Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sri Ranga Neethulu (1983)




చిత్రం: శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె.చక్రవర్తి 
నటీనటులు: నాగేశ్వరరావు, శ్రీదేవి, చంద్రమోహన్, విజయశాంతి
దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి
నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
విడుదల తేది: 13.09.1983



Songs List:



గూటికొచ్చిన చిలక పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె.చక్రవర్తి  
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: మాధవపెద్ది రమేష్ 

గూటికొచ్చిన చిలక 




తొంగి తొంగి చూడమాకు... పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె.చక్రవర్తి  
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
హె... హె... హే.. లలలలా..
హె.... హె... హే.. లలలలా.. 

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా

వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా

అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా 

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

చరణం: 1
వెన్నెల్లో వేడుకుంది... కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
ఇద్దర్లో వేగముంది... వద్దన్నా ఆగకుంది పైడిబొమ్మా

పూల బాణాలు వేసేకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?
పూల బాణాలు వేసేకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?

కలిసే ఉందామా కరిగే పోదామా
చుప్పనాతి చుక్కల్ని దాటుదామా
చూడలేని చంద్రుణ్ణి తరుముదామా 

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా
తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

చరణం: 2
గుండెల్లో తాళముంది... గొంతుల్లో రాగముంది కలుపుదామా
పొద్దెంతో హాయిగుంది... ఎంతెంతో పొద్దువుంది గడుపుదామా

ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపిగా వానలో తేలిపోదమా?
ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపిగా వానలో తేలిపోదమా?

స్వర్గం చూద్దామా...  సొంతం చేద్దామా
మత్సరాలు మాననీ మచ్చమామా
దండమెట్టి ఇద్దరం కొలుచుకోమా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా

వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా

అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా 

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
తొంగి తొంగి చూడమాకు... చందమామా




కళ్ళు ఒకే పళ్ళు ఒకే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె.చక్రవర్తి  
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..నడుము..  ఒకే...నడక ఒకే..
ఆపైన వర్ణించ వీల్లేని అందాలన్నీ.. ఒకే..ఒకే..ఒకే.. 

మాట ఒకే..ఆట ఒకే.. వయసు.. ఒకే..మనసు ఒకే..
ఆపైన నాపైన నీకున్న.. తాపాలన్నీ.. ఒకే..ఒకే..ఒకే.. 


చరణం: 1
నీ కన్న తల్లీ నిను కన్న నాడే .. అడిగినావట నన్నే..
తొలిసారి నువ్వు..కను విప్పగానే.. వెతికినావట నన్నే..
ఎదిగావు కన్నెవై.. పదహారు వన్నెవై

హద్దులేని తుంటరివై.. ముద్దులాడు అల్లరివై
వంపుల సొంపుల ఒళ్ళంత కులుకై
తడబడు అడుగుల టక్కరి నడకై
నీ చుట్టు చుడుతున్న మనసైన చుట్టానైతే.. ఒకే..ఒకే..ఒకే..

కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..నడుము ఒకే...నడక ఒకే..
ఆపైన నాపైన నీకున్నతాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే..

చరణం: 2
నునుసిగ్గు మొగ్గై నూటొక్క రేకై.. విచ్చుకొంటిని నీకై
నునూగు వయసై నూరేళ్ళ తపస్సై.. కాచుకొంటిని నీకై

కొండంత కోరికై...  గుండెల్లో చోటుకై..
చేరినావు నా చెలివై..మారినావు కౌగిలివై

ఉరకల తురుగుల పరుగై నురుగై
వలపుల మెలకుల వయ్యారి జతవై
నీకళ్ళు నాకళ్ళు నిలువెత్తు అద్దాలైతే... ఒకే..ఒకే..ఒకే....... 

మాట ఒకే..ఆట ఒకే..వయసు ఒకే..మనసు ఒకే..
ఆపైన నాపైన నీకున్నతాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే..

కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..నడుము..  ఒకే...నడక ఒకే..
ఆపైన వర్ణించ వీల్లేని అందాలన్నీ.. ఒకే..ఒకే..ఒకే..





పంచమి పూట మంచిదని పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రీరంగ నీతులు (1983) 
సంగీతం: కె.చక్రవర్తి   
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:  ఏఎస్.పి.బాలు, పి.సుశీల      

పల్లవి:
పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
వచ్చే  వారం ముచ్చటని రాసిచ్చాను ఎద చాటు
ఆ మాటే నా కొంప ముంచింది  ఆ రాతే నా దుంప తెంచింది
ఆ మాటే నా కొంప ముంచింది  ఆ రాతే నా దుంప తెంచింది
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో..

అయ్యో పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు
ఊపిరి నీవే అన్నాడని మనసిచ్చాను గ్రహపాటు
ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది
ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది 
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో... 

పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
అయ్యొ పాపం మంచొడని చనువిచ్చాను పొరపాటు

చరణం: 1
కళ్ళలోకి చూస్తే సంకేళ్ళు వేసేస్తావు
నీ పైట చాటుకు వస్తే చాపల్లే చుట్టేస్తావు 

కలలోకి రావదన్నా వస్తావు రేయంతా
నీ ప్రేమ ముద్దరలన్ని వేస్తావు ఒల్లంతా  

సరదాలే ఈ వేళ సరిగమలే పాడాయి 
ఆ మాటే అన్నావు చాలింక.. నీ మొజే మళ్ళింది నా వంక 
అయ్యొ అయొ అయొ అయ్యొ అయ్యో...

పంచమి పూట మంచిదని మాటిచ్చను పొరపాటు
అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు 

చరణం: 2
ఎదురుగ ఉన్నా గాని ఎదలోకి రమ్మన్నానా?
ఎగతాళికన్న గాని నను దొచుకోమన్నానా ?

వగలన్ని చూస్తూ ఉంటే  వయసూరుకుంటుందా?
కనుసైగ చేస్తూ ఉంటే  వలపాపుకుంటుందా ?  

సరికొత్త గుబులేదో గుండెల్లో రేపేవు
ఈ వింతే పులకింత కావాలి... నీ చెంతే బ్రతుకంతా సాగాలీ
అయ్యొ అయొ అయొ అయ్యొ అయ్యో.... 

అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు
పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది
ఆ మాటే నా కొంప ముంచింది  ఆ రాతే నా దుంప తెంచింది

పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు




అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా...
అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా 

ఉత్తరాన మబ్బుల్లాగా.. కొత్తనీటు పొంగుల్లాగా
ఉత్తరాన మబ్బుల్లాగా.. కొత్తనీటు పొంగుల్లాగా
సిత్తరాలు చూపించాలమ్మా

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా
అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా

సన్నజాజి రమ్మంటుందీ.. సందె పొద్దు సయ్యంటుందీ.
సన్నజాజి రమ్మంటుందీ.. సందె పొద్దు సయ్యంటుందీ.
ఆశలన్నీ నువ్వే కన్నయ్యా...

అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా

చరణం: 1
చూపూ చూపూ చేరాలీ పూటా.. రోజూ మోజూ తీరాలీ చోటా
నీలో నేను నిండుగ నిండాలి.. నీతో నేనూ నీడగ సాగాలి

పాడాలి ముచ్చట్లే పసిడి తలపు తలుపు తెరచి
కొట్టాలి చప్పట్లే మూగ మనసు ఆద మరిచి..

చిందాలి సందళ్ళే చిలిపి చిలిపి వలపు చినుకు
వెయ్యాలి బంధాలే నింగీ నేల నిలుచు వరకు
ఆయోగం నాదీ అనురాగం నీదీ.. అదే అదే.. పదే పదే నా గుండె కోరేది

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా 

చరణం: 2
పూచే పువ్వు నీలా నవ్విందీ.. పోంగే తేనే నాదే నంటుందీ..
పారే వాగు నీలా దూకిందీ రేగే జోరూ నాదే నంటూందీ..

చూడాలి చూపుల్లో గడుసు వయసు సొగసులన్నీ
తీరాలి నవ్వుల్లో దుడుకు మనసు ఛణుకులన్నీ

చూశానూ నీలోనూ కన్నుల ఎరుపు కలల మెరుపు
విన్నాను నీలోను మమత తెలుపు మనసు పిలుపు
ఇంకెందుకంటా ఈ వాదులాట అంతే చాలు.. అంతే చాలు నా పంట పండిందీ

అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా

ఉత్తరాన మబ్బుల్లాగా కొత్తనీటు పొంగుల్లాగా
ఉత్తరాన మబ్బుల్లాగా కొత్తనీటు పొంగుల్లాగా
సిత్తరాలు చూపించాలమ్మా

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా



నాకు చోక్లెట్ కావాలి పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె. చక్రవర్తి   
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల      

నాకు చోక్లెట్ కావాలి 

No comments

Most Recent

Default