దూరాలే కొంచం కొంచం
దూరాలే అవుతున్నట్టు
దారాలే అల్లేస్తున్నా స్నేహాలేవో
గారాలే కొంచం కొంచం
నీ మీదే వాలేటట్టు
గాలేదో మల్లిస్తున్నా ఇష్టాలేవో
కనులే ఇలా కసిరేంతల
కలవాలనే కలలే ఇవా
అలవోకగ అలవాటులో
అనుకోనిదే అవుతోందిలా
మౌనంగా దాగే ప్రేమ
మెల్లంగా మాటల్లే మార్చేస్తుందా
ఆవైపు ఇంతే ఉన్నా
వద్దంటు మొహమాటం పెట్టిస్తుందా
కొంగొత్తగా మెదిలే ఓ వెలుగే
నీ వల్లనే కలిగే
నువ్వుండంగా దిగులే ఉండదులే
నవ్వుల్లోనే మునిగే
ఇంతలా తెలిసావనే
గమనించనైనా లేదులే
గడియారమే పరుగాపదే
గడచెనులే ఘడియే ఇలా
నిను చూడగా సరిపోదుగా
ఈ మరి మరి కోరే ప్రణయమా
కలవాలనే కదిలే ఇలా
కలిసిందిలే కల నేరుగా
కనుకే ఇలా కథ మారగా
కలిపిందిలే కాలం కదా
మౌనంగా దాగే ప్రేమ
మెల్లంగా మాటల్లే మార్చేస్తుందా
ఆవైపు ఇంతే ఉన్నా
వద్దంటు మొహమాటం పెట్టిస్తుందా
No comments
Post a Comment