చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: యన్.టి.రామారావు, టి.ఎల్.కాంతారావు, కె.ఆర్.విజయ, జమున దర్శకత్వం: సి.యస్.రావు నిర్మాతలు:డి.ఎల్. నారాయణ, బి.ఎ. సీతారాం విడుదల తేది: 04.12.1969
Songs List:
కనిపెట్టగలవా మగువా పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గానం: పి.సుశీల కనిపెట్టగలవా మగువా
కనుదమ్ములను మూసి పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల కనుదమ్ములను మూసి కలగంటి ఒకనాడు
కృష్ణా ..! నీ పేరు తలచినా చాలు పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు నీ పేరు తలచినా చాలు నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు ఏమి మురళి అది ఏమి రవళిరా ఏమి మురళి అది ఏమి రవళిరా పాట వినగ ప్రాణాలు కదలురా ఏమి మురళి అది ఏమీ రవళిరా పాట వినగ ప్రాణాలు కదలురా మురళీధరా నీ స్వరలహరులలో మరణమైనా మధురమురా నీ పేరు తలచినా చాలు వెదురు పొదలలో తిరిగి తిరిగి నీ పదపల్లవములు కందిపోయెనా వెదురు పొదలలో తిరిగీ తిరిగి నీ పదపల్లవములు కందిపోయెనా ఎదపానుపుపై పవళించరా నా పొదిగిన కౌగిట పులకించరా నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు గోపాలా..!నందబాలా! నవమంజుల మురళీలోలా! మృదు సమీర సంచిత మనోజ్ఞ కుంతల నమాల పల్లవ జాలా కృష్ణా ..! నీ పేరు తలచినా చాలు ఏమి పిలుపు అది ఏమి పిలుపు బృందానికుంజముల పూలు పూచి శరబిందుచంద్రికల చేయిచాచి తరుణాంతరంగమున దాగిదాగి చెలి అందెలందు చెలరేగి రేగి నను తొందరించెరా తొలకరించెరా తొందరించెరా తొలకరించెరా వలపు జల్లుగా పలుకరించెరా చల్లని రమణి చల్లని ఉల్లము అల్లన ఝల్లన పరవశించెరా కృష్ణా నీ పేరు తలచినా చాలు
లేతవయసు కులికిందోయ్ పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, బి.వసంత లేతవయసు కులికిందోయ్
ఒక దీపం వెలిగింది పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గాత్రం: ఘంటసాల, పి. సుశీల ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలసింది ఒక దీపం అలిగింది ఒక రూపం తొలగింది ఒక దీపం అలిగింది ఒక రూపం తొలగింది వేకువ ఇక లేదని తెలిసి చీకటితో చేతులు కలిపి వేకువ ఇక లేదని తెలిసి చీకటితో చేతులు కలిపి ఒక దీపం అలిగింది ఒక రూపం తొలగింది మంచుతెరలే కరిగిపోగా మనసు పొరలే విరిసిరాగా మంచుతెరలే కరిగిపోగా మనసు పొరలే విరిసిరాగా చెలిమి పిలుపే చేరుకోగా చెలియ వలపే నాదికాగా అనురాగపు మాలికలల్లి అణువణువునా మధువులు చల్లీ అనురాగపు మాలికలల్లి అణువణువునా మధువులు చల్లీ ఒక ఉదయం పిలిచింది ఒక హృదయం ఎగిసింది నింగి అంచులు అందలేక నేలపైన నిలువరాక నింగి అంచులు అందలేక నేలపైన నిలువరాక కన్నె కలలే వెతలుకాగా ఉన్న రెక్కలు చితికిపోగా కనిపించని కన్నీట తడిసి బడబానల మెడలో ముడిచి కనిపించని కన్నీట తడిసి బడబానల మెడలో ముడిచి ఒక ఉదయం ఆగింది ఒక హృదయం ఆరింది ఒక ఉదయం ఆగింది ఒక హృదయం ఆరింది ఒక దీపం వెలిగింది
ఔనే చెలియా సరి సరి పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గాత్రం: పి.సుశీల ఔనే చెలియా సరి సరి ఆ హంసల నడకలిప్పుడా సొగసరి ఔనే చెలియా సరి సరి ఆ హంసల నడకలిప్పుడా సొగసరి ఔనే చెలియా సరి సరి అమ్మచెల్ల తెలిసేనె ఎమ్మెలాడి వగలు ఎన్నదిలో దాచాలని కమ్మని కోరికలు వాలుకన్ను రెప్పలలో వాలాడే తొందరలో వాలుకన్ను రెప్పలలో వాలాడే తొందరలో దోరపెదవి అంచుల చిరునవ్వుల దోబూచులు ఔనే చెలియా సరి సరి ఆ హంసల నడకలిప్పుడా సొగసరి ఔనే చెలియా సరి సరి పవళింపుల గదిలో ప్రణయరాజ్యమేలాలని పవళింపుల గదిలో ప్రణయరాజ్యమేలాలని నవమల్లెల పానుపుపై నవమదనుడు త్వరపడునే నవమల్లెల పానుపుపై నవమదనుడు త్వరపడునే చెరిపడనీవే సుంత మ్మ్ చీరచెరకు గుసగుసలు ఓ చెరిపడనీవే సుంత మ్మ్ చీరచెరకు గుసగుసలు రవళ అందె మూవలూదే రాగరహస్యాలు ఔనే చెలియా సరి సరి ఆ హంసల నడకలిప్పుడా సొగసరి ఔనే చెలియా సరి సరి ఏ చోట దాచేవే ఈవరకి సిగ్గులు ఈ చెక్కిటిపై పూచే ఈ గులాబి నిగ్గులు ఏ చోట దాచేవే ఈవరకి సిగ్గులు ఈ చెక్కిటిపై పూచే ఈ గులాబి నిగ్గులు మాపటి బిడియాలన్నీ రేపటికి వుండవులే మాపటి బిడియాలన్నీ రేపటికి వుండవులే నేటి సోయగాలు మరునాటికి ఒడిలేనులే ఔనే చెలియా సరి సరి ఆ హంసల నడకలిప్పుడా సొగసరి ఔనే చెలియా సరి సరి
ప్రతీ రాత్రి వసంత రాత్రి పాట సాహిత్యం
చిత్రం: ఏకవీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గానం: ఘంటసాల, యస్.పి.బాలు ఊ..ఉ ఉ ఊ..ఉ ఉ ఊ ఆ అ అ ఆ..ఆ ఆ ఆ..ఆ ఆ..ఆ ఆహా అహా అహా అ అ అ ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి.. ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి!! బ్రతుకంతా ప్రతినిముషం.. పాట లాగ సాగాలి.. ప్రతినిముషం..ప్రియా ప్రియా..పాట లాగ సాగాలి!! ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి.. నీలో నా పాట కదలి..నాలో నీ అంద మెదలి.. నీలో నా పాట కదలి..నాలో నీ అంద మెదలి.. లోలోన.. మల్లె పొదల,పూలెన్నో విరిసి విరిసి.. లోలోన.. మల్లె పొదల,పూలెన్నో విరిసి విరిసి.. మన కోసం ప్రతినిముషం..మధుమాసం కావాలి.. మన కోసం ప్రియా ప్రియా..మధుమాసం కావాలి.. ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి.. ఒరిగింది చంద్రవంక..వయ్యారి తార వంక..ఆ ఆ ఒరిగింది చంద్రవంక..వయ్యారి తార వంక!! విరజాజి తీగ సుంత..జరిగింది మావి చెంత విరజాజి తీగ సుంత..జరిగింది మావి చెంత!! నను జూచి, నిను జూచి,వనమంతా వలచింది.. నను జూచి ప్రియా ప్రియా..వనమంతా వలచింది.. ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి!! బ్రతుకంతా ప్రతినిముషం.. పాట లాగ సాగాలి.. పాట లాగ సాగాలి..
తోటలో నారాజు పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, ఘంటసాల తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటీలో ఆ రాజు నీడ నవ్వెను నేడు తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటీలో ఆ రాజు నీడ నవ్వెను నేడు నవ్వులా అవి కావు నవ్వులా అవి కావు నవ పారిజాతాలు నవ్వులా అవి కావు నవ పారిజాతాలు రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు ఆ రాజు ఈ రోజు అరుదెంచునా ఆ రాజు ఈ రోజు అరుదెంచునా అపరంజి కలలన్నీ చిగురించునా తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటీలో ఆ రాజు నీడ నవ్వెను నేడు చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను పాటలా ధర రాగ భావనలు కన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను పాటలా ధర రాగ భావనలు కన్నాను ఎల నాగ నయనాల కమలాలలో దాగి ఎల నాగ నయనాల కమలాలలో దాగి ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్ తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటీలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
వందనాలు జననీ భవాని పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గాత్రం: ఘంటసాల వందనాలు జననీ భవాని
ఏ పారిజాతమ్ము లీయగలనో సఖి పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గాత్రం: యస్.పి.బాలు ఏ పారిజాతమ్ము లీయగలనో సఖి గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప ఏ కానుకలను అందించగలనో చెలీ గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు చంచలా వల్లికా తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా శరదిందు చంద్రికా నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి విరులెందుకు సిరులెందుకు మనసు లేక మరులెందుకు తలపెందుకు తనువెందుకు నీవు లేక నేనెందుకు నీవు లేక నేనెందుకు కలువపూల చెంత చేరి కైమోడుపు సేతునూ నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలనీ మబ్బులతో ఒక్క మారు మనవి చేసికొందును నా అంగన ఫాలాంగణమున ముగురులై కదలాలనీ చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలనీ పూర్ణ సుధాకర బింబమ్మునకు వినతి సేతును నా పొలతికి ముఖ బింబమై కళలు దిద్దుకోవాలనీ ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్ధింతును కడసారిగా నా రమణికీ బదులుగా ఆకారం ధరియించాలనీ
ఎదురు చూసిన వలపు తోటలు పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గాత్రం: పి. సుశీల ఎదురు చూసిన వలపు తోటలు
ఎంత దూరమో అది పాట సాహిత్యం
చిత్రం: ఏక వీర (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గాత్రం: పి. సుశీల , యస్ పి బాలు ఎంత దూరమో అది ఎంత దూరమో ఎంత దూరమో అది ఎంత దూరమో పరిమళించు పాంపులకు నిరీక్షించు చూపులకు పరిమళించు పాంపులకు నిరీక్షించు చూపులకు వేసిన తలుపులకు వేచిన తలపులకు ఎంత చేరువో అది అంత దూరము ఎంత దూరము అది ఎంత దూరము ఎంత దూరము అది ఎంత దూరము ఉదయించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు ఆ..ఆ.. కలలుగనే చెలునికి కలతపడే చెలియకు ఎంత చేరువో అది అంత దూరము ఎంత దూరము అది ఎంత దూరము ఎంత దూరము అది ఎంత దూరము మనసు పడని సంపంగికి మరులు విడని భ్రమరానికి ఆ.. ఆ.. మనసు పడని సంపంగికి మరులు విడని భ్రమరానికి ఉన్నదానికి అనుకున్నదానికి ఎంత చేరువో అది అంత దూరము ఎంత దూరము అది ఎంత దూరము ఎంత దూరము అది ఎంత దూరము అల్లనాటి ఆశలకు అణగారిన బాసలకు అల్లనాటి ఆశలకు అణగారిన బాసలకు మరువరాని అందానికి చెరిగిపోని బందానికి ఎంత చేరువో అది అంత దూరము ఎంత దూరము అది ఎంత దూరము ఎంత దూరము అది ఎంత దూరము
No comments
Post a Comment