చిత్రం: Rx 100 (2018) సంగీతం: చైతన్య భరద్వాజ్ నటీనటులు: కార్తిక్ , పాయల్ రాజ్పుత్ దర్శకుడు: అజయ్ భూపతి నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ విడుదల తేది: 13.07.2018
Songs List:
నిప్పై రగిలే పాట సాహిత్యం
చిత్రం: Rx 100 (2018) సంగీతం: చైతన్య భరద్వాజ్ సాహిత్యం: చైతన్య వర్మ గానం: రాహుల్ సిప్లిగంజ్ నిప్పై రగిలే
రెప్పలనిండా పాట సాహిత్యం
చిత్రం: Rx 100 (2018) సంగీతం: చైతన్య భరద్వాజ్ సాహిత్యం: శ్రీమణి గానం: హరిచరణ్ రెప్పలనిండా కలగనకుండా వెన్నెల్ల వాన అనుకోకుండా పెదవలనిండా మాటలవాన అలలు యెగసెనులె ఈ మట్టిలోన పూసె రోజ పూలె రాగాలు కురిసె వెదురులె ఇన్నాళ్ళుగ ఇన్నెళ్ళుగ నాలొ లేవి మహిమలే కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండ మందారాలే పడవలనిండ పట్టు తెరలే అడుగులనిండ ఆకశాలె వాలేనులెఏ పట్టు గుబురు దాటె సీతకోక చిలుకలా మిట్ట కలలు దాటె అందమైన నిజముల పట్టి లాగెనె పట్టు తీగ నన్నిల యెమయ్యిందో నాకేమయ్యిందో వద్దంటున్న నీ ముద్దె నన్ను రమ్మంటుందె నను చంపేసిందే రై రై రంగులువై ఎన్నాడు చూడనిదై గుండెలో బొమ్మల్లె పూసె కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండ మందారాలే పడవలనిండ పట్టు తెరలే అడుగులనిండ ఆకశాలె వాలేనులే చంటి పాపలాగ చిందులేవొ వేస్తున్న ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్న వెండి వెన్నలై యెండలోనె కాస్తు వున్న యేమయ్యిందో నాకెమయ్యిందో రోజు చూసె నా దారులు కూడ నేనె ఎవరొ మరి మరిచేసాయే ఎన్నొ ఎన్నెన్నొ వింతలు నాలోన యెన్నడు ఊహించనివేగా కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండ మందారాలే పడవలనిండ పట్టు తెరలే అడుగులనిండ ఆకశాలె వాలేనులే
అదిరే హృదయం పాట సాహిత్యం
చిత్రం: Rx 100 (2018) సంగీతం: చైతన్య భరద్వాజ్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: కార్తీక్ అదిరే హృదయం అదిరే అదరం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రణయం కరిగే పరువం నీ కౌగిట నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడ తెరనా ప్రియ ప్రియా సఖి ప్రియా భ్రమా నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా అందాల ఆడ సింహమా చందనాల శిల్పమా కోడె నాగు వేగమా నన్నెచేరే నీవుగా నీతో ఆడే ఆటలే ముద్దుల సాగే వేటలే పక్కని వీడి స్వర్గాలు దాటే ఎలా మహా మహా ఆగాధమా నిన్నే నిన్నే తెలియగ తరమా ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా చల్లరిపోతే మొహామ మంటలాగా రేగుమ కంట నీరై జారుమ నరాల్లో నినదమ నువ్వే నాతో లేనిదే నాలోన ఏకం కానిదే ఈలోకమంతా నా కంటికె సూన్యమే…. ఇదే ఇదే సుఖం ఇదే ఇహం పరం ఇపుడిక మనమే ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా అదిరే హృదయం అదిరే అదరం మధురం మధురం నీతో జత నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడ తెరనా ప్రియ ప్రియా సఖి ప్రియా భ్రమా నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా
పిల్లా రా పాట సాహిత్యం
చిత్రం: Rx 100 (2018) సంగీతం: చైతన్య భరద్వాజ్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: అనురాగ్ కులకర్ణి పల్లవి: మబ్బుల్లోన వానవిల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముళ్లులా దాగినావుగా అందమైన ఆశతీరక కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా! కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలిలేని రాక్షసివే గుండెలోని నా కసివే చేపకళ్ల రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నా శశివే సరసకు చెలీ చెలీ రా.. ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనబడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎద సడివే అన్నాగా ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనబడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎద సడివే... మబ్బుల్లోన వానవిల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముళ్లులా దాగినావుగా అందమైన ఆశతీరక కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా! చరణం: 1 చిన్నాదాన ఓసి అందాల మైన మాయగ మనసు జారి పడిపోయెనే తపనతో నీవెంటే తిరిగెనే నీ పేరే పలికెనే నీలాగే కులికెనే నిన్ను చేరగా ఎన్నాళ్ళైన అవి ఎన్నేళ్ళు అయినా వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగ గండాలైన సుడి గుండాలు అయినా ఉంటానిలా నేను నీకే తోడుగా ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగ ఉందామా ఇదో ఎడతెగని హంగామా ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనబడవా.. చరణం: 2 అయ్యో రామ ఓసి వయ్యారి భామ నీవొక మరుపురాని మృదు భావమే కిల కిల నీ నవ్వు తళుకులే నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో ఎం చేస్తున్నా నేను ఏ చోటవున్నా చూస్తూనే ఉన్నా కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించన రక్త మందారాలతో కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా మళ్ళీ మన కథనే రాద్దామా ఎలా విడిచి బతకనే పిల్లా రా నువ్వే కనబడవా...
రుధిరం మరిగి పాట సాహిత్యం
చిత్రం : RX-100 (2018) సంగీతం : చైతన్ భరద్వాజ్ సాహిత్యం : సిరశ్రీ గానం : దీప్తి పార్ధసారధి , సాయి చరణ్ రుధిరం మరిగి
మనసుని పట్టి పాట సాహిత్యం
చిత్రం : RX-100 (2018) సంగీతం : చైతన్ భరద్వాజ్ సాహిత్యం : శ్రీమణి గానం : హరిచరణ్, ఉమానేహ యే ఎవరె ఎవరె మనసుని పట్టి దారం కట్టి ఎగరేసారె గాలిపటంలా యే ఎవరె ఎవరె అడుగును పట్టి చక్రం కట్టి నడిపించారె పూల రధంలా ఎవరెవరొ కాదది నీ లోపల దాక్కుండె టక్కరి నేనేగా ఎక్కడని చూస్తావె నీ పక్కనె ఉన్నానుగా అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్ అమ్రుతంల వింటానె వందల సార్లైనా నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర విన్నావ మైన గుండెల్లోనా హైన రాగలెన్నో ఎగిరె టూన చేపల్లోన సోనా మెరుపులు ఎన్నో నీలొ రెగిన వేగం కల చెరిపె గాలుల రాగం అలజడిలొ గువ్వల గొడవె నే మరిచేస చూశావ మబ్బుల ఒల్లె రుద్దె మెరుపుల సబ్బులు ఎన్నొ ఎర్రని సూర్యుని తిలకం దిద్దె సాయంకాలం కన్ను ఎమైనా... ఇంతందం చెక్కిందెవరొ చెబుతార తమరు ఎవరెవరొ కాదది నీలోపల తన్నుకు వచ్చె సంతోషం ఉలిగా చక్కగ చెక్కెందుకు నె చెలిగా నేనున్ననుగా అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్ అమ్రుతంల వింటానె వందల సార్లైనా నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర సెలయేరుకు పల్లం వైపె మల్లె నడకలు నేర్పిందెవరు నేలకు పచ్చని రంగే అద్ది స్వచ్చత పంచిందెవరు ఎందుకు మనకా గొడవ నీ మటైనా నువు వినవా నా తియ్యని పెదవె తినవా ఓ అరనిమిషం ఈ ప్రేమకు పేరె పెట్టిందెవరు ప్రాయం పంచిందెవరు వలపుకి తలుపె తీసిందెవరు తొలి ముద్దిచ్చిందెవరు ఎమైనా... నాలొ ఈ హైరానా తగ్గించెదెవరు ఎవరెవరొ కాదది నీలొపల హద్దులు దాటిన అల్లరినె త్వరగా దారిలొ పెట్టెందుకు తోడల్లె నేన్నున్ననుగా అరె ఈ మాటె మరో సారి చెప్పెయ్ అమ్రుతంల వింటానె వందల సార్లైనా నీ పాట వస్తానె లక్షల మైళ్ళైనా నీ వెంట తరకు తరకు తర తరకు తరకు తర తరకు తరకు తర
దినకు దిన పాట సాహిత్యం
చిత్రం : RX-100 (2018) సంగీతం : చైతన్ భరద్వాజ్ సాహిత్యం : చైతన్య వర్మ గానం : వరం దినకు దిన
No comments
Post a Comment