Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Magaadu (1976)




చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: యన్. టి.రామారావు, మంజుల, రామకృష్ణ, లత, అంజలీ దేవి
దర్శకత్వం: ఎస్.డి.లాల్
నిర్మాతలు: లక్ష్మీ రాజ్యం, శ్రీధర్ రావు, శ్రీకాంత్ నహత
విడుదల తేది: 19.05.1990



Songs List:



కొట్టేసిండు.. జింజర.. పాట సాహిత్యం

 
చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల

పల్లవి:
కొట్టేసిండు.. జింజర.. జింజర.. జింజర.. జింజర
కొట్టేసిండు బంగారం లాంటి మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు
కొట్టేసిండు జింజర జింజర జింజర  జింజర కొట్టేసిండు

చరణం: 1
ఆహహా.. ఆహహా... హహా.. ఆహహా
గాలి రెక్కలపై ఏ వేళవస్తాడో.. పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో
గాలి రెక్కలపై ఏ వేళ వస్తాడో..  పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో

వాడు తుమ్మెదలంటాడు..  ఆ తుంటరిదంటాడు
తుమ్మెదలంటాడు ఆ తుంటరిదంటాడు
ఒక రేకైన నలగకుండా దోచుకుపోయిండు.. తేనెలు దోచుకుపోయిండు

కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర
కొట్టేసిండు బంగారం లాంటి మనసు.. కొట్టేసిండు....  కొట్టేసిండు

చరణం: 2
ఆహహా.. ఆహహా... హహా.. ఆహహా... ఆ... 
వాని చూపుల్లో కైపారు మెరిసింది..   వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది
వాని చూపుల్లో కైపారు మెరిసింది..   వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది 
వాడు పగటి సందురూడు...  నిశి రాతిరి సూర్యుడు 
పగటి సందురూడు...  నిశి రాతిరి సూర్యుడు
కదిలేటి వెన్నెల్లో సెగలు రేపుతాడు . . భల్ సెగలు రేపుతాడు

కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర
కొట్టేసిండు బంగారం లాంటి మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు
కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర కొట్టేసిండు

జింజర జింజర జింజర జింజర




కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

ఏనాడో నేను నీదాన్నీ ...నీ హృదయానికి అనువాదాన్ని
హూ....హూ..హూ..
కోరుకున్నాను.. నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


చరణం: 1
ఇంత మంచి తరుణం ఇంకెందుకూ... కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత మంచి తరుణం ఇంకెందుకూ... కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత పొంగు పరువం నీకెందుకు.. ఇంత పొంగు పరువం నీకెందుకు
కౌగిలింతలో కమ్మేసేటందుకు.. ఊ.. ఊ...

ఆరడుగుల వాడివే...ఆరిపోని వేడివే...
మంచులా.. మౌనిలా ..మాటాడకున్నావేం?
మంచులా.. మౌనిలా.. మాటాడకున్నావేం?

కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


చరణం: 2
తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే.. నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే.. నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తలపు రేకు విప్పింది ఇప్పుడే... తలపు రేకు విప్పింది ఇప్పుడే
మరి వలపు పంట పండాలా అప్పుడే.. ఊ... ఊ...

ఆకు మాటు పిందెవే ... అరుగు దిగని పాపవే...
చింతలు.. వంతలు.. నీకేమి తెలుసునులే?
చింతలు.. వంతలు.. నీకేమి తెలుసునులే?

కోరుకున్నాను... నిన్నే చేరుకున్నాను...
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను...
కోరుకున్నాను... నిన్నే చేరుకున్నాను...
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను...
ఏనాడో నేను నీవాణ్ణి ... నీ హృదయానికి అనువాదాన్ని..హూ..హూ....

కోరుకున్నాను... హ..హ..హ..
నిన్నే చేరుకున్నాను...హ..హ..హ..
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను... ఆ రోజు రానీ అని ఊరుకున్నాను

హూ..హూ.. హూ..హూ..




సల సల సల పాట సాహిత్యం

 
చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

సల సల సల సల సల సలా 
కాగిన కొద్దీ, నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్దీ వలపే ఊపిరి అవుతుంది 
ಲಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా, ఏమిటలా

విత్తనం మొలకవుతుంది 
మొలకేమో, మొక్కవుతుంది
మొక్క ముదిరితే చెట్టవుతుంది
ముద్దు పెరిగితే మోజవుతుంది 
ಲಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా ఏమిటలా

కోరికేదో పులకిస్తుంది
గుండెలోని కలకేస్తుంది 
కొత్త కొత్తగా విసురొస్తుంది 
మెత్త మెత్తగా మెరుపొస్తుంది 
ಲಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా ఏమిటలా

సలసల - సలసల
కాగిన కొద్దీ
మెరుపుంటే మబ్బుంంది 
మబ్బుంటేనే మెరుపుంటుంది 
మెరుపూ మబ్బూ ఒకటైతేనే
జల్లు కురుస్తుంది హరివిల్లు పొడుస్తుంది
ಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా ఏమిటలా

సలసల సలసల సలసలా 
కాగిన కోద్దీ  నీరు ఆవిరి అవుతుంది
సాగిన కొద్దీ, వలపే ఊపిరి అవుతుంది


No comments

Most Recent

Default