Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sharada (1973)




చిత్రం: శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: శారద, శోభన బాబు, జయంతి
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: పి.రాఘవరావు
విడుదల తేది: 04.03.1973



Songs List:



శారదా నను చేరగా పాట సాహిత్యం

 
చిత్రం: శారద (1973)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: వి.రామకృష్ణ

పల్లవి:
శారదా నను చేరగా
శారదా నను చేరగా

ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ... శ్రావణ నీరదా శారదా

శారదా నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ....ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా

చరణం: 1
ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి ఆ హొయలు...!

ఏమి కులుకు సెలయేటి పిలుపు
అది ఏమి అడుగు కలహంస నడుగు
హోయ్...ఏమి ఆ లయలు..!

కలగా కదిలే ఆ అందం
కలగా కదిలే ఆ అందం
కావాలన్నది నా హృదయం
కావాలన్నది నా హృదయం
ఓ... శ్రావణ నీరదా శారదా

శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ.. ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా

చరణం: 2
నీలి కళ్ళలో  నా నీడ చూసుకొని
పాల నవ్వులో పూలు దోచుకొని
నీలి కళ్ళలో  నీడ చూసుకొని
పాల నవ్వులో పూలు దోచుకొని
పరిమళించేనా...!

చెండువోలేవిరిదండవోలే..
నిను గుండె కద్దుకొని నిండు ముద్దు గొని
పరవశించేనా..!

అలలై పొంగే అనురాగం అలలై పొంగే అనురాగం
పులకించాలి కలకాలం పులకించాలి కలకాలం
ఓ... శ్రావణ నీరదా శారదా

శారదా నను చేరగా
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ.. ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా

ఓ... శ్రావణ నీరదా శారదా

అహా... ఒహో... అహా...




శ్రీమతిగారికి తీరని వేళ.. పాట సాహిత్యం

 
చిత్రం: శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: వి.రామకృష్ణ, పి.సుశీల  

పల్లవి:
శ్రీమతిగారికి తీరని వేళ.. శ్రీవారి చెంతకు చేరని వేళ
శ్రీమతిగారికి తీరని వేళ.. శ్రీవారి చెంతకు చేరని వేళ
చల్లగాలి యెందుకు?.. చందమామ ఎందుకు?
మల్లెపూలు ఎందుకు?.. మంచి గంథ మెందుకు?
ఎందుకు? .... ఇంకెందుకు?

శ్రీమతిగారికి తీరని వేళ శ్రీవారికెందికీ గోల?
శ్రీమతిగారికి తీరని వేళ శ్రీవారికెందికీ గోల?
చల్లగాలి చెప్పవే  చందమామ చెప్పవే
మల్లె తావి చెప్పవే  మంచి మాట చెప్పవే
చెప్పవే... చెప్పవే...

చరణం: 1
ఓ చందమామా  ఓ చల్లగాలీ
ఓ చందమామా  ఓ చల్లగాలీ
నాపైన మీరైన చూపాలి జాలీ
నాపైన మీరైన చూపాలి జాలీ

లలలలలా.. హహహా.. 

బెట్టు చేసే అమ్మగారిని
బెట్టు చేసే అమ్మగారిని
గుట్టుగా నా చెంత చేర్చాలి
మీరే చెంత చేర్చాలి

శ్రీమతిగారికి తీరని వేళ  శ్రీవారికెందికీ గోల?
చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే
మల్లె తావి చెప్పవే  మంచి మాట చెప్పవే
చెప్పవే... చెప్పవే...

చరణం: 2
ఓ దేవదేవా! ఓ దీన బంధో!
ఓ దేవదేవా! ఓ దీన బంధో!
ఒకసారి మా వారి ఈ బాధ చూడు
ఒకసారి మా వారి ఈ బాధ చూడు
ఆఆ.. ఉం..ఉమ్మ్..

అలకలోనే అలసి పోతే 
అలకలోనే అలసి పోతే
ఇంత రేయి నవ్విపోయేను 
ఎంతో చిన్న బోయెను...

శ్రీమతిగారికి తీరిన వేళా.. 
శ్రీవారి చెంతకు చేరిన వేళా
చల్లగాలి యెందుకు?
చందమామ ఎందుకు?
మల్లెపూలు ఎందుకు?
మంచి గంథమెందుకు?

ఎందుకు? ఇంకెందుకు?




రాధాలోలా! గోపాలా! పాట సాహిత్యం

 
చిత్రం: శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల  

పల్లవి:
రాధాలోలా! గోపాలా!గాన విలోలా..  యదుబాలా
నందకిషోరా! నవనీత చోరా!
నందకిషోరా! నవనీత చోరా... బృందావన సంచార..
రాధాలోలా! గోపాల...గాన విలోలా..  యదుబాలా

నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి
నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి
ఎన్నాళ్లు చేశాను ఆరాధనా..
ఎన్నాళ్లు చేశాను ఆరాధనా..
దాని ఫలితమా నాకీ ఆవేదనా 

రాధాలోలా! గోపాలా!గాన విలోలా..  యదుబాలా
నందకిషోరా! నవనీత చోరా!
నందకిషోరా! నవనీత చోరా... బృందావన సంచార..
రాధాలోలా! గోపాల...గాన విలోలా..  యదుబాలా

చరణం: 1
మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?
మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?

మనసులు పెనవేసి.. మమతలు ముడివేసి
మగువకు పతి మనసే.. కోవెలగా చేసి
ఆ కోవెల తలుపులు మూశావా?
ఆ కోవెల తలుపులు మూశావా?
నువు హాయిగ కులుకుతు చూస్తున్నావా? 

నీ గుడిలో గంటలు మోగినవి
నా గుండెల మంటలు రేగినవి

చరణం: 2
నీ గుడిలో గంటలు మోగాలంటే...
నీ మెడలో మాలలు నిలవాలంటే...
నీ సన్నిధి దీపం వెలగాలంటే...
నే నమ్మిన దైవం నీవే అయితే...
నా గుండెల మంటలు ఆర్పాలి...
నా స్వామి చెంతకు చేర్చాలి... 

రాధాలోలా! గోపాలా!
గాన విలోలా..  యదుబాలా!
రాధాలోలా! గోపాలా!
గాన విలోలా..  యదుబాలా!
రాధాలోలా.. గోపాలా.. గోపాలా.. గోపాలా..




వ్రేపల్లె వేచేనూ పాట సాహిత్యం

 
చిత్రం: శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  పి.సుశీల

పల్లవి:
ఆ.. ఆ.. ఆ.. ఆ.. 
వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వనమెల్ల వేచేనురా..... 

నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా...
రావేలా...  రావేలా 

చరణం: 1
కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని...
కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని
గున్న మావి పూయనన్నదీ నీవు రావని
ఆ...... ఆ....... ఆ.....  ఆ..
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కదలాడే యమునా నది...

నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా 

చరణం: 2
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
నా నీడ తానన్నదీ రాడు రాడేమని
ఆ......  ఆ......  ఆ.....  ఆ..... 
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రావేల...  చిరుజల్లుగా

నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా 




కన్నె వధువుగా మారేది.. పాట సాహిత్యం

 
చిత్రం:  శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
కన్నె వధువుగా మారేది.. జీవితంలో ఒకేసారి
కన్నె వధువుగా మారేది.. జీవితంలో ఒకేసారి
ఆ..ఆ.. వధువు వలపే విరిసేది.. ఈనాడే తొలిసారి

అందుకే.. అందుకే తొలి రేయి 
అంత హాయి.. అంత హాయి.. 
అంత హాయి...

చరణం: 1
వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని
వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని
ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా ఈ మోము జాబిలి దేనికని
అల్లరి చూపులతోనే  నను అల్లుకు పోయేవెందుకని
అల్లరి చూపులతోనే. నను అల్లుకు పోయేవెందుకని
ఆ..ఆ.. అల్లికలోనే తీయని  విడదీయని బంధం ఉన్నదని

అందుకే.. అందుకే తొలి రేయి 
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి...

చరణం: 2
నీ పెదవి కనగానే  నా పెదవి పులకించింది ఎందుకని
నీ పెదవి కనగానే  నా పెదవి పులకించింది ఎందుకని
విడివిడిగా ఉండలేక
విడివిడిగా ఉండలేక  పెదవులు రెండూ...
అందుకని..
ఎదురు చూసే పూల పానుపు  ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని
ఇద్దరిని తన కౌగిలో  ముద్దు ముద్దుగా..
అందుకని..

అందుకే.. అందుకే తొలి రేయి
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి.. అంత హాయి..
అంత హాయి...




అటో ఇటో తేలిపోవాలి పాట సాహిత్యం

 
చిత్రం: శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: కె.చక్రవర్తి, రామారావు 

అటో ఇటో తేలిపోవాలి 




జయ మంగళ గౌరీ.... పాట సాహిత్యం

 
చిత్రం: శారద (1973)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డివోషనల్
గానం: వసంత & కోరస్ 

జయ మంగళ గౌరీ.... దేవీ.... 
జయ శంకరి జననీ శ్రీ....
అరుంధతీ అనసూయలవలె మము
రక్షించునుమ్మా, శ్రీ కల్పవల్లీ, దేవీ....
పసుపు కుంకుమలతో,
ముత్తైదు తనసుతో
కలకాలమూ--మము కరుణించు శంకరి .....

No comments

Most Recent

Default