Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Padi Padi Leche Manasu (2018)




చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నటీనటులు: శర్వానంద్, సాయిపల్లవి
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి
విడుదల తేది: 21.12.2018



Songs List:



పడి పడి లేచే మనసు పాట సాహిత్యం

 
చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అర్మాన్ మాలిక్ , శ్రీనిధి

పద పద పద పదమని
పెదవులిలా పరిగెడితే
పరి పరి పరి విధముల
మది వలదని వారిస్తే
పెరుగుతుందే మదికాయాసం
పెదవడుగుతుందే చెలి సావాసం
పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగ
ప్రాణం పోయినట్టే పోయి వస్తే

పడి పడి లేచే 
పడి పడి లేచే 
పడి పడి లేచే మనసు

ప్రళయంలోను ప్రణయంతోనే
పరిచయమడిగే మనసు
అది నువ్వని నీకే తెలుసూ..

చిత్రంగా ఉందే చెలీ
చలి చంపే నీ కౌగిలి
నా బందీగా ఉంటే సరి
చలి కాదా మరి వేసవి
తపస్సు చేసి చినుకే
నీ తనువు తాకెనే
నీ అడుగు వెంటే నడిచి
వసంతమొచ్చేనె
విసిరావలా మాటే వలలా కదిలానిలా...

పడి పడి లేచే 
పడి పడి లేచే 
పడి పడి లేచే  మనసు

ప్రళయంలోను ప్రణయంతోనే
పరిచయమడిగే మనసు
అది నువ్వని నీకే తెలుసూ..





కల్లోలమెంటేసుకొచ్చే పాట సాహిత్యం

 
చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అనురాగ్ కులకర్ణి

కల్లోలమెంటేసుకొచ్చే పిల్ల గాలే 
నను చూస్తూనే కమ్మెసెనే 
కల్లోని గాంధర్వ కన్యే ఎక్కే రైలే 
విహరించెనా భూలోకమే

గాలే తగిలింది అడిగే 
నేలే పాదాలు కడిగే 
వానే పట్టింది గొడుగే 
అతిధిగా నువ్వొచ్చావనే 

కలిసేందుకు తొందర లేదులే 
కల తీరక ముందుకు పోనులే

కదిలేది అది 
కరిగేది అది 
మరి కాలమే కంటికి కనపడదే 

ప్రపంచమే అమాంతమే మారే 
దీవి భువీ మనస్సులో చేరే 
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

ప్రపంచమే అమాంతమే మారే 
దీవి భువీ మనస్సులో చేరే 
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే 
చూశా రానున్న రేపునే 
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే 
చూశా రానున్న రేపునే 
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా 
రెప్పలే పడనంత పండగ 
గుండెకే ఇబ్బందీలా టక్కునా ఆగెంతలా 
ముంచినా అందాల ఉప్పెనా… 

గొడుగన్చున ఆగిన తూఫానే
ఎద పంచన లావా నీవేనే 
కనపడని నది అది పొంగినది 
నిను కలవగా కడలై పోయినదే

ప్రపంచమే అమాంతమే మారే 
దీవి భువీ మనస్సులో చేరే 
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

ప్రపంచమే అమాంతమే మారే 
దీవి భువీ మనస్సులో చేరే 
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే 
చూశా రానున్న రేపునే 
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే 
చూశా రానున్న రేపునే 
ఈ దేవ కన్యకే దేవుడు నేనే




హృదయం జరిపే పాట సాహిత్యం

 
చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యాజిన్ నజీర్

నువు నడిచే ఈ నేల పైనే నడిచానా ఇన్నాళ్లుగా నే
ఈ క్షణమే ఆపాలనున్నధి ఈ భూభ్రమణమే !
నీ చెలిమి వద్దంటూ గతమే బంధీగా చేసిందీ నన్నే
తక్షణమే చేయాలనున్నధి తనతో యుద్ధమే
ఇవ్వాలే తెగించా ఇదేనేమో స్వేఛ్చ
తెలికే తెంచావే నా ఇన్నాళ్ళ సంకెళ్లనే

హృదయం జరిపే తొలి తిరుగుబాటిది
నిను దాయడమే తన జన్మ హక్కని
ఒంటరి తనపు ఖైదిన్క వద్దనీ నన్నొదిలెనే..
ఇదివరకేపుడు నా ఉనికినెరగని దుర్భేధ్యాల నీ మనసు కూతని
ముట్టడి చేసి గెలిచేందుకొచ్చెనే నా హృదయమే..

ఏకాంతమంత అంతం అయేంత
ఓ చూపు చూడే చాలికా
మరు జన్మ సైతం రాసేసి ఇస్తా
నా రాజ్యమంతా ఏలికా.
నీ మౌనంలో దాగున్న ఆ గరళమే
దాచేసి అవుతున్నా నేనచ్చంగా ముక్కంటినే..

హృదయం జరిపే తొలి తిరుగుబాటిది
నిను దాయడమే తన జన్మ హక్కని
ఒంటరి తనపు ఖైదిన్క వద్దనీ నన్నొదిలెనే..
ఇధివరకేపుడు నా ఉనికీనెరగని

దుర్భేధ్యాల నీ మనసు కూతని
ముట్టడి చేసి గెలిచేందుకొచ్చెనే నా హృదయమే..





ఏమైపోయావే.. పాట సాహిత్యం

 
చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్

ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే.. 
ఏమైపోతానే.. నీవంటూ లేకుంటే.. 

నీతో ప్రతి పేజీ నింపేశానే.. తెరవక ముందే పుస్తకమే విసిరేశావే.. 
నాలో ప్రవహించే ఊపిరివే.. ఆవిరి చేసి ఆయువునే తీసేశావే..

నిను వీడి పోనందీ నా ప్రాణమే.. 
నా ఊపిరిని నిలిపేది నా ధ్యానమే.. 
సగమేనే మిగిలున్నా.. శాసనమిది చెబుతున్నా.. 
పోనే.. లేనే.. నిన్నుదిలే... 

ఏమైపోయావే.. నీవెంటే నేనుంటే.. 
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే.. 

ఎటు చూడు నువ్వే.. ఎటు వెళ్లెనే.. 
నేలేని చోటే నీ హృదయమే.. 
నువ్ లేని కల కూడా రానే రాదే.. 
కలలాగ నువ్ మారకే.. 
మరణాన్ని ఆపేటీ వరమే నీవే.. 
విరాహాల విషమీయకే.. 

ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే.. 
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..



ఓ మై లవ్లీ లలన.. పాట సాహిత్యం

 
చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిందూరి విశాల్

నంద గోపాలా ఏమిటి ఈ లీల
కంటపడవేమి రా
ఎంత విన్నారా వేచి ఉన్నారా
మాయా విడవేమిరా

రాక్షశుల విరిచి దాగి నను గెలిచి
ఆటలాడేవు రా
ఆ..ఆఆ…
కానరావేమి రా

ఓ మై లవ్లీ లలన.. ఇలానే రమ్మంటే
ఓ మై లవ్లీ లలన.. ఇంతే నే వింటే
ఓ మై లవ్లీ లలన.. నీలో బాధ కంటే
ఓ మై లవ్లీ లలన.. ఎలా ధానివంటే
ఓ మై లవ్లీ లలన.. కొంటె గాలి నిన్నంటే
ఓ మై లవ్…

ఆ..ఆ…ఆ…

యధో భూషణా… సూరా పూతనా… వధే చేసేనా.
కాళింది లోతునా… కాలేవు ననచినా..

మహా శౌనకీ… ముక్తే పంచినా…
దివ్యా రూపమే గనే కాంక్ష రా..
నిన్నే కాంచగా కన్నారా కన్నారా
ప్రియ గొంతిలా ముకుందా కృష్ణా
ఓ మై లవ్లీ లలన

ఇలానే రమ్మంటే
ఓ మై లవ్లీ లలన
కొంటె గాలే నిన్నంటే

ఓ మై లవ్లీ లలన
ఓ మై లవ్లీ లలన
ఓ మై లవ్లీ లలన...



ఉరికే చెలి చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రాహుల్ శిల్పిగంజ్, యమ్ యమ్ మానసి

ఉరికే చెలి చిలకా
గొడవే ఇక పడకా…
నల్లా జోడు కళ్ళాకెట్టి
చూపే మరిచావా…
ఎత్తు జోడు కాళ్ళకేసి
నేలే విడిచావా…

ఎంత దూరమైనా పోవే
ఎంటపడి నే రానే
ఎండె పోతే ఎనక్కి నువు రావా..
కొంటె నీ గుండె పరిచావా…

సురుక్కుమన్నా పైకే
నీ మనసే వెన్నెలేవే
కొరుక్కు తిననా నేనే
హీష్మమ్మై కరిగేపోవే

సురుక్కుమన్నా పైకే
నీ మనసే వెన్నెలేవే
కొరుక్కు తిననా నేనే
హీష్మమ్మై కరిగేపోవే

బొంగరంలా మూతే తిప్పేసి పరుగే తీయ్ కే
గింగిరాలే కొట్టి వస్తున్నా పరుగే తీయ్ కే
ఉంగరాన్ని తొడుగే వేలీయే…
బంగారంలా ఏలూకుంటానే…

ఎర్రని కోకే చూసి వెంట నువు రాకో
ఎవరని అనుకున్నావేమో  ఏంటసలూ
ఏటిలో సేపను కాను వలకు  దొరికేనూ
పొగరుకే అత్తరు పూస్తే అది నేను

వేషమేసారు  ఏంది సారు
ఏలుడంత కొయబంగారు పుట్టిస్తా కంగారు
అంత వీజీ కాదు నన్ను నచ్చుకోవడం
హాయ్..కల్లుకొచ్చి ఎందుకంట ముంత దాచడం
పొగడామాకు అసలు పడిపోనూ…

పచ్చి కలరని కుచ్చి కుచ్చి నవ్వుతో
చిచ్చు గుండెలోన చిచ్చు పెట్టకే
ఆచిడానితో రెచ్చిపోయి వచ్చినా
పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే
పచ్చి కలరని కుచ్చి కుచ్చి నవ్వుతో
చిచ్చు గుండెలోన చిచ్చు పెట్టకే
ఆచిడానితో రెచ్చిపోయి వచ్చినా
పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే


No comments

Most Recent

Default