చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: కీర్తి సురేష్ , దూల్కర్ సాల్మన్, సమంత, విజయ దేవరకొండ, షాలిని పాండే
దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాత: అశ్వినీ దత్, ప్రియాంకా దత్
విడుదల తేది: 2018
అభినేత్రి ఓ అభినేత్రి
అభినయనేత్రి నట గాయత్రి
మనసారా నిను కీర్తించి
పులకించినది ఈ జనదాత్రి
నిండుగా ఉందిలే దుర్గ దేవెనం
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వుగా వెలిగే ప్రతిబాగునం
ఆ నటరాజుకు స్త్రీ రూపం
కనుకే అంకితం ని కన కణం
వెండి తెరకెన్నడో ఉందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికిన సౌభాగ్యం
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
కలను వలచావు కలను గెలిచావు
కడలికెదురీది కథగ నిలిచావు
భాష ఏదైనా ఎదిగి ఒదిగావు
చరితపుటలోన వెలుగు పొదిగావు
పెను శికరాగ్రానివై గాగనాలపై నిలిపావుగా అడుగు
నీ ముఖచిత్రమై నలుచరగుల తలయెత్తినది మన తెలుగు
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మనసు వైశాల్యం పెంచుకున్నావు
పరుల కన్నీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుధకు మిగిలేది అందుకున్నావు
పరమార్థానికి అసలర్థమే నువు నడిచిన ఈ మార్గం
కనుకే గా మరి నీదైనది నువుగా అడగని వైభోగం
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
******* ****** *******
చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత ఉపద్రష్ట
అనగా అనగా మొదలై కథలు
అటుగా ఇటుగా నదులై కథలు
అపుడో ఇప్పుడో దరి చేరునుగా
కడలై ఓడై కడతేరునుగా
గడిచే కాలానా గతమేదైనా
స్మృతి మత్రమే కదా...
చివరకు మిగిలేది చివరకు మిగిలేది
చివరకు మిగిలేది చివరకు మిగిలేది
ఎవరో ఎవరో ఎవరో నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
లేదని పిలిచే బ్రతుకేదంటే
తెరపై కదిలే చిత్రమే అంతే
ఈ జగమంతా నీ నర్తనశాలై
చెబుతున్న నీ కథే...
చివరకు మిగిలేది విన్నావా మహానటి
చెరగని చేవ్రాలిది నీదేలే మహానటి
చివరకు మిగిలేది విన్నావా మహానటి
మా చెంపలు మీదుగా ప్రవహించే మహానది
మహానటి మహానటి మహానటి మహానటి
మహానటి మహానటి మహానటి మహానటి
******* ****** *******
చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి, శ్రేయఘోషల్
మూగ మనసులు మూగ మనసులు
మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయమన్న జాడలేని హాయిలో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటె చైత్రమా కుహూ కుహూ కుహూ
స్వరాల ఉయాలుగుతున కోయిలైన వేల
మూగ మనసులు మూగ మనసులు
ఊహల రూపమా ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా
గాలి సరాగమ పూల పరాగమా
నా గత జన్మల ఋణమా
ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కథ అని తరతరాలు చదవని
ఈ కథే నిజమని కలలలోనే గడపని
వేరే లోకంచేరి వేగం పెంచే మైకం
మననిల తరమని తారతీరం తాకే దూరం
ఎంతో ఏమో అడగకే ఎవరిని
మూగ మనసులు మూగ మనసులు
******* ****** *******
చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చారులత మణి
సదా నన్ను నడిపే నీ చెలిమే పూ దారై నిలిచే...
ప్రతి మలుపు ఇక పై స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే
కాలం నర్తించద నీతో జతై
కాలం స్మృతించదా నీకోసమై
కాలం నటించదా నీతో జతై
నదికి వరదల్లె మదికి పరవల్లై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పేరిగిందో
తలుపు తొలి జల్లై తనువు హరివిల్లై
వయస్సు ఎపుడు కడిలిందో
సొగసు ఎపుడు మేరిసిందో
గమనించే లోగా గమకించే రాగానా
ఏదో ఇలా లోన మోగెనా
కాలం నర్తించద నీతో జతై
ప్రాణం సుమించదా! నీ కోసమై
కాలం నటించదా నీతో జతై
******* ****** *******
చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమ్యా బెహ్రా
ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా
చిటికెల తాళాలు వేద్దాం
ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా
ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా
తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చినబోకు మా
ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా
ఓ... ఓ...ఓ...ఓ...
వూరికే పని లేక తీరికస్సలులేక
తోటలో తూనీగల్లే తిరిగొద్దామా ఎంచక్కా
అంత పొడుగెదిగాక తెలుసుకోలేనింక
సులువుగ ఉడతల్లే చెట్టెక్కే ఆ చిట్కా
నింగికి నిచ్చెన వేయవే నింగికి నిచ్చెన వేయవే
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హారమల్లే రేపటి మెడ్లో వెయ్యవే
నీ పిలుపె తంగి నలు వైపుల నుండి
అర చేతులు వాలలేయ్ నీ మధి కోరిన కానుకలన్ని
ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా
1 comment
బ్లాగు అంతా బాగుంది కానీ ... నవను ఒక సలహా ఇవ్వదలచుకున్నాను .. ప్రతీ పాట క్రిందా దాని ఆడియో కూడా ఉంటె బాగుంటుంది ... చదువుతూ వినొచ్చు. దానికి యూట్యూబ్ లోనుంచి తీసుకోవచ్చు .. సలహా పాటిస్తారని ఆశిస్తూ
Post a Comment