చిత్రం: చిక్కడు దొరకడు (1967)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్. టి.రామారావు, జయలలిత, కృష్ణకుమారి
మాటలు ( డైలాగ్స్ ): వీటూరి
స్క్రీన్ ప్లే : బి.విఠలాచార్య , సి.నారాయణరెడ్డి, వేటూరి
దర్శకత్వం: బి.విఠలాచార్య
నిర్మాతలు: పొట్లూరి వెంకటనారాయణ, కుదరవల్లి సీతారామ స్వామి
సినిమాటోగ్రఫీ: హెచ్. యస్.వేణు
ఎడిటర్: యస్.గోవింద స్వామి
బ్యానర్: శ్రీ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్
విడుదల తేది: 1967
(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు. అలాగే ఈ సినిమాలో వీటూరి గారు కన్నెపిల్ల అనగానే అందరికీ అలుసే అనే పాట కూడా రాశారు )
చిత్రం: చిక్కడు దొరకడు (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల
పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏదీ ఏదీ
అందమైన నీ మోమే అదిగా కింకేది కానరాని మన్మధుడేమో
కనుపించెను ఏడీ ఏడీ ఎదుటవున్న నీవేలే ఇంకా ఎవరోయీ
వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ ఏవీ ఏవీ
అవి నీ సిగలోనే ఉన్నాయి, పదును పదును బాణాలేవో
ఎదను నాటుకుంటున్నాయీ ఏవీ ఎవీ అవి నీ ఓరచూపులేనోయీ
ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు
ఏమో ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో
******* ******* ********
చిత్రం: చిక్కడు దొరకడు (1967)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
విరిసిన ఇంద్ర చాపమో...
భువిన్ ప్రభవించిన చంద్ర బింబమో...
మరు పువుబంతియో.. రతియో.. మల్లెల దొంతియో.. మోహకాంతియో
సరస కవీంద్ర కల్పిత రసాకృతియో .. నవ రాగ గీతియో ఓ...
వర సరసీరుహానన ..విరాన.. వరించి.. తరింప చేయవే...ఏ ఏ ఏ ఏ...
పగటి పూట చంద్ర బింబం అగుపించెను
ఏదీ?.. ఏదీ?
అందమైన నీ మోమే అది గాకింకేది
కానరాని మన్మథుడేమో కనిపించెను
ఏడీ?.. ఏడీ?
ఎదుట ఉన్న నీవేలే ఇంకా ఎవరోయి
చరణం: 1
వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి
వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి
ఏవి?.. ఏవి?
అవి నీ సిగలోనే ఉన్నాయి
పదును పదును బాణాలేవో యెదను నాటుకుంటున్నాయి
పదును పదును బాణాలేవో యెదను నాటుకుంటున్నాయి
ఏవి?.. ఏవి?
అవి నీ ఓర చూపులేనోయి
పగటి పూట చంద్ర బింబం అగుపించెను
ఏదీ?.. ఏదీ?
అందమైన నీ మోమే అది గాకింకేది
చరణం: 2
ఇంత చిన్న కనుపాపలలో..ఎలా నీవు దాగున్నావు?
ఇంత చిన్న కనుపాపలలో..ఎలా నీవు దాగున్నావు?
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించావు?
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించావు?
ఏమో?.. ఏమో?
ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో...
ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో
ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో
****** ****** ******
చిత్రం: చిక్కడు దొరకడు (1967)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని
దోచుకోనా నీ పరువం ...దాచలేనే ఈ విరహం
చరణం: 1
పూలలోన సోయగాలు పొంగిపోయే నీలోన
నింగిలోని చందమామ తొంగి చూసె నీలోన
మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన
మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన
మరులొలికే నీ మగసిరి చూసి కరిగిపోదును లోలోనా
దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని
దోచుకోనా నీ పరువం... దాచలేనే ఈ విరహం
చరణం: 2
మేనిలోన వీణలేవో మెలమెల్లగ పలికినవి
మనసులోన తేనెలేవో సనసనాగ ఒళికినవి
నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది
నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది
వగలులూరే నీ నగవులు దాగే వలపు బాస తెలిసింది
దోర నిమ్మపండులాగ ఊరించే దొరగారు
దోచుకో ఇక నా పరువం... దాచుటెందుకు నీ విరహం