చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ నటీనటులు: వెంకట్, మీనా, జయసుధ, తేజెస్వి కథ: గోవింద భాయ్ పటేల్ మాటలు: గణేష్ పాత్రో దర్శకత్వం: మౌర్యా నిర్మాత: యమ్.ఎస్. రెడ్డి సినిమాటోగ్రఫీ: సి. విజయ్ కుమార్ విడుదల తేది: 20.02.1999
Songs List:
విశ్వమంత నిండి వున్న పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: మనో & కోరస్ విశ్వమంత నిండి వున్న వెలుగునీడలు ..... అవి అనాదిగా మంచిచెడుల అడుగుజాడలు ...... పగలు వెంటె రాతిరని సుఖం వెంటె దుఃఖమని గంట కొట్టినట్లు చెప్పు జంట గురువులు :.... ||విశ్వ || కోటికి పడగెత్తినట్టి గొప్పగొప్ప వాళ్ళనైన కూటికింత నోచుకోని కూలినాలి జనులనైన తరతమబేధాలు లేక క్షణమైన విడిచిపోక వెన్నంటే వుంటాయి వెలుగునీడలు .... ఆ బ్రహ్మకైన తప్పవు ఆటుపోటులు .. ఆ బ్రహ్మకైన తప్పవు ఆటుపోటులు ... ||విశ్వ ||
ఊగవే ఊగవే ఉయ్యాలా ... పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: శ్రీలేఖ & కోరస్ ఊగవే ఊగవే ఉయ్యాలా ... ఊరువాడా మెచ్చ జంపాలా వెలుగునీడల నడుమ వెలిగిపోతూవున్న చిలిపి నవ్వుల రాధ అలసిపోయేదాక ... || ఊగవే || ఇంతలోనె ఏవిటీ వింత ... ? ఈడొచ్చి కూకుంది మనకంత ...! ఈడొస్తే సరిపోదు ఉయ్యాలా ... మంచి జోడూ కుదరాలమ్మా జంపాలా !! మందార మొగ్గంటి అందాలరాశివి నీకేమి తక్కువే ఉయ్యాలా ! మొగలిరేకూలాంటి మగసిరీ గలవాడు నిన్నెగరేసుకెళతాడె జంపాలా ! అక్క పెళ్ళికి ముందు ఉయ్యాలా ! ఆ పప్పు ఉడకదే జంపాలా !!
అల్లీ బిల్లీ ఆటలతో పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, చిత్ర & కోరస్ అల్లీ బిల్లీ ఆటలతో అర్థం తెలియని మాటలతో చదువుల బడిలో... దేవుడి గుడిలో ఒకరికొకరుగా పెరిగాము ! ఇపుడిద్దరమొకటై నిలిచాము !! రేకులు విరిసిన వేకువ నువ్వు! ఆకులు రాలని ఆమని నువ్వు ! నందకిశోరుని మోవి చివురుపై నర్తించే దరహాసం నువ్వు !! అలు పెరుగుని మగసిరినీ అగుపించని గడసరిని వరముగ బడసిన హిమగిరి నువ్వు!! పడగెత్తిన పరువం నువ్వు! పాలకడలి తరంగం నువ్వు ! పార్వతి యెదలో తాండవమాడే పరమశివుని ప్రతిరూపం నువ్వు! సరిగమలే ఒరవడిగా పదనిసలే నడవడిగా అడుగులిడెడు కలహంసవు నువ్వు!!
ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, చిత్ర ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చందక లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చందక ఎదురుతెన్నెలు చూసిన ఫలితం ఎదురుగ వరమై నిలిచిందమ్మా ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు కరగిపోయిన గతం సర్వం మరిచిపోదాము చెరగని ప్రేమకు మెరుగులు తరగని శీర్షికలౌదాము కరగిపోయిన గతం సర్వం మరిచిపోదాము చెరగని ప్రేమకు మెరుగులు తరగని శీర్షికలౌదాము నింగి నేల సాక్షిగా నిర్మల ప్రేమే దీక్షగా ఒకరు పాదమై ఒకరు నాధమై కమ్మని పాటకు శృతిలయలౌదాము కాలం పరుగుకు కళ్లెం వేద్దామూ ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు ఆగిపోయిన పెళ్లికి మళ్ళీ ఆయువు పోద్దాము ఆగక పొంగే ఆశలన్నిటికి హారతి పడదాము ఆగిపోయిన పెళ్లికి మళ్ళీ ఆయువు పోద్దాము ఆగక పొంగే ఆశలన్నిటికి హారతి పడదాము ముద్దుముచ్చట తోడుగా ఇద్దరమూ సరిజోడుగా ఒకరు సత్యమై ఒకరు నిత్యమై బంగరు భవితకు బాటలు వేద్దాము బృందావనికే గంధం పూద్దామూ ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చందక లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చందక ఎదురుతెన్నెలు చూసిన ఫలితం ఎదురుగ వరమై నిలిచిందమ్మా ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు
పెళ్ళికి ముందే సిగ్గంతా పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: శ్రీలేఖ, శ్వేతనాగ & కోరస్ పల్లవి : పెళ్ళికి ముందే సిగ్గంతా నువ్వొలక బోయకమ్మా ! శోభనరాత్రికి అంతో ఇంతో దాచుకోవమ్మా.... కాస్త తల పైకెత్తమ్మా.......... ! పాలగ్లాసుతో పడకటింటిలో కాలు మోపగానే..... పూల పానుపు రారమ్మంటూ మేలమాడునమ్మా..... అప్పుడు... మురిపెం బిడియం కలబోసి.... ముసిముసి నవ్వులు జతచేసి... నులివెచ్చని చూపు విసిరావంటే... ఆచూపే ఆ చూపే దీపాలారు పునమ్మా!... || పెళ్ళికి || రాధా రాధా... వియ్యాలవారొచ్చేశారు అయితే పదండి పదండి!.... రండి రండి వియ్యాలవారు ! మీ రాకకు మా జోహారు ! అలసిపోయినట్లున్నారు ! చిలకరించమా? పన్నీరు ! ఆలస్యంగా వస్తేనేమి? అందగాడు కాకుంటేనేమి? ఒక్కమాటలో చెప్పాలంటే అక్కమొగుడు బంగారం... మా అక్కమొగుడు బంగారం !... ఉఁ గడుసుదానివే పొట్లకాయలా వుంటేనేమి...? బుగ్గలు బూరెలు అయితేనేమి....? చక్కదనంలో పెళ్ళికూతురు చెల్లెలికన్నా నయం నయం... ఈ చెల్లెలికన్నా శానా నయం.... !! పెళ్ళికుమారుడి వెంట తోకలా... పెంచుకున్న ఓ కంచి మేకలా.... వచ్చాడమ్మా తోడు పెళ్ళికొడుకు! వేసే వుంచాం కుర్చీ నీ కొరకు! ఏంటి? అలా బిత్తరపోయి చూస్తున్నావ్... రా.... వచ్చి కూర్చో ! ఇది దివిలో కుదిరిన కళ్యాణం ! భువిలో జరిగే వైభోగం ! మంగళకరమీ అనుబంధం ! గంగాయమునల సంబంధం ! పచ్చని చేలే పల్లెకు అందం ! పదుగురి రాకే పెళ్ళికి అందం ! పిన్నలు పెద్దలు అందరు రండి ! పెద్ద మనసుతో దీవించండి... !
అత్తవారంట పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: మనో అత్తవారంట సకల భాగ్యములున్న అచ్చమా రామచంద్రుడే అల్లుడైన ! ఆడకూతురు అత్తింటి కరుగునపుడు కంట తడిబెట్టు పుట్టింటి గడపకూడ !!
గోపాలుడలనాడు పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: చిత్ర, శ్వేతనాగ గోపాలుడలనాడు మురళి వాయించితే గోవులన్నీ మోరలెత్తి విన్నాయంట ! కన్నయ్య కరిమబ్బు తునక...! అతని ప్రతిమాట మరువంపు మొలక...!! పెరుగు చిలికే రాధ తరుణ సౌందర్యాన్ని కళ్ళతోనే మురళి జుర్రుకున్నాడంట...! నా రాధ బంగారు చిలక ! ఆమె ప్రతిమాట కలకండ తునక... ! రాధికా కృష్ణుల రసరమ్యకేళిని... యమునా తరంగిణే ఆగిచూసిందంట...! అరుదైన ఆనాటి జంట... ఈనాడు మా ఇంట వెలిసినాదంట.... !
ఒక్క క్షణం పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: మనో, శ్రీలేఖ ఒక్క క్షణం...... ఒక్క క్షణం ! ఆగు ప్రియా... ఒక్క క్షణం ! జారిపోతె... ఈ క్షణం... తిరిగిరాదు మరుక్షణం... !! || ఒక్క క్షణంII రెపరెపలాడే నీ కళ్ళల్లో రేపటి సుఖములు ఎన్నో చూశాను ! రేపటిదాకా... ఆగలేకా... చూపులతో వలవేశాను... ను వ్వందిస్తే చాలు చేయి ! మోగుతుంది సన్నాయి ! మోగుతుంది సన్నాయి !! || ఒక్కక్షణంII పుత్తడి బొమ్మకు ప్రాణం పోసి... పున్నమి వెన్నెల మేనికి పూసి... దేవుడు నిన్నీరూపంలో... నా వద్దకు పంపాడు ! మాటలకందని ఆనందం... నా మదిలో నింపాడు... !... నే నందిస్తున్నా చేయి ! ఇక జీవితమంతా హాయి !!....
మమత లెరుగని కాలమా... పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, చిత్ర & కోరస్ మమత లెరుగని కాలమా... ! మంచితనమే నేరమా... ! కపటమెరుగని కన్నెబ్రతుకును కాటువేయుట న్యాయమా.....? కాటువేయుట న్యాయమా...? ఏమి పాపం చేసినామని వేసినావీ కఠిన శిక్ష....? కాపుకాచే రెప్ప ఉరిమితే కంటిపాపకు ఎవరు రక్ష...? రాతికైనా గుండె పగిలే ఘాతుకం తల పెట్టినావే..... !! || మమత || బ్రహ్మరాసిన రాత చెరిపి... కాలకూట విషాన్ని చిలికి.... మార్చి రాసిన రాత తుదకే మలుపు తిరుగునో చెప్పగలవా....? చెప్పకుంటే మానవత్వం శేష ప్రశ్నగ మిగిలిపోదా... ! || మమత ||
ఎగురుతున్న ఎండి మబ్బుకు పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, చిత్ర & కోరస్ ఎగురుతున్న ఎండి మబ్బుకు
ఇది అదీ అంతం లేని కధ పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: మనో ఇది.... ఇది అదీ అంతం లేని కధ !! ఆడజన్మ కన్నీటి కధ ! వేదమంత్రములు వేసిన బంధం వెక్కిరింత పాలైన కధ !.... || ఇది|| కోరలు సాచిన నవనాగరికత కొరివి దెయ్యమైనట్టి కధ ! ఆశలన్ని అడియాశలైన... ఒక ఆడబడుచు విషాద కథ! వేదమంత్రములు వేసిన బంధం వెక్కిరింత పాలైన కధ.... || ఇది ||
భవ్యచరితగ పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: శ్రీలేఖ & కోరస్ భవ్యచరితగ వన్నెకెక్కిన భరతమాతకు వందనం !! ఆమె హృదయం రేకువాడని ఆకురాలని నందనం ! II భవ్య || అట్టి సుందర నందనంలో పుట్టి పెరిగిన లతలు పూసిన పూవులం మనమందరం !! || భవ్య ||
No comments
Post a Comment