చిత్రం: మారో (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:
గానం: మురళీ , సునీత
నటీనటులు: నితిన్, మీరా చోప్రా, అబ్బాస్
దర్శకత్వం: సిద్ధిక్
నిర్మాత: మామిడాల శ్రీనివాస్, వేణు. ఎమ్ కొండా
విడుదల తేది: 11.06.2011
పల్లవి:
ఏదేమైనా కానీ ఏదేదో మైకాన్ని
ఇంకేదో లోకాన్ని నీకే చూపిస్తా నే నీకే చూపిస్తా
ఐదో కన్నే లేని మూడో గుండె రాని
చోటుల్లో నీతోని పాలే తాగిస్తా తాపాలే తాగిస్తా
వేడిగా పెదాలతో ప్రతీది మీటనా
లిఖించగా సుఖాలని సకాలమందున
ఏదేమైనా కానీ ఏదేదో మైకాన్ని
ఇంకేదో లోకాన్ని నీకే చూపిస్తా నే నీకే చూపిస్తా
చరణం: 1
సోకే నీకే సోకే దాకా దూరాలన్ని దూరం చేసెయ్ నా
అందం మొత్తం అందెలాగ బంధాలన్ని బందీ చేసేయ్ నా
వెన్నెల్లోన తేవాలి ఈ వేళ వేసవి వేకువని
ఎలాగైన తోడాలి నీలోని ఆగిన అవిరులే
చరణం: 2
నీరే నిప్పై తప్పే వప్పై తోచేలాగా నన్నే దోచేయ్ రా
మోహం నిండే దేహం నీదే దాహాన్నింకా దహనం చేసెయ్ రా
నా ప్రాయాన్ని ప్రాణయాన్ని ప్రాణాన్ని నీకే అర్పించా
నా స్వప్నాల సౌఖ్యాల స్వర్గాల నీలో హర్షించా
ఏదేమైనా కానీ ఏదేదో మైకాన్ని
ఇంకేదో లోకాన్ని నాకే చూపించు నువ్ నాకే చూపించు
ఐదో కన్నే లేని మూడో గుండె రాని
చోటుల్లో నాతోని పాలే తాగించు తాపాలే తాగించు
వేడిగా పెదాలతో ప్రతీది మీటవా
లిఖించగా సుఖాలని సకాలమందున
No comments
Post a Comment