Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rakta Tilakam (1988)



చిత్రం: రక్త తిలకం (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , పి.సుశీల
నటీనటులు: వెంకటేష్ , అమల అక్కినేని
కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: కె.అశోక్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఎస్. గోపాల్ రెడ్డి
ఎడిటర్: కె.ఎ. మార్తాండ్
విడుదల తేది: 14.01.1988

తమలపాకు లాంటిదాన
నీ అందమంత తాంబూలం చేసుకోనా
బంతిపువ్వు లాంటిదాన
వయ్యారమంత పరుపుగా చేసుకోనా
సరసాల కౌగిట్లో తెరవేయనా
గిలిగింత వడ్డాణం పెట్టేయనా
చందమామ లాంటివాడ
నీ వెన్నెలంత చీరగా చుట్టుకోనా
సూరీడు లాంటివాడ
నీ చేయి తగిలి మంచులా కరిగిపోనా
చిలకల్లే సిగ్గులతో పలకరించినా
తొలిప్రేమ పన్నీరు చిలకరించనా

దొండపువ్వు నడుం నీది దాన్ని పట్టకుంటే తప్పు నాది
కలువపువ్వు సొగసు నీది దాన్ని దోచుకునే హక్కు నాది
పోట్లగిత్త పొగరు నీది దాన్ని తట్టుకొనే వడుపు నాది
ఆకతాయి చెయ్యి నాది దాన్ని ఆపేసే చెయ్యి నాది
సరదాలు పరువాలు నీవే మురిపాల దూకుళ్ళు నావే
సింగారి సంపంగి నీదే పొంగాలి వలపంతా నాదే

తమలపాకు లాంటిదాన
నీ అందమంత తాంబూలం చేసుకోనా
చందమామ లాంటివాడ
నీ వెన్నెలంత చీరగా చుట్టుకోనా

ఊరుకోని వయసునీది మరి దాచలేని మనసు నాది
చిలిపి చిలిపి చూపు నీది దాన్ని ఇసురుకొనే గుండె నాది
అడవి నెమలి కులుకు నీది దాన్ని పెనవేసే ఆశనాది
అసలు అందమంత నీది దాన్ని అందుకునే కిటుకు నాది
ఈ కన్నె సిగపువ్వు నీదే ఎరుపెక్కే పులకింత నాదే
నీ బుగ్గ సిరి చుక్క నేనే నిన్నిడిచి నేనుండలేనే

చందమామ లాంటివాడ
నీ వెన్నెలంత చీరగా చుట్టుకోనా
తమలపాకు లాంటిదాన
నీ అందమంత తాంబూలం చేసుకోనా
తొలిప్రేమ పన్నీరు చిలకరించనా
గిలిగింత వడ్డాణం పెట్టేయనా


Most Recent

Default

No comments