Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Karthika Pournami (1987)



చిత్రం: కార్తీక పౌర్ణమి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు , యస్.జానకి
నటీనటులు: శోభన్ బాబు, రాధిక , భానుప్రియ
దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 1987

పల్లవి:
మనువాడిన మదన పంచమి
మనసిచ్చిన మధుర సప్తమి
పులకింతలు నవ్విన నవమి
ప్రణయానికి విజయదశమి
కౌగిలిలో జాబిలితో కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి

చరణం: 1
మధురం మౌనం నయనం పాడి సంగీతం
వధనం పువ్వై మధుపం వాలే ఋతుగీతం
అధర సంగమం చుంబనం
హృదయ సంగమం శోభనం
చిగురించనీ సంసారం చిరకాలమి అనురాగం
వెన్నెలలో నీడలలో కళ్యాణ పౌర్ణమి కార్తీక పౌర్ణమి

మనువాడిన మదన పంచమి
మనసిచ్చిన మధుర సప్తమి

చరణం: 2
తిలకం పసుపు ఉసురై నిలిపే సౌభాగ్యం
ప్రణయం ప్రణవం ప్రాణం కలిపే సౌందర్యం
మధన వేళలో సాగరం పొంగి పొరలిన అమృతం
విరబూసిన కల్హారం తెరతీసిన రసతీరం
కలలు గని కలయికలో కాముని పున్నమి కార్తీక పౌర్ణమి

మనువాడిన మదన పంచమి
మనసిచ్చిన మధుర సప్తమి
పులకింతలు నవ్విన నవమి
ప్రణయానికి విజయదశమి
కౌగిలిలో జాబిలితో కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి


మనువాడిన మదన పంచమి
మనసిచ్చిన విధుర సప్తమి
పులకింతలు రాలిన నవమి
ప్రణయానికె విలయదశమి
కన్నులలో పెల్కుభికే కన్నీటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి

Most Recent

Default