చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న దర్శకుడు: పరశురాం నిర్మాత: బన్నీ వాసు విడుదల తేది: 15.08.2018
Songs List:
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాట సాహిత్యం
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: సిద్ శ్రీరామ్ తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తద్దింధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం పల్లవి: ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కోగంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తద్దింధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం చరణం: 1 ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ యెదుట నిలబడు చనువే వీసా అందుకొని గగణపు కొనలే చూసా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే... ఇకపై తిరణాల్లే చరణం: 2 మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువ జరిగినదడగవా నా కధని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ చెలిమిగ మెలగవ నా పేరు తలచితె ఉబికే లావా చల్లబడి నను నువు కరుణించేవా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కోగంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తద్దింధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం
వాట్ ద లైఫ్ పాట సాహిత్యం
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: విజయ్ దేవరకొండ అమెరిక గర్ల్ ఆయిన అత్తిలి గర్ల్ ఆయిన యూరప్ గర్ల్ ఆయిన యానాం గర్ల్ ఆయిన (2) చైనా , కెన్యా , జార్జియా , లిబియా , ఆస్ట్రేలియా పాకిస్తాన్ , హిందూస్తాన్ , ఉజ్బెకిస్తాన్ ఏ గర్ల్ అయినా ఆహ్ ఆహ్ వాట్ ద వాట్ ద లైఫ్ అమ్మాయంటేనే టఫ్ ఆల్ల తిక్కకు మనమే స్టఫ్ దానికి నేనే ప్రూఫ్ (2) అమ్మాయిలంతా ఏంజెల్స్ అంటూ అప్పటి కవులే వర్ణించారే ఇప్పుడు గాని వీళ్ళని చూస్తే పెన్నులు పక్కన పడేస్తారు ఫేస్బుక్కుల్లో వాట్సప్పుల్లో పీకల్లోతులో మునిగుంటారు మాకేం పట్టదు పొమ్మంటారు మగవానికి గోల్డెన్ డేస్ పురాణాల్లోనే బాసు సో మై డియర్ సో మై డియర్ ఫ్రస్టేటెడ్ బాయ్స్ డోంట్ ఎక్ష్పెపెక్ట్ దోజ్ థింగ్స్ ఇన్ కాంటెంపరరి డేస్ మగాడు మటాష్ వాట్ ద వాట్ ద లైఫ్ అమ్మాయంటేనే టఫ్ ఆల్ల తిక్కకు మనమే స్టఫ్ దానికి నేనే ప్రూఫ్ (2)
ఏంటి ఏంటి పాట సాహిత్యం
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: గోపిసుందర్ , చిన్మయి అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెటేసానా అద్భుతం ఎదుటనున్న చూపు తిప్పేసాన అంగుళం నడవకుండా ప్రయాణమే చేదు పొమ్మన్నానా అమృతం పక్కనున్న విషములా చూసానా ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా రాయిలా రాజులా నన్నేలగా రాణిల మాది పిలిచెనుగా గీతనే దాటుతూ చెరవగా ఒక ప్రణయపు కావ్యం లికించురా రామరి మన ఇరువురి జత గీతా గోవిందంలా ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా పాట సాహిత్యం
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: సిద్ శ్రీరామ్ తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా ఆ దేవ దేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్లలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్లీ లాలీ పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై కొమ్మ హారతి పళ్ళెం హాయిగ నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నట్టింట్లో నెలవంక ఇక నువ్వమ్మా తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా... సాంప్రదాయణి శుద్ధపద్మిణి ప్రేమ శ్రావణి సర్వాణి (2) చరణం: 1 యద చప్పుడు కదిలే మెడలో తాళవనా ప్రతి నిమిషం ఆయువునే పెంచెయ్యనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా కళలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగనాచి కూన ముళ్ళోకాలు మింగే మూతి ముడుపుదాన ఇంద్ర ధనుస్సు దాచి రెండు కళ్ళలోన నిద్ర చెరిపేస్తావే అర్ధ రాతీరైనా ఏ రాకాసి రాశో నీది ఏ గడియల్లో పుట్టావే అయినా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై కొమ్మ నా ఉహల్లోన ఉరేగేది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా చరణం: 2 ఏకాంతలన్ని ఏకాంతం లేక ఎకరువే పెట్టాయి ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగ లేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయె నిలువ నీడ లేక ఎంత అదృష్టం నాదే నంటూ పగ పట్టిందే నాపై జగమంతా... నచ్చిందమ్మా నచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మ నీలో సగమై బతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటన కుంకుమమ్మ ఓ వెయ్యేళ్ల ఆయుష్ అంటూ దివించండమ్మ తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
కనురెప్పల కాలం పాట సాహిత్యం
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: సాగర్ గానం: గోపి సుందర్ కనురెప్పల కాలంలోనే కధ మొత్తం మారే పోయిందే కనుతెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే ఇన్నాళ్ళూ ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినదీ వింతేనా... మన పయనం ఇంతేనా... హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ కనురెప్పల కాలంలోనే కధ మొత్తం మారే పోయిందే కవి ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ పొడుపు కధే ఎప్పటికీ మనమంటు అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా పొరపాటు ఏదో తొరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
తనేమందే తనేమందే పాట సాహిత్యం
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: అనురాగ్ కులకర్ణి తనేమందే తనేమందే నువ్వైనా తెలుపవే సమయమా సమయమా నిజమేదో తెలుపుమా అడుగులే కలపమందా జతపడి నడవమన్నాడా కుదురుగా మొదట నన్నే బయటపడమందా తనేమందే తనేమందే నువ్వైనా తెలుపవే సమయమా సమయమా నిజమేదో తెలుపుమా
No comments
Post a Comment