శత్రువులౌతారని నీకు తెలుసు సంఘానికి కళ్ళేలేవని తెలియని దేదీలేదు తెలిసీ ఫలితం లేదు మనసుకు మరుపేలేదు. ఏదీలేని బ్రతుకే చేదు !
తాగుబోతు నాయాళ్ళు పాట సాహిత్యం
చిత్రం: బంగారు కలలు (1974) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం : మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, రఘురాం తాగండిరా తాగుబోతు నాయాళ్ళు కాకండిరా ఎవడు దొరుకుతాడా అని ఎదురు చూడరా తేరగ వచ్చిందంటే జోరు చెయ్యరా యుషార్ హుషార్ ఈ గుంటనక్క పక్క వాణ్ణి తాగిస్తాడు ఒక పెగ్గుతోటి పనులన్ని సాధిస్తాడూ తలలు మారుస్తాడు ఈ పిచ్చినాన్న దిమ్మ దిరగ తాగుతుంటాడు సీసా కనబడగానే ఊగుతుంటాడు తూగుతుంటాడు చదువూ సంధ్యా లేని చవటవై జల్సాలను మరిగున్నావూ ఏమన్నావ్ ? చదువూ సంధ్యా లేని చవటవై జల్సాలను మరిగున్నావు , ఐనవాళ్ళలో తగవులు పెంచీ కోర్టుల కెక్కించావు ఉన్నమాట అన్నావురో నిన్ను మెచ్చుకోవాలి రో ఇసుక తక్కెడా పేడ తక్కెడా యెదవల్లారా - వాగకండిరా దొరలు కూడ మితంగానె తాగుతుంటారు గప్పు చిప్పుగ ముసుగుదన్ని పడుకుంటారు గుర్రు పెడుతుంటారు నీలాగ గుడ్డలిప్పుక గంతులెయ్యరు నీలాగ పూజ లంటూ తప్పతాగరు తగాద ముదురుతు వుందిరో తమాయించితే మంచిదిరో పిల్లి లాగ చేరాడురో మా ఇల్లు గుల్ల చేశాడురో దమ్మిడీకి కొరగావురో దగుల్బాజి వైనావురో చెప్పుదెబ్బ తింటావురో వెధవ కుంకా పక్షి లుచ్ఛా ఆగండిరా-మీరు ఆగండిరా తాగుబోతు నాయాళ్ళ లార ఆగండిర