Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aakasa Ramanna (1965)




చిత్రం: ఆకాశరామన్న (1965)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
మాటలు, పాటలు: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి 
నటీనటులు: కాంతారావు, రాజశ్రీ, వాణిశ్రీ
దర్శకత్వం: జి.విశ్వనాథం
నిర్మాత: వై. వి.రావు
ఎడిటర్: కె.ఎస్.ఆర్.దాస్
విడుదల తేది: 08.07.1965

గమనిక: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి , వేటూరి సుందరరామ మూర్తి, ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు ఈ సినిమాలో పాటలు రాసింది వీటూరి. (వేటూరి కాదు)



Songs List:



దాగవులే... దాగవులే... పాట సాహిత్యం

 
చిత్రం: ఆకాశరామన్న (1965)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి

ఆ...
దాగవులే... దాగవులే... దాగవులే
ఉబికి... ఉబికి... ఉరికి ఉరికి
ఉప్పొంగే మోహాలూ ఆగవులే...
సాగవులే... సాగవులే... సాగవులే...
కొసరి కొసరీ పిలిచీ... పిలిచీ
కవ్వించే సరసాలూ... చాలునులే...

నగుమోము చూపక పోతే
నీ నడుము ఉందిలే!
నీలోని కదలికలన్నీ అది తెలుపుతుందిలే !
కనిపించే కదలికలోనా కైపొకటే ఉన్నది!
కనరాని నా మదిలో కన్నె మనసులున్నవీ!
ఊ...
ఆ...
అయితే యిపుడే చూడాలి!
శ్రీ వారు కొంచెం తగ్గాలి

నీ పెదవులు దాచుకున్నా 
చిరుమువ్వలు చాలులే
నీ యెదలో గుస గుస లన్నీ
నాట్యమాడి తెలుపునులే
వినిపించే ఊసులలోనా  వింతేమిటున్నది?
వినరాని ఊహలోనే సంగీతమున్న ది !
ఊ!
సరసకు వచ్చే వింటాము
ఒయ్! సమయం రావాలంటాము..




ముత్తెఁవంటి పాట సాహిత్యం

 
చిత్రం: ఆకాశరామన్న (1965)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి 
గానం: యస్. జానకి & పార్టీ

ముత్తెఁవంటి సిన్న దాన్ని
మొగలిరేకు వన్నె దాన్ని!
మొగమాటం పడతావేం రాయడా !
అబ్బ! అబ్బ! అబ్బ నీ జబరు
చూసి వచ్చాను రాయడా!

సుక్కలా .. వచ్చినా సుక్కలా వచ్చినా
సొంపులే తెచ్చినా
ఇయేళ నీ కోసం ఏదో అయిపోయినా !
మాటలు వద్దయ్యా ! రావయ్యా ! 
బలే మామయ్యా!
వయసు నీదయ్యా  వదలి పోనయ్యా

చేతులే ఒగ్గకూ.. చేతులే ఒగ్గకూ!
సిగ్గుతో తగ్గకు... సిగ్గుతో తగ్గకూ!
మొగసిరి గలవోడ ముందు వెనక చూడకూ
మనకు తొలి జనమా బంధముంది
వావి వరస ఉంది!
చూపు కలుసు కుంది
యింక హద్దే ముంది 



ఓ చిన్న వాడ పాట సాహిత్యం

 
చిత్రం: ఆకాశరామన్న (1965)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి 
గానం: యస్. జానకి 

ఓ చిన్న వాడ - ఒక్క మాట !
ఉన్నాను చూడవోయ్ - నీ ఎదుట !
బొమ్మను నే కాను పరువాలా రెమ్మను
కులికే అందానికి అందము నేను

మబ్బుల్లో దాగున్న - మెరుపును !
హరివిల్లు ఒంపులోని సొంపును !
కన్నె పిల్ల సిగ్గులోని  మొగ్గను |
కలలుగనే కలువ కనుల కలవరింతును


పడుచు తనపు తోటలోని - పువ్వును
ఈ భువిలో వెలసిన తొలి - నవ్వును !
గోవిందుని లాలించిన - రాధను !
తర తరాల యువకులకే ప్రణయ గాథను




ఎగరాలీ! ఎగరాలీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆకాశరామన్న (1965)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి 
గానం: యస్. జానకి & పార్టీ

జై ! ఆ కాళరామన్న కూ జై !
ఎగరాలీ! ఎగరాలీ!
ఎగరాలీ, ఎగరాలీ, - రామదండు బావుటా!
అందరిదీ ఒకే మాట - అందరిదీ ఒకే బాట!
ఎగరాలీ, ఎగరాలీ, రామదండు బావుటా!
రామదండు వర్ధిల్లాలి - రామరాజ్యం నెలకొల్పాలి!
ప్రతి ఒక పౌరుడు - వీరునిగా మారాలీ!
ప్రతి వ్యక్తి ఒక శక్తిగ - పోరాడాలి!
ఇది నీ దేశం కోసం! ఏదీ నీఆవేశం? సాహసమేనీకవచం!
దుష్ట శక్తులను తరిమిన నాడే
కలుగును జాతికి సంతోషం!

అందరిదీ ఒకే మాట - అందరిదీ ఒకే బాట!
ఎగరాలీ, ఎగరాలీ, - రామదండు బావుటా!

కండ బలం! గుండెబలం! కలిగిన నాడే మానవులం!
కాంతి పధం, కాంతిరథం సాగించటమే నీశపథం
హింసాపరులకు ఓడుతప్పదని
ధరిత్రి, చరిత్ర - ఘోషిస్తున్నదీ!
ధర్మం ఒకటే - ఓడిపోనిదీ!
న్యాయం ఒకటే - తిరుగులేనిదీ! 
పదరా! దేశం పిలుస్తున్నదీ!
పదరా! దేశం పిలుస్తున్నదీ! ......

అందరిదీ ఒకే మాట అందరిదీ ఒకేచాట!
ఎగరాలీ, ఎగరాలీ, రామదండు బావుటా!
సాగనీము దుండగాలు ఇంకిటు పైనా!
సాధిస్తాం! ఆశయమే ఎన్నటికైనా!
కల్పిస్తాం క్రమశిక్షణ - రాజ్యానికి తగురక్షణ!
పాడుతాము దేశమాత - భవ్యకీర్తనా!
పాడుతాము దేశమాత - భవ్యకీర్త నా! 

అందరిదీ ఒకేమాట - అందరిదీ ఒకే బాట!
ఎగరాలీ, ఎగరాలీ - రామదండు బావుటా!

ఆకాశ రామన్నకు జై ...




నవ్వు నవ్వు పాట సాహిత్యం

 
చిత్రం: ఆకాశరామన్న (1965)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి 
గానం: యస్. జానకి 

నవ్వు నవ్వు నవ్వు నవ్వు
నవ్వు బ్రతుకున వరము....
కన్ను కన్ను కన్ను కన్ను...
కన్నులు కలసిన క్షణము.
అన్నీ విడచి హద్దులు మరచి
గువ్వల్లా మువ్వల్లా ఒక సారి 
నువ్వు నేనూ ఒక టౌదామూ!

ఉరకలు వేసే ఊహలలోనా ఊగీ తూగీ!
ఊయలలూపే పరవశ మందున తూలీ సోలీ! 
మనసారా మళ్ళీ మళ్ళీ అలవోలె తుళ్ళి తుళ్ళి!
అందాల స్వర్గంలోనా విహరింతమూ! 

కనుగొన వోయీ చూపుల్లోనా వాడీ వేడీ!
చేకొనవోయీ అందాలన్నీ ఆడీ పాడీ!
వినవోయి  మువ్వల చిందు
ఇదియే నా వలపుల విందు.
అనుభవమే చివరకు మిగిలే అనందమూ



డుంకు..డుంకు..ఓ పిల్లా! పాట సాహిత్యం

 
చిత్రం: ఆకాశరామన్న (1965)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి 
గానం: యం..సత్యం, యస్. జానకి

డుర్..... ర్... డుర్రుచ్చి!
డుంకు..డుంకు..ఓ పిల్లా! 
డుంక వె...డుంక వే ఇల్లాలా!
కిర్.... ర్.... కిర్రుచ్చి!
లింగు లింగు ఓనాథా! లొంగితి నీకే వినరాదా!
నీ లటపటలన్నీ కట్టి పెట్టు
నీ మాట దాటితే ఒట్టు పెట్టు
లట్ పట్టు...
కట్టి పెట్టు 

లట్ పట్...లట పట్ లట్ పట్... కట్టి పెట్టు

అందితె పిలక అందకుంటే కాళ్ళు!
అందితె పిలక అందకుంటె కాళ్ళు! పడతారు! ఆడాళ్ళు
పైగా చీటికి మాటికి, కంటతడి పెట్టి- వేషాలు వేస్తారూ

ఇప్... రామ రామ
సందు దొరికిన సాధిస్తారు!
సందు దొరికితే సాధిస్తారూ! ఇదేమి మగ వాళ్ళు!
మూడు ముళ్ళు వేసి మా నోళ్ళు మూసి మీసాలు దువ్వుతారు

ఔనా అంటే కాదంటారూ!
ఔనా అంటే కాదంటారు! అలరి పెడతారు!
ఇల్లు గుల్ల చేస్తారు...మీ ఆడవారు వద్దు ఈ పోరు

అయ్యో రామ.. రామ... 
నీతోవుంట... నీ మాట వింటా
నీతోవుంటా! నీ మాటవింటా! ఎందుకు ఈతంటా!

నన్ను ఏలుకుంటే చాలు ఆ పది వేలు! నాథా కేకిసలు
నీ లటపటలన్నీ కట్టి పెట్టు!
నీ మాట దాటితే ఒట్టు పెట్టు!
ఈ హద్దూ! 
ఇక వద్దు

మన వాదాలన్ని రద్దు!
మన మొక టైతేనే ముద్దు
మన వాదాలన్ని రద్దు - మన మొక టైతే నేముద్దు ...



చల్ల చల్లగా సోకింది. పాట సాహిత్యం

 
చిత్రం: ఆకాశరామన్న (1965)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి 
గానం: యస్. జానకి

చల్ల చల్లగా సోకింది.
మెల్ల మెల్లగా తాకింది ... ఒయ్...
జివ్వు మనీ నరాలన్ని రవ్వ సేయగా తీయగా!
గిలిగింతలు పెట్టింది - అల్లరి చిరుగాలి

ఒంటరిగా నేనుంటే తుంటరిలా వస్తాడు.
వెంటబడి రేయంతా వదలమన్నా వదలడు!
నిదురే పోనీడు నిలబడ నీడు!
మత్తుమందు జల్లి నాడు... .హు ...
మత్తుమందు జల్లినాడు మాయదారి చంద్రుడు

No comments

Most Recent

Default