చిత్రం: F2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: డేవిడ్ సైమన్
నటీనటులు: వెంకటేష్ , వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కౌర్ ఫిర్జదా
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 12. 01. 2019
హే క్రికెట్ ఆడే బంతికి
రెస్టే దొరికినట్టు ఉందిరో
1947 ఆగస్ట్ 15 ని
నేడే చూసినట్టు ఉందిరో
దంచి దంచి ఉన్న రోలుకి
గేపే చిక్కినట్టు ఉందిరో
వదిలేసి వైఫ్ ని సరికొత్త లైఫ్ ని
చూసి ఎన్నాళ్ళయిందిరో
ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి
ఫ్రీడమ్ చేతికందిందిరో
పుట్టెడు తట్టెడు కష్టమే తీరినట్టు
స్వర్గమే సొంతమయ్యిందిరో
రెచ్చిపోదాం బ్రదర్
పార్టీ లెక్క మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్ (2)
హల్లో అంటు గంట గంటకి
సెల్లె మోగు మాటి మాటికి
నువ్వు ఎక్కడున్నవంటు
నీ పక్కనెవ్వరంటు
చస్తాం వీళ్ళకొచ్చే డౌట్ కి
కాజ్ ఎ చెప్పాలి లేటుకి
కాళ్ళే పట్టాలి నైట్ కి
గుచ్చేటి చూపురో సెర్చింగ్ ఆప్ రో
పాస్వర్డ్ మార్చాలి ఫోన్ కి
లేసర్ స్కానర్ ఎక్స్-రే ఒక్కటయ్యి
అలి గా పుట్టింది చూడరో
చీటికి మాటికి సూటిగా అలుగుతారు
అంతకన్న ఆయుధాలు వాడరు
రెచ్చిపోదాం బ్రదర్
పార్టీ లెక్క మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్
బై బై ఇంట్లో వంటకి
టేస్టే చూపుదాం నోటికి
ఇల్లాలి తిట్లకి హీటైన బుర్రకి
థాయ్ మసాజ్ చెయ్యి బాడీ కి
ఆర్గ్యు చేసి ఉన్న గొంతుని
పెగ్గే వేసి చల్ల బడని
తేలేటి ఒల్లుని పేలేటి కళ్ళని
దేఖో కంటబడ్డ ఫిగర్ ని
క్లీనర్ డ్రైవర్ ఓనర్ నీకు నువ్వే
బండికి స్పీడునే పెంచరో
పెళ్ళమో గొళ్ళెమో లేని ఓ ధీవిలో
కాలు మీద కాలు వేసి బతకరో
రెచ్చిపోదాం బ్రదర్
పార్టీ లెక్క మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్ (2)
***** ***** *****
చిత్రం : F2 (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీశ్రీప్రసాద్
స్వర్గమే నేలపై వాలినట్టు
నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు
గుండెలోన పూలవాన కురిసినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్
నెమలికే పాటలే నేర్పినట్టు
కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు
కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్
కాళిదాసు కావ్యము
త్యాగరాయ గేయము
కలిపి మనసు పాడినట్టుగా
అందమైన ఊహలు
అంతులేని ఆశలు
వాకిలంత వొంపినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్
కళ్ళు కళ్ళూ కలుపుకుంటూ
కలలు కలలూ పంచుకుంటూ
కాలమంతా సాగిపోనీ
మోహమంతా కరిగిపోతూ
విరహమంతా విరిగిపోతూ
దూరమంతా చెరిగిపోనీ
రాతిరంటె కమ్మనైన
కౌగిలింత పిలుపనీ
తెల్లవార్లు మేలుకోవడం
ఉదయమంటె తియ్యనైన
ముద్దు మేలుకొలుపనీ
దొంగలాగ నిద్రపోవడం
ఎంతో ఫన్ ఎంతో ఫన్
రోజుకొక్క బొట్టుబిళ్ళే
లెక్కపెడుతూ చిలిపి అద్దం
కొంటె నవ్వే నవ్వుతోందే
బైటికెళ్ళే వేళ నువ్వే
పిలిచి ఇచ్చే వలపు ముద్దే
ఆయువేదో పెంచుతోందే
ఇంటికెళ్ళె వేళ అంటు
మల్లెపూల పరిమళం
మత్తుజల్లి గుర్తుచేయడం
ఇంటి బయిట చిన్నదాని
ఎదురుచూపు కళ్ళలో
కొత్త ఉత్సవాన్ని నింపడం
ఎంతో ఫన్ ఎంతో ఫన్