Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pathala Bhairavi (1951)




చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్. టి.రామారావు, యస్.వి.రంగారావు, కె.మాలతి
దర్శకత్వం: కదిరి వెంకటా రెడ్డి (కె.వి.రెడ్డి)
నిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 15.03.1951



Songs List:



తీయని ఊహలు పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: పి.లీల

తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే
వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
వని అంతా జలదరించెనే తనువెంతో పులకరించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

ఓ ఓ ఓ ఓ 
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
వని అంతా రవళించేనే నన్నెంతో మురిపీంచేనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్





ఇతిహాసం విన్నారా పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: టి.జి.కమలాదేవి 

ఇతిహాసం విన్నారా 



కలవరమాయే మదిలో పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో

కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో





ఎంత ఘాటు ప్రేమయో పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను కాంచుచున్నదిగా కళలు విరిసెనే 
నా మనసు మురిసెనే నా మనసు మురిసెనే
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో

ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో
కన్నులలో కనిననంతనే తెలిసిపోయెనే 
నా మనసు నిలిచెనే నా మనసు నిలిచెనే
ఎంత లేత వలపులో

ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
విరహములో వివరాలను విప్పిచెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో

ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుచేయరే

ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో




వినవే బాల నా ప్రేమగోల పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: రేలంగి

వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల
నీకే నువ్వేల నిలువగజాల
వినవే బాల నా ప్రేమగోల

గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
వినవే బాల నా ప్రేమగోల

చిరునవ్వుచాలే చిత్తైపోతానే
చిరునవ్వుచాలే చిత్తైపోతానే
మురిపించేస్తాలే మూర్చైపోతానే
వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల

జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
మేడమీద పైడబంగార్ తూగుటుయ్యాల్ వేడుకల్గా ఊగరావా ఊగరావా ఊగరావా ఊగరావా 

చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
చెట్టాపట్టిల్ జడకోలాటం
చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఉప్ ఉప్ తొక్కుడుబిళ్ళ ఆడేనాతో 
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో




వగలోయి వగలు పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: జిక్కీ & కోరస్ 

పల్లవి:
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ
బావలూ మామలూ బావలు మావలు భామలూ
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
లాలలో

చరణం: 1
సింగారి వీధంట మావా రంగేళి పిల్లంట బావా 
సింగారి వీధంట మావా రంగేళి పిల్లంట బావా 
కొంగు తాకిందంటె హేయ్ హేయ్
కొంగు తాకిందంటె కూయి కూయి కూయునే
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలు

చరణం: 2
నీ వెంట వస్తాను, ఆఁ... 
నీ జంట ఉంటాను... నీ వెంట వస్తాను
నీ జంట ఉంటాను... యేఁ?
సయ్యంటే బావా... ఊఁ అంటే మావా
సయ్యంటే బావా... ఊఁ అంటే మావా
చెలీయనీ భలేయని సరే యనీ చలామణి
నా వెంట మీరంతా గూమి గూమి గూడితే
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు
వగలోయ్ వగలు థళుకు బెళుకు వగలు

ధీం తత తత ధీం తత తత ధీం తత తత
వగలోయ్ వగలు తలుకు బెలుకు వగలు
ఓ..ఓ..ఓ

చరణం: 3
తరిగినతక నకతక జం
ఝనంతరి తకిట ఝంతకతోం
తకిటతై తకిటతై తకిటతై తకిటతై
తలాంగుతోం తలాంగుతోం తలాంగు...

తాళలేనే నే తాళలేనే
భామలారా ఓయమ్మలారా
ఇందరిలోనూ నీ సొమ్ములేవే
నా నాధుడేడే శ్రీకృష్ణుడేడే
తాళలేనే నే తాళలేనే
తాళలేనే ఓ యమ్మా
అవునే భామామణీ...
తధిగినతోం తధిగినతోం తధిగిన
తాళలేనే నే తాళలేనే 
తాళలేనే నే తాళలేనే
తాళలేనే నే తాళలేనే
తాళలేనే తాళలేనే తాళలేనే... 






ప్రేమకోసమై వలలో పడినే పాపం పసివాడు పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: వి.జె.వర్మ 

పల్లవి:
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు.
అయ్యో పాపం పసివాడు
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు

వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరకొనీ
ఓ... ఓ...ఓ... ఓ... ఓ... ఓ...ఓ... ఓ...
వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరుకొనీ
ఏమైనాడో ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు

చరణం: 1 
ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ
ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ
సమసిచూచు ఆ రాజకుమారిని నిముషమె యుగముగ గడపుమనీ

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు

చరణం: 2 
ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ఏమి రాసెనో అటుకానిమ్మని బ్రహ్మదేవుదె భారమనీ...

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు
అయ్యో పాపం పసివాడు.... 






హాయిగా మనకింక స్వేచ్చగా పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

ప్రణయజీవులకు దేవివరాలే
కానుకలివియే ప్రియురాల
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా
చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా
కలసిమెలసి పోదమోయ్ వలపుబాటన
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ
నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ
నీవు నేను విడివడని ప్రేమమాలగా
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

కలలు నిజముకాగా కలకాలమొకటిగా
కలలు నిజముకాగా కలకాలమొకటిగా
తెలియరాని సుఖములలో తేలిపోవగా
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా - స్వేచ్చగా - హాయిగా





కనుగొన గలనో లేనో పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల

కనుగొన గలనో లేనో 
కనుగొన గలనో లేనో 
ప్రాణముతో సఖిని 
కనుగొన గలనో లేనో

పెండ్లి పీట పై ప్రియనెడబాయ 
గాలి మేడలు గారడి కాగా
పెండ్లి పీట పై ప్రియనెడబాయ 
గాలి మేడలు గారడి కాగా
కల కాలమును కర్మను దూరుచు 
కలగ బ్రతకడ మేనో

కనుగొన గలనో లేనో 

వెదకి వెదకి ఏ జాడ తెలియక 
హృదయమంత చీకటిగా
వెదకి వెదకి ఏ జాడ తెలియక 
హృదయమంత చీకటిగా
ఎంత పిలిచినా పిలుపే అందక
చింతిని తిరగడమేనోయ్

కనుగొన గలనో లేనో 

పులివాతను బడు బాల హరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా
పులివాతను బడు బాల హరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా
జాలిలేని ఆ మాయదారికే
బలిగా చేయడమేనో...

కనుగొన గలనో లేనో 
ప్రాణముతో సఖిని 
కనుగొన గలనో లేనో
కనుగొన గలనో లేనో




రానంటే రానోయి పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: పిఠాపురం, టి.జి. సరస్వతి 

రానంటే రానోయి 


Most Recent

Default