Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Raja Kumarudu (1999)





చిత్రం: రాజకుమారుడు (1999)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: మహేష్ బాబు, ప్రీతి జింటా, ఘట్టమనేని కృష్ణ
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: సి.అశ్వనీదత్
విడుదల తేది: 30.07.1999



Songs List:



గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: రాజకుమారుడు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయన్, కవితా కృష్ణమూర్తి

లల లాల లాల లాలా...
లల లాల లాల లాలా...

గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉంది
అదివో హరే రామచిలుకా
మెలికా మహా మహులకెరుకా
నువ్వో మరీ లేతకనుకా నీకా తికమక తెలియదికా

గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా

కాటన్ జీన్సులో నీముందుకొస్తే అల్లర్లు ఏంటంది
కొతొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేసమొస్తుంది
మొటర్ బైక్సులో రైడింగుకెల్తే మీ ఈలలేంటంది
ఫ్లాటయ్యేట్టుగా కట్టింగులిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాలనీ అన్నయ్యలనమంది
ఆప్లేసులో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి
ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా

గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా

ఫ్రూటీ డ్రింక్సులో స్ట్రావేసుకుంటే కామెంట్లు ఎంటంది
స్రుతి పెదాలే కస్టాలుపడితే మాగుండె చెరువౌద్ది
ఎన్నో బుక్సుతో కాలేజికెల్తే మీలుక్సు ఎంటంది
చిన్ని చేతులే లగేజి మోస్తే మా కన్ను ఎరుపౌద్ది
ట్రాఫిక్కులో కావాలనే పాకిన్లు ఏంటంది
కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి
ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
నాకది భలే తెలుసుగనక మెలికకు తొలిగించావురకా

గోదారి గట్టు పైనా - పైనా
చిన్నారి చిలక ఉందా - ఉంది
చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉందా
ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా





ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు పాట సాహిత్యం

 
చిత్రం: రాజకుమారుడు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్

కన్నుల్లో ప్రాణంలా చైత్రాలలో
నీకోసం వేచాను పూబాలనై
వెన్నెల్లో దీపంలా ఓ తారనై
నీకోసం నేనున్నా నీవాడినై
బాధే కదా ప్రేమంటే
ప్రేమే కదా నీవంటే
ఐనా తీపే తోడుంటే

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు

చీకట్లో నేనుంటే ఓ నీడలా
వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా
కలువల్లే నేనుంటే తేనీటిలో
తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా
ఏ జన్మదో ఈ ప్రేమా
నీ ప్రేమకే ఈ జన్మా
నీవే నేనైపోతుంటే

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్




రామ సక్కనోడమ్మ చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: రాజకుమారుడు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: సుఖ్విందర్ సింగ్, చిత్ర

రామ సక్కనోడమ్మ చందమామ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొ రామ
కల్లోకి వచ్చినట్టు మేనమావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా

రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా

అత్తకొడుకా అని నిన్ను అల్లుకోనా
అత్తిపత్తి లాగ నేను ముడుచుకోనా
అత్తారు పన్నీరు అద్దుకోవె
ఆ మీద చిటికెనేలు అందుకోవే

రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
హొ హొ హొ హొ హొ

రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
ఒహొ హొ

కొప్పులో పువ్వుల రేకు రాలకుండనే
చెంపలో ముద్దులు నింపుతానులే
చేతులా గాజులా సద్దు చేయకుండనె
ముద్దుతో కౌగిలి ముట్టచెప్తలె
హెయ్ నిన్నూ నన్నూ చూస్తావుంటే
నోరూరుతుందే వూరోళ్ళకు
జడ తోటి మంచిగా దిష్టి తీసి
పెట్టుకుంట నీకు నేను పైట చాటు
యాదగిరి గుట్ట మీద ఒట్టు పెట్టు

రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
హొ హొ హొ హొ హొ హొ హొ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా

మావిడి సెట్టులా వుంట వమ్మ ఎప్పుడు
అందనే అందవూ పొందడానికి
పక్కనే సక్కని నిచ్చనుంది చూసుకో
పండినా కొమ్మను వంచడానికి
సింగమోలే నేను వస్తే
సిగ్గు పల్లకిలో చోటిస్తావా
పట్టు తేనెలు ఇచ్చుకోనా
గుత్తి మీద జున్ను పాలు కాయకుండా
చల్ల కొచ్చి ముంత నువ్వు దాయకుండా

రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
హ హ హ హ

రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా

అత్తకొడుకా అని నిన్ను అల్లుకోనా
అత్తిపత్తి లాగ నేను ముడుచుకోనా
అత్తారు పన్నీరు అద్దుకోవె
ఆ మీద చిటికెనేలు అందుకోవే

ఓయ్ రామ సక్కనోడమ్మ చందమావ
రాక రాక ఎందుకొచ్చె అయ్యొరావ
హెయ్ హెయ్ హెయ్





ఇందురుడో చందురుడో మావ పాట సాహిత్యం

 
చిత్రం: రాజకుమారుడు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మా

ఇందురుడో చందురుడో మావ
హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా
యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మా

ఇందురుడో చందురుడో మావ
హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మ

ముద్దులకు వద్దులకు ఉండు చలాకి
మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకి
వంటి చలి తీరుటకే జంటగమారి
ఇక రేపటికే శ్రీమతివే నేటి కుమారి
ఏది ఏమైన ఓ మైనా ప్రేమ కలాపం
సిగ్గు మొగ్గల్లో విచ్చుకునే పుష్ప విలాపం

ఇందురుడో చందురుడో మావ
హోల్ ఆంధ్రాకే నచ్చడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మ

చుక్కలలో చక్కదనం దాచిన దాన
ఎలాగైనా లాగెయ్ నా ఏదో చెయ్ నా దోచెయ్ నా
కన్నులతో కన్నెరికం తీర్చినవాడా
భలే వాడా నీ మీదా అదే లేరా చిన్నోడా
నాతి చరామి ఇదే రాతిరి హామీ
చల్లని సామి సదా నిన్ను స్మరామి
పక్కలుగా పరుచుకునే పదహారేళ్ళు
మక్కువగా లెక్కడిగే మంచం కోళ్ళు

యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మా

ఇందురుడో చందురుడో మావ
హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మ

యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మా

కోరికల కోటలనే కట్టిన రాజా
ఇదే పూజా రేయ్ రాజా మహా తేజా మా రాజా
పైటలలో పాటలెన్నో దాచిన దానా
శృతే చెయ్ నా నీ వీణా
చలో జాన థిల్లనా
పట్టు పదామి పడితే పక్కకు లాగి
కన్నె గులాబి భలే కౌగిలి బేబీ
అద్దకమే జరుపుకునే కధ నూరేళ్ళు
హెయ్ ఇద్దరమే కలుసుకున్న ఎద కొన్నేళ్ళు

యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మా
ఇందురుడో చందురుడో మావ
హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా
మేనకవో తారకవో భామ
డోలు సన్నాయి తెచ్చానమ్మ

ముద్దులకు వద్దులకు వుండు చలాకి
మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకి
వంటి చలి తీరుటకే జంటగమారి
ఇక రేపటికే శ్రీమతివే నేటి కుమారి
ఏది ఏమైన ఓ మైనా ప్రేమ కలాపం
సిగ్గు మొగ్గల్లో విచ్చుకునే పుష్ప విలాపం

యమా యమ్మా యమా యమ్మా
యమా యమ్మా హేయ్ యమ్మాజ్



ఎప్పుడెప్పుడు పాట సాహిత్యం

 
చిత్రం: రాజకుమారుడు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, సుజాత

ఎప్పుడెప్పుడు - హేయ్
వలపుచప్పుడు - హోయ్
మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడప్పుడు - ఏయ్
జరిగినప్పుడు - ఓయ్
తొందరమ్మ పైట పందిరేసినప్పుడు
గుండెగుప్పెడు గుట్టువిప్పడు
గొంతువిప్పలేని గోలవుంది బోలెడు
పిల్ల వేలెడు సోకు సోలెడు
చీకటేళ కోరుతుంది చిలకకొట్టుడు

ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు
మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడప్పుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైట పందిరేసినప్పుడు

చరణం: 1
నడుమా చేతికి రాదు నడిచి చెంతకు రాదు
గడిచేదెట్టా ఓ పొద్దు...
అడిగే అల్లరివాడు పడుచుపిల్లకె తోడు
మెడనే మీటేస్తాడు...
న్యూజిలాండ్లో నూజివీడులా
లవ్ రసాల బారసాల జరుగు జోరులో
బాలచంద్రుడు నేల ఇంద్రుడు
కసికొద్దీ రసమంతా కాజేస్తాడు

ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు
మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడప్పుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైట పందిరేసినప్పుడు

చరణం: 2
తడిసే ఒంటిని చూడు ఇగిరే వన్నెలు చూడు
రగిలే ఈడుని చల్లార్చు...
కనుల పాపల జోడి కలిసే చూపుల వేడి
తెలిపే వలపుల నాడి హా...
జీన్స్లాండ్లో జేమ్స్బాండ్లా
ట్యూన్స్ పాడి గిల్లుతాడు బుల్లికృష్ణుడు
పడుచు గోపిక పంచదారిక
తొనతీపి తినిపించేదేనాడింక

ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు
మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడప్పుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైట పందిరేసినప్పుడు
గుండెగుప్పెడు గుట్టువిప్పడు
గొంతువిప్పలేని గోలవుంది బోలెడు
పిల్ల వేలెడు సోకు సోలెడు
చీకటేళ కోరుతుంది చిలకకొట్టుడు





బాలీవుడ్ బాలరాజుని పాట సాహిత్యం

 
చిత్రం: రాజకుమారుడు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్

బాలీవుడ్ బాలరాజుని
పాటల్లో త్యాగరాజుని
బంగ్లాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగు వాడిని
అందరిలో చిన్నవాడిని
గుండెల్లో గూడుకట్టుకోనా
చిరునవ్వుతో జీతే రహో ఈ జన్మకి
జీనా యహా గానా యహా ఏ నాటికి

అరెయ్ వాహ్ క్యా బాత్ హై

బాలీవుడ్ బాలరాజుని
పాటల్లో త్యాగరాజుని
బంగ్లాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగు వాడిని
అందరిలో చిన్నవాడిని
గుండెల్లో గూడుకట్టుకోనా

సంగీతమౌతాను సైయ్యాటతో
వసంతాలు తెస్తానులే నవ్వుతో
సూర్యుడ్ని దాస్తాను నా చూపులో
జనాలంత రావాలి నా బాటలో
నిప్పులనే గుప్పిస్తా నీతి లేన్నపుడు
మల్లెలనే జల్లిస్తా మనసు ఉన్నపుడు
హెయ్ హెయ్ హెయ్ హే

బాలీవుడ్ బాలరాజుని
పాటల్లో త్యాగరాజుని
బంగ్లాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగు వాడిని
అందరిలో చిన్నవాడిని
గుండెల్లో గూడుకట్టుకోనా

మనసుంది పండేటి మాగాణిగా
వయస్సుందిలే నిత్య కళ్యాణిగా
పరువాల పాదాల పారాణిగా
వరించాను ఈ జన్మ నా రాణి గా
ఆ నింగి ఈ నేల హద్దులే రావులే
దానాలు ధర్మాలు అడ్డుకోలేవులే
హెయ్ హెయ్ హెయ్  హే

బాలీవుడ్ బాలరాజుని
పాటల్లో త్యాగరాజుని
బంగ్లాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగు వాడిని
అందరిలో చిన్నవాడిని
గుండెల్లో గూడుకట్టుకోనా
చిరునవ్వుతో జీతే రహో ఈ జన్మకి
జీనా యహా గానా యహా ఏ నాటికి

Most Recent

Default