చిత్రం: కథలో రాజకుమారి (2017)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: బాలాజీ
గానం: విభవరి
నటీనటులు: నారారోహిత్ , నాగ సౌర్య, నమిత ప్రమోద్, నందిత రాజ్
దర్శకత్వం: మహేష్ సూరపనేని
నిర్మాత: సుధాకర్ రెడ్డి బీరం
విడుదల తేది: 15.09.2017
నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలుచుకున్న రాణివాసంగానే
ఈ నేలే ఉయ్యాలై పాడుతుంది సరిగమలే
మేఘంలో నీ పేరే తిరుగుతున్నా లోకాలే
మనసే రాసె చందమామ కథ నేనే
నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలుచుకున్న రాణివాసంగానే
చూసుకుంటాను నన్నే నేనే పూసే పువ్వుల్లో
విరబూసే నవ్వుల్లో
పాడుకుంటాను ఆటే ఆడి ఊగేకొమ్మల్లో
ఆ కోయిల గొంతుల్లో
కనిపించే సంతోషం నను చేరకుంటె రాదు
చిగురించే ఆనందం నను పెంచుకున్న నాది
కదనంటే రాను వెంటే చిన్నబోతుంది నీ అందం
నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలుచుకున్న రాణివాసంగానే
దాచుకున్నాను కన్నుల్లోనే ఏవో ఆపదలు
ఎపుడొస్తాయో కలలు
గుడుకట్టేసి గుండెల్లోనే ఉండే స్నేహాలు
ఎదురవుతాయా అసలు
కనిపించే ఆకాశం సిరివెన్నెలమ్మ నేస్తం
కురిసిందా చిరుజల్లే ఈ నేలతల్లి సొంతం
ఎక్కడుందో ఎక్కడుందో నన్ను చేరేటి ఆనందం
నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలుచుకున్న రాణివాసంగానే
ఈ నేలే ఉయ్యాలై పాడుతుంది సరిగమలే
మేఘంలో నీ పేరే తిరుగుతున్నా లోకాలే
మనసే రాసె చందమామ కథ నేనే
నా కథలో యువరాణి వేరెవరొ కాదు నేనే
నా ఎదనే మలుచుకున్న రాణివాసంగానే