చిత్రం: శౌర్యం (2008)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: గోపిచంద్ , అనుష్క , పూనమ్ కౌర్
మాటలు ( డైలాగ్స్ ): యమ్. రత్నం
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సిరుతై శివ
నిర్మాత: వి. ఆనంద ప్రసాద్
సినిమాటోగ్రాఫీ: వెట్రీ
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
బ్యానర్: భవ్య క్రియేషన్స్
విడుదల తేది: 25.09.2008
చిత్రం: శౌర్యం (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దీపు , మాళవిక
బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం
బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం
నువ్వు తాకితే తీగ లాగితే
నరనరాన్నిలా వీణ మీటితే
మరుడా మన్మధ గురుడా
మొదలయ్యిందేదో తేడా
నా తలపుల్లోన తలగడ పైన నీదేరా నీడ
బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం
నీలాగుండే మగవాడే నాక్కావాలంటూ కలగన్నా
తీరా నువ్వే ఎదురొస్తున్నా ఏంటో కంగారవుతున్నా
గిచ్చాయండి గిలిగింతయ్యే మాయాజాలం చూస్తూన్నా
రంగులు మారే బంగారంలా నీకే నిను చూపిస్తున్నా
అమ్మో నీ వల్లేనా అమ్మాయైపోతున్నా
అందం అందిస్తాలే హైరానా పడుతున్నా
చెయ్యారా లాలిస్తూ నీ బిడియాన్ని పక్కకు నెడుతున్నా
కలిసేదాక నాలో ఉంది నువ్వేనంటూ తెలియదుగా
కన్నులు మూసి గుండెల్లోకి ఎపుడొచ్చావో అల్లరిగా
ఇదిగో చూడు వచ్చానంటూ ప్రేమే నీకు చెప్పదుగా
తనకై తాను కనిపించందే ఏ మనసు గుర్తించదుగా
అంటే నేనిన్నాళ్లు నాలో నిన్ను మోసానా
నువ్వేంటో తెలియందే నీతో గడిపేశానా
నువునేను పుట్టక ముందే ఈ బంధం కలిసిందే మైనా
బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం
నువ్వు తాకితే తీగ లాగితే
నరనరాన్నిలా వీణ మీటితే
మరుడా మన్మధ గురుడా
మొదలయ్యిందేదో తేడా
నా తలపుల్లోన తలగడ పైన నీదేరా నీడ