చిత్రం: బహుదూరపు బాటసారి (1983)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: పి.సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, సుజాత
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
నిర్మాత: దాసరి నారాయణ రావు
విడుదల తేది: 16.05.1983
పల్లవి:
మేఘమా... నీలి మేఘమా..
మేఘమా... నీలి మేఘమా
ఉరమకే.. మెరవకే నీలి నీలి మేఘమా
మేఘమా.. నీలి మేఘమా
ఉన్న రూపం మార్చుకుని.. నిన్ను నువ్వే కాల్చుకుని
వానవై కురవకే త్యాగమై కరగకే.. మేఘమా.. నీలి మేఘమా...
చరణం: 1
ఫ్రతి ప్రసవం గండమని.. ప్రతి నిముషం మరణమని.. తెలిసి కూడ కన్నతల్లులు..
ఫ్రతి ప్రసవం గండమని.. ప్రతి నిముషం మరణమని.. తెలిసి కూడ కన్నతల్లులు..
మరల మరల కంటారు.. పగటి కలలు కంటారు.. బిడ్డ దైవం అంటారు
దైవమే రాయి అని ఉలుకు పలుకు లేనిదని తెలుసుకోరు పిచ్చి తల్లులు
మేఘమా.. నీలి మేఘమా ఉరమకే.. మెరవకే.. నీలి నీలి మేఘమా..
మేఘమా.. నీలి మేఘమా...
చరణం: 2
సాగరమే సంసారమని.. ఈదటమే కష్టమని.. మరచిపోయి కన్న తండ్రులు
సాగరాన పయనిస్తారు... మునిగి తేలుతుంటారు
మునకే మిగులునని.. కన్నందుకు ఫలితమని తెలుసుకోరు పిచ్చి తండ్రులు
మేఘమా నీలి మేఘమా.. ఉరమకే మెరవకే.. నీలి నీలి మేఘమా..
మేఘమా... నీలి మేఘమా...
ఉన్న రూపం మార్చుకుని.. నిన్ను నువ్వే కాల్చుకుని
వానవై కురవకే త్యాగమై కరగకే.. మేఘమా.. నీలి మేఘమా
****** ****** *****
చిత్రం: బహుదూరపు బాటసారి (1983)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి:
ఎవరు ఎవరో తెలియకుండా.. ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ..
చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం
చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే...
చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే..
చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం
చరణం: 1
కన్ను కన్ను కలిసినాక.. పిచ్చిపట్టి తిగురుతుంటే...
దాహం.. దాహం.. దాహం.. దాహం.. దాహం.. దాహం...
దిక్కులన్నీ పూలు పరచి పిల్లలల్లే ఎగిరిపడితే...
సరసం.. సరసం.. సరసం.. సరసం.. సరసం.. సరసం..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..
ఎదురు చూసి కనులు రెండూ.. తెల్లవారి ఎర్రబారితే...
విరహం... విరహం... విరహం... విరహం... విరహం... విరహం... విరహం...
చనువు పెరిగి అలకలేసి... అలిగి అలిగి పారిపోతే...
కలహం.. కలహం... కలహం.. కలహం.. కలహం.. కలహం..
లల్లలల్లలా.. ఆహహా... ఆహహా... ఓహో.. ఆహహా..
దాహాల చెరువుల్లో.. సరసాల వానల్లో
విరహాలు.. కలహాలు.. కమ్మని ప్రేమకు చిగురులు..
ఎవరు ఎవరో తెలియకుండా.. ఒకరినొకరు కలుసుకొనుట....
చిత్రం.. విచిత్రం..
చరణం: 2
అడుగులోన అడుగు వేసి.. ఏడడుగులు నడుస్తుంటే..
ధన్యం.. జన్మ ధన్యం.. ధన్యం.. జన్మ ధన్యం.. ధన్యం.. జన్మ ధన్యం..
ఆరుబయట చందమామ రారమ్మని పిలుస్తుంటే..
ధ్యానం.. పరధ్యానం.. ధ్యానం.. పరధ్యానం.. ధ్యానం.. పరధ్యానం..
తారలన్ని తోరణాలై.. తొలి రాతిరి కాపు కాస్తే..
మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం..
సిగ్గు విడిచి చీకటంత.. నవ్వి నవ్వి తెల్లవార్చితే...
స్వర్గం.. స్వర్గం..
స్వప్నాల మైకం లో.. స్వర్గాల ఊయలలో..
రాగాలు.. భావాలు.. కమ్మని కాపురాన కబురుళ్లు...
ఎవరు ఎవరో తెలియకుండా.. ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ..
చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..
చిత్రమైన సృష్టిలో ఆడమగ కలయికే...
చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..
No comments
Post a Comment