చిత్రం: దేవదాస్ (2018) సంగీతం: మణిశర్మ నటీనటులు: నాగార్జున, నాని, రష్మీక మండన్న, ఆకాంక్ష సింగ్ దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య నిర్మాత: అశ్వనీదత్ విడుదల తేది: 27.09.2018
Songs List:
వారు వీరు పాట సాహిత్యం
చిత్రం: దేవదాస్ (2018) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య వారు వీరు అంతా చూస్తూ ఉన్నా ఊరు పేరు అడిగేయ్యాలనుకున్నా అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా తాడో పేడో తేల్చేద్దాం అనుకుని ఏ మాట పైకి రాక మనసేమో ఊరుకోక అయినా ఈనాటి దాకా అస్సలు అలవాటు లేక ఏదేదో అయిపోతున్నా పడుచందము పక్కనుంటే పడిపోదా పురుష జన్మ అలా పడిపోక పోతే ఏం లోటో ఏమో కర్మ వారు వీరు అంతా చూస్తూ ఉన్నా ఊరు పేరు అడిగేయ్యాలనుకున్నా జాలైనా కలగలేదా కాస్తైనా కరగరాదా నీ ముందే తిరుగుతున్నా గాలైనా వెంటపడినా వీలైతే తడుముతున్నా పోనీలే ఊరుకున్నా సైగలెన్నో చేసినా తెలియలేదా సూచన ఇంతకీ నీ యాతన ఎందుకంటె తెలుసునా ఇది అనేది అంతు తేలునా పడుచందము పక్కనుంటే పడిపోదా పురుష జన్మ అలా పడిపోక పోతే ఏం లోటో ఏమో కర్మ ఆడ పిల్లో అగ్గిపుల్లో నిప్పురవ్వలో నీవి నవ్వులో అబ్బలాలో అద్బుతంలో ఊయలూపినావు హాయి కైపులో అష్ట దిక్కుల - ఇలా వలేసి ఉంచినావే వచ్చి వాలవే వయ్యారి హంసరో ఇన్ని చిక్కులా - ఎలాగ నిన్ను చేరుకోను వదిలి వెళ్లకే నన్నింత హింసలో తమాషా తగాదా తెగేదారి చూపవేమి బాలా పడుచందము పక్కనుంటే పడిపోదా పురుష జన్మ అలా పడిపోక పోతే ఏం లోటో ఏమో కర్మ
చెట్టు కింద డాక్టర్ పాట సాహిత్యం
చిత్రం: దేవదాస్ (2018) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య సిందర వందర సుందర వదన అయ్యయ్యో ఇది నువ్వేనా... గందర గోళపు మందల వలన తగులుకుంద హైరానా... ఇదొక వింత ఘటన నీకేమో రాదు నటన సీకటి గూటి పంచన బంధీ ని చేసి నిన్నుంచగా తగునా..... ఆ సెట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం ని లేత లేత గుండె పైన గుంటూరు కారం..... పైకి పైకి దూకుతాందా రాక్షస మమకారం... ఇంక తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం.... సిందర వందర సుందర వదన అయ్యయ్యో ఇది నువ్వేనా... గందర గోళపు మందల వలన తగులుకుంద హైరానా... నీ మాటల్లోనే ముందంటే వేరే ఈళ్ళకింకే.. ఓ...... నీ సేతిలోనా గోళీలు వేరే ఈళ్ళకింకే.... ఓ..... నోటి యాసలు సరిపడవు దేహ భాషలు జతపడవు మత్తు గంజాయి తోటలోనే మా మంచి మల్లె లాగ అల్లాడి పోయినావురో... ఆ సెట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం ని లేత లేత గుండె పైన గుంటూరు కారం..... పైకి పైకి దూకుతాందా రాక్షస మమకారం... ఇంక తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం.... సిందర వందర సుందర వదన అయ్యయ్యో ఇది నువ్వేనా... గందర గోళపు మందల వలన తగులుకుంద హైరానా... క్లినిక్ కు లేని ఏ కిక్కుకు లేని తైతక్కాలాటా... ఎరక్కపోయి ఇరక్కపోయావ్ ఈ సెడ్డసోటా.... ఎక్కడుండాలనుకున్నావు యాడికొచ్చి పండుకున్నావు గుక్క పెట్టేసి కెవ్వు కెవ్వు నీ ఫేస్ మీదే నువ్వు ఎక్కెక్కి ఏడ్చినావూరో.... ఆ సెట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం ని లేత లేత గుండె పైన గుంటూరు కారం..... పైకి పైకి దూకుతాందా రాక్షస మమకారం... ఇంక తప్పదంటూ ఎట్టా గొట్టా సర్దుకోరా బంగారం.... సిందర వందర సుందర వదన అయ్యయ్యో ఇది నువ్వేనా... గందర గోళపు మందల వలన తగులుకుంద హైరానా...
లక లక లకుమికరా పాట సాహిత్యం
చిత్రం: దేవదాస్ (2018) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అనురాగ్ కులకర్ణి, శ్రీ కృష్ణ Ganapathi Bappa Moriya Mangala Moorthi Moriya.. Ganapathi Bappa Moriya Mangala Moorthi Moriya.. Ganapathi Bappa Moriya Mangala Moorthi Moriya.. Deva Sri deva Ganapathi deva Gajananaa Gananaaya.. Maharajathu Mahakayithu Ganaadeeshaaya moriya Deva Sri deva Ganapathi deva Gajananaa Gananaaya.. Maharajathu Mahakayithu Ganaadeeshaaya moriya... Laka Laka Lakumikara Lambodara Jaga jaga jagaodhaara vigneswara Laka Laka Lakumikara Lambodara.. Raka Raka Rakamula Rupaalu Neeve Dora Velli Raraa Malli Raaraa yedaadikosaari Maakai digi raaraa Lokamlo lopaalu Paapaalanni Thudicheyraa Veluthu Veluthu Attaa gangammalo kalipey raa.. Laka Laka Lakumikara Lambodara Jaga jaga jagaodhaara vigneswara Laka Laka Lakumikara Lambodara.. Raka Raka Rakamula Rupaalu Neeve Dora..
హే బాబు పాట సాహిత్యం
చిత్రం: దేవదాస్ (2018) సంగీతం: మణిశర్మ అయ్యయ్యో ప్రేమారా అనుకొనే లేదురా అమాంతం ధుకేరా అహహా అనిపించెరా ఆ రోమియో నా గుండెలూ వేశాడులే పీఠం ప్రేమించడం ఎలాగని నేర్పదులే పాఠం నా నయనం చెలి నయనం మాటాడే ప్రేమ కాలం నాలోన జరిగుందే మంత్రాల మాయాజాలం హే బాబు తెలిసిందా ప్రేమంటే నీ మనసైన నీ మాటే వినదంటే హే బాబు పడదోసి ప్రేమింతే ఆ వల్లనా పడిపోతే గల్లంతే ఆకాశం కూలిన అరెరే నాకేం తెలియదే అణ్వస్త్రం పేలిన ఈ శబ్దం వినిపించదే అయస్కాంత క్షేత్రంలా ఏదో లాగిందే మరయంత్రమై ప్రాణం తనతో సాగుతోందే ఏంటో తనివి తీరదే ఎంతైనా మరి చలదే ఇంకా ఇంకా కోరుకుంది మనసే ఈ హాయే… విన్న అనుకున్న ఏదైనా నీ పేరున నిన్న అటుమొన్న నేనిలా లేనంటున్నా హే బాబు తెలిసిందా ప్రేమంటే నీ మనసైన నీ మాటే వినదంటే హే బాబు పడదోసి ప్రేమింతే ఆ వల్లనా పడిపోతే గల్లంతే యే రోజు నీకలే నిదరోని కన్నంచున రోజాలు పూచే చల్లారని గన్నంచున పగలైన రేయైన నీ ఆలోచనే నీ ఊహ లేకుండా నన్నుహించలేని ఆదం జతగా దువ్వెన అః అంటూ మెచ్చిన నన్నే కాదని చూపు తిప్పుకున్న నీ పైన… అవునా నువ్వేనా ఈ మార్పు నీలోనా దేవి పూజలలో తేలల్లే దేవాంతకుడైన హే బాబు తెలిసిందా ప్రేమంటే నీ మనసైన నీ మాటే వినదంటే హే బాబు పడదోసి ప్రేమింతే ఆ వల్లనా పడిపోతే గల్లంతే రామజోగయ్య శాస్త్రి గానం: కార్తీక్ , రమ్యా బెహ్రా హే బాబు
ఏమో ఏమో పాట సాహిత్యం
చిత్రం: దేవదాస్ (2018) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: సిద్ శ్రీరాం , రమ్యా బెహ్రా ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో ఏమో ఏమో ఏమో వెలుగు వాగు నాలో పొంగిందేమో ఉందొ లేదో ఏమో కాలి కింద నేలే కరిగిందేమో మాయో మహిమో ఏమో నేల కాస్త నింగై మెరిసిందేమో ఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదే ఇల్టిలాంటిదేదో ఉన్నదంటే విన్న మాట కాదే రాధే రాధే రాధే నెమలి కన్ను కలలో రూపం నీదే రాధే రాధే రాధే ఎడమ వైపు ఎదలో దీపం నీదే లేదే లేనే లేదే ఇంత గొప్ప అందం ఇలలో లేదే ఉండే ఉంటె ముందే చూసినట్టు ఎవరు అననే లేదే పోల్చేదెలా ఇలా అని నీలాగా వుంది నువ్వే నమ్మేదెలా నిజం అని సమ్మోహ పరచినావే లాలి లాలి అంటూ జోల పాట పాడే పవనం నువ్వే లేలే లేలే అంటూ మేలుకొలుపు పాడే కిరణం నువ్వే నాలో భావం నువ్వే రూపు కట్టి ఇల్లా ఎదురైయ్యావే నాలో జీవం నువ్వే ఆశ పెట్టి నన్నిలా కవ్విస్తావే లోలోన దాచుకున్న నా అందాల ఊహ నువ్వే నా చెంత చేరి ఇంతలా దోబూచులాడి నావే
మనసేదో వెతుకుతు ఉంది పాట సాహిత్యం
చిత్రం: దేవదాస్ (2018) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: అనురాగ్ కులకర్ణి, యాజిన్ నిజార్ మనసేమో వెతుకుతు ఉంది అడుగేమో అడ్డుపడకుంది ఎం పోయిందనో ఇంతటి వేదన ఎం పొందాలనో ఈ అన్వేషణా ఏ సత్యం తెలిసింది ఏ స్వప్నం కరిగింది ఏ కిరణం తగిలింది రెప్పకి నొప్పిగ ఉంది ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెలా దొరికిందో ఎం పోయిందనో ఇంతటి వేదన ఎం పొందాలనో ఈ అన్వేషణా ఏ సత్యం తెలిసింది ఏ స్వప్నం కరిగింది ఏ కిరణం తగిలింది రెప్పకి నొప్పిగ ఉంది ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెలా దొరికిందో సరియరా… సరియరా… సరియరా… సరియరా… సరియరా… సరియరా… బిగిసింది లేని పోనీ సంకెల ఎదో ముగిసింది గాని తేని కింతటి భాదో తెరిచింది గా… - తెరిచింది గా … తన పంజరం... - తన పంజరం ఎగిరింది గా … - ఎగిరింది గా … ఎద పావురం … ఎద పావురం… తరిమిన జ్ఞాపకాలుగా తగిలిన బాణమేమిటో ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెలా దొరికిందో మనసేమో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుంది మనసేమో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుంది నడి రేయితోటి ఎందుకంత స్నేహం నడిపించుతుంది మాయదారి మైకం పసిపాపలా… - పసిపాపలా… నవ్వే గుణం… - నవ్వే గుణం… నేర్పింది ఆ… - నేర్పింది ఆ … వెన్నెల వనం… - వెన్నెల వనం … ఈ మౌనం ఎం అన్నదో నా ప్రాణం ఎం విన్నదో ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెలా దొరికిందో
1 comment
I really appreciate your job done to help many singers,and we don't find some movies lyrics exam ninne pellada ,nag songs super hit song eto vellipoindimsnsduvellipoindi msnasu.
Post a Comment