Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhaagamathie (2018)


చిత్రం: భాగమతి (2018)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: శ్రీజో
గానం: శ్రేయ ఘోషల్
నటీనటులు: అనుష్క , జయరాం
దర్శకత్వం: జి. అశోక్
బ్యానర్: U.V. క్రియేషన్స్
నిర్మాత: వి.వంశీకృష్ణారెడ్డి
విడుదల తేది: 26.01.2018

మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

కళ్లారా కళ్లారా
చూస్తున్నా కళ్లారా
సరికొత్త స్నేహం దారిచేరా
అలికిడి చేసే నాలో
అడగని ప్రశ్నే ఏదో
అసలది బదులో
ఏమో అది తేలేనా
కుదురుగా ఉండే మదిలో
చిలిపిగ ఎగిరే ఎదలో
తెలియని భావం
తెలిసే కథ మారేనా

ఒహ్హ్…
నీ వెంట  అడుగే వేస్తూ
నీ నీడనై గమనిస్తూ
నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ
నీలో చూస్తున్నా

మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా

కళ్లారా కళ్లారా
చూస్తున్నావా కళ్లారా
ఈ సరికొత్త స్నేహం దారిచేరా
సుందరా.. రా..రా..
మందార.. రా..రా..
కళ్లారా.. రా..రా..
సుందరా.. రా..రా..

మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

ఉనికిని చాటే ఊపిరి కూడా
ఉలికి పడేలా ఉందే ఇలా
కలలోనైనా కలగనలేదే
విడిపోతుందని అరమరికా
కడలై నాలో నువ్వే
అలనై నీలో నేనే
ఒకటై ఒదిగే క్షణమే
అది ప్రేమేనా
కాలాలనే మరిపిస్తూ
ఆనందమే అందిస్తూ
నా ప్రయాణమై నా గమ్యానివై
నా నువ్వవుతున్నావే

మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా

కళ్లారా కళ్లారా
చూస్తున్నావా కళ్లారా
ఈ సరికొత్త స్నేహం దారిచేరా

మందార  మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

Most Recent

Default

No comments