చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్ దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి నిర్మాతలు: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబు విడుదల తేది: 01.12.2000
Songs List:
నీలి నింగిలో పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: హరిహరన్ నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి దేవుడు కనబడి వరమిస్తే వేయిజన్మలు ఇమ్మంటా ప్రతి ఒక జన్మ నాకంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా దేవత నీవని గుడి కడతా దేవత నీవని పూజిస్తా నువ్వు రావాలి నీ నవ్వు కావాలి నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి ప్రేమకు మరుపే తెలియదులే నిన్ను ఎన్నడు మరువదులే తెరలను తీసి నను చూడు జన్మ జన్మలు నీ తోడు వాడనిదమ్మ మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు నువ్వు రావాలి నీ నవ్వు కావాలి నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
మైనా ఏమైనావే పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: వేటూరి గానం: ఉన్ని కృష్ణన్ , చిత్ర పల్లవి: మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూల మాలిక చెలి పూజకే ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం చరణం1: విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు చలి గాలి సాయంత్రాల స్వాగతమే పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు ఎదతోనే ముందుగా చేసే కాపురమే ఎవరేమైనా.. ఎదురేమైనా... నేనేమైనా.. నీవేమైనా... ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం చరణం2: సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు కాటేస్తే కాదంటానా ఇపుడైనా వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూల మాలిక చెలి పూజకే ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
మా లోగిలిలో పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: ఎస్.పి.బాలు, చిత్ర, సుజాత మోహన్ మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే ఈ ఇంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే రాముడు అడవికి వెళ్లేనా నువ్వే అన్నై ఉండుంటే ఏసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే ఆన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే తమకున్నదొక్కన్నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే ఇంతటి చక్కని బంధాన్ని కాలం ఆగి చూసేను రాత రాయు ఆ బ్రహ్మ రాయుట ఆపి మురిసేను తపమేమి చేశామో తమ్ముల్లమ్మయ్యాములే తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యములే మా దేవుడు మాకుండగా మరి మాకిక లోటేది కలతకు చోటేది మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే ఈ ఇంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే
పిల్ల భలే దీని ఫిగరు భలే పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: భువనచంద్ర గానం: ఎస్.పి.బాలు, స్వర్ణలత పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిస లాడే సొగసుని మోసే లేత నడుము వంపు భలే ఉయ్యాల లూగే వయసు భలే గురుడు భలే వీడి పొగరు భలే మనిషి భలే మగసిరులు భలే కొత్త కొత్త ప్రేమలోనే మత్తు ఉన్నది ముత్యమంత ముద్దులోనే మోక్షమున్నది ముద్దులంటే అంతులేని మోజు ఉన్నది జోడు కొస్తే పాడుమనసు బిడియమన్నది వనికిన వయసు తొణికిన సొగసు తరగని ప్రేమకు సాక్ష్యము అమ్మతోడు త్వరపడకు అమ్మాయి నీదే కడవరకు పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే కొంగుచాటు అందమేదో విచ్చుకున్నది కాక రెచ్చి కన్నె గుండె ఝల్లుమన్నది కోక దాటు పొంగులోనే కైపు ఉన్నది ఘాటు కౌగిలింతలోనే స్వర్గమున్నది తొలి తొలి వలపు తొలకరి చినుకు ఎంతో మధురం నేస్తమా మోతగుందే ముడిసరుకు ఇక రాదులే కంటికి కునుకు పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే హొయ్ పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిస లాడే సొగసుని మోసే లేత నడుము వంపు భలే ఉయ్యాల లూగే వయసు భలే
కదిలే అందాల నది పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: సుఖ్విందర్ సింగ్, అనురాధ శ్రీరామ్ కదిలే అందాల నది అరెరే నను ముంచినది ఇక తేలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ కదిలే అందాల నది అరెరే నను ముంచినది వాన విల్లు పూల జల్లు రూపు కడితే నువ్వే కాదా నవ్వే కాదా కొంటె కళ్ళు చూపు ముళ్ళు గుచ్చి పెడితే సిగ్గు రాదా చిచ్చు కాదా నీకు పెట్టిన పేరుది భాగ్యం జన్మించానే ప్రతి రోజు నీ పేరు పలికి పలికి నా పెదవి తేనెలాయె నీ మాట వింటూ వింటూ నా మనసు ఊయలాయె కదిలే అందాల నది అరెరే నను ముంచినది చిలక వచ్చి వాలగానే చిట్టి కొమ్మకి సోకులొచ్చే శోభలొచ్చే ప్రేమ మెచ్చి తాకగానే చిన్ని గుండెకి ఊహలొచ్చే ఊసులొచ్చే నువ్వు ఎపుడూ పక్కన ఉంటే ఎక్కడున్నా అద్భుతమే నీ గాలి సోకగానే నా దారి మారిపోయె నిమిషానికున్న విలువే నువ్వు దగ్గరుంటే తెలిసె కదిలే అందాల నది అరెరే నను ముంచినది ఇక తేలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమా నా గుండె లయ ఓ ప్రియా ప్రియా సఖుడా నీవే సుమా నా గుండె లయ
తాజాగా మా ఇంట్లో పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: చిత్ర, మనో, సుజాత మోహన్ తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను దర్జాగ మా మరిది ఇక రాజాలా తిరిగేను కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను పండుగ కాని రోజేదంట మనసున నేసిన మమతల పొదరింట అందరికోసం వంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంటా ఈ ఇల్లే వెయ్యిల్లు మొదలవును ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను జానెడు తాడు కట్టినవాడు జన్మలు ఏలే నీ జోడవుతాడు పున్నమి రెమ్మా పుత్తడి బొమ్మా మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మా ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద భాష్పాలు దీవించు తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా
నీలి నింగిలో (విషాద గీతం) పాట సాహిత్యం
చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: హరిహరన్ నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే నువులేని నేను శిలను మెలకువే లేని కలను నిను వీడి నే లేను నే ఓడి మనలేను నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే ప్రేమకు మరుపే తెలియదులే మనసు ఎన్నడు మరువదులే తెరలను తీసి నను చూడు జన్మ జన్మకు నీతోడు వాడనిదమ్మ మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు నేల దిగిరావే నన్నేల మరిచావే నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే దేవుడు కనబడి వరమిస్తే వేయి జన్మలు ఇమ్మంటా ప్రతియొక జన్మ నాకంటే నిన్ను మిన్నగ ప్రేమిస్తా దేవత నీవని గుడికడతా జీవితమంతా పూజిస్తా నేల దిగిరావే నన్నేల మరిచావే నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే నువులేని నేను శిలను మెలకువే లేని కలను నిను వీడి నే లేను నే ఓడి మనలేను నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే