చిత్రం: 118 (2019)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: కళ్యాణ్ త్రిపురనేని
గానం: నూతన్ మోహన్
నటీనటులు: కళ్యాణ్ రామ్, నివేద థామస్, షాలిని పాండే
దర్శకత్వం: కె.వి.గుహన్
నిర్మాత: మహేష్ ఎస్.కోనేరు
విడుదల తేది: 01.03.2019
పాదాలు నీదారి నడిపించలేనంటే
ఓ సారి నీ నవ్వు వినిపించినా
ఆకాశ దీపాలు కనిపించలేదంటే
నీ చూపు ఓసారి వెతికించనా
ఇంతలో ఇంతలో నన్ను నలువైపు చేరి
మారావు గారాల చిరు దివ్వెలా
ఋతువులకు జతులను నేర్పావే
అడుగులకు అలకలను నేర్పావే
చినుకులకు కుళుకులు నేర్పావే
నీవు జతగా ఆడుకుంటూ
పాదాలు నీ దారి నడిపించలేనంటే
ఓ సారి నీ నవ్వు వినిపించినా
నేల మేలుకొని ముద్దాడే
వెలుగులమ్మ సిరినీవేళ
పాలుగారు పసిరాగాలే
పరుగులైన లలనా
ఏ గతమో విడువ కుండా
నీ జతగా నడుపుతుందా
నిను చూస్తే కాలమంతా మరిచేంతగా
ఇంతలో ఇంతలో నన్ను నలువైపు చేరి
మారావు గారాల చిరు దివ్వెలా
ఋతువులకు జతులను నేర్పావే
అడుగులకు అలకలను నేర్పావే
చినుకులకు కుళుకులు నేర్పావే
నీవు జతగా ఆడుకుంటూ
పాదాలు నీ దారి నడిపించలేనంటే
ఓ సారి నీ నవ్వు వినిపించినా
***** ***** ******
చిత్రం: 118 (2019)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: రామ ఆంజనేయులు
గానం: యాజిన్ నజీర్
చందమామే చేతికందే
వెన్నెలేమో మబ్బులోనే
పూల చెట్టె కళ్ళముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఎంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ళ బ్రహ్మచారి బాధ చూడవా
పెళ్లి డేట్ ఎప్పుడంటు
లెక్కలేసి చూసుకుంటు
రొమాన్స్ చెయ్యనియ్యవా
ఓ మై గాడ్ ఏం చేశావ్
చెక్కు ఇచ్చి సంతకాన్ని ఆపేశావ్
ఓ మై గాడ్ ముంచేశావ్
ఐ ఫోన్ ఇచ్చి స్క్రీన్ లాక్ చేశావ్
చేతిలోన చెయ్యవేసి మాట నీకు ఇస్తాను
ఎన్నడైన నిన్ను వీడి పాదమైన పోనీను
రెండు కళ్ళలో హు హు హు
నింపుకున్న నీ రూపాన్నే
రెప్ప మూసినా నాలోలోలో నువ్వే
ప్రేమ అంటే ఇద్దరైన ఒక్కటల్లె పుట్టుకేలే
చందమామే
చందమామే చంతనుందే
వెన్నెలేమో మబ్బులోనే
పూల చెట్టె కళ్ళముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఎంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ళ బ్రహ్మచారి బాధ చూడవా
పెళ్లి డేట్ ఎప్పుడంటు
లెక్కలేసి చూసుకుంటు
రొమాన్స్ చెయ్యనియ్యవా
ఓ మై గాడ్ ఏం చేశావ్
కొత్త బైక్ ఇచ్చి తళమేమో దాచేశావ్
ఓ మై గాడ్ ముంచేశావ్
ఏటీఎం ఇచ్చి నో కాష్ బోర్డ్ ఎట్టావ్
నువ్వు నేను ఉన్న చోట
రేపు కూడా ఈ రోజే
నువ్వు నేను వెళ్ళు బాట
పూల తోట అయ్యేలే
రెక్కలందుకో హు హు హు
గాలిలోనే తేలాలంటే
చేయి అందుకో ఆ మేఘం పైకే
దారమల్లే మారిపోయి
నిన్ను నేను చేర్చుతానే
చందమామే
చందమామే చేతికందే
వెన్నెలేమో మబ్బులోనే
పూల చెట్టె కళ్ళముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఎంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ళ బ్రహ్మచారి బాధ చూడవా
పెళ్లి డేట్ ఎప్పుడంటు
లెక్కలేసి చూసుకుంటు
రొమాన్స్ చెయ్యనియ్యవా
ఓ మై గాడ్ ఏం చేశావ్
కొత్త బైక్ ఇచ్చి తళమేమో దాచేశావ్
ఓ మై గాడ్ ముంచేశావ్
ఏటీఎం ఇచ్చి నో కాష్ బోర్డ్ ట్టావ్
No comments
Post a Comment