Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhale Mastaru (1969)




చిత్రం: భలే మాస్టారు (1969)
సంగీతం: టి. వి.రాజు
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవి, కాంచన
దర్శకత్వం: ఎస్.డి.లాల్
నిర్మాత: సి.ఎస్.రావు
విడుదల తేది: 27.03.1969



Songs List:



నాలో యేమాయనేమయనే పాట సాహిత్యం

 
చిత్రం: భలే మాస్టారు (1969)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం:  పి. సుశీల , ఎల్‌.ఆర్ ఈశ్వరి

నాలో యేమాయనేమయనే 
లోలోన గుబులాయె గుబులాయెనే 
నాలోన నీలోన అదే ఆమె

అసలే లేలేత ఒళ్ళు
ఆపై చన్నీటి జల్లు
నా మదిలోన యౌవన వీణ
ఝమ్మని పాడె-కమ్మగ నేడె కనవే
ఏవేవో భావాలే హాయ్ చెలరేగె

పొంగే అందాల కోసం
పూచీ పరువాల కోసం
ఏ చినవాడొ ఏ చెలికాడొ
ఏ కొమ్మల్లో- దాగున్నాడొ యేమో
ఓయమ్మో! అమ్మమ్మో !
ఇంకేముంది

జుజు జుజుజు





రింగు మాస్టారు పాట సాహిత్యం

 
చిత్రం: భలే మాస్టారు (1969)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల , ఎల్‌.ఆర్ ఈశ్వరి

రింగు మాష్టార్ సార్ సార్ సార్
డొక్కు మాష్టార్ జోర్ జోర్ జోర్
చాలండీ! మీ రుస రుసలూ
ఆపండి! మీ నసనసలూ-హెయ్ 

వయసులో ఏముంది. వలపులో పసవుంది
మనిషిలో బిగువుంటే_మగసిరికిలోటేముంది?
వయసు మళ్ళి పోయినవాళ్ళు
మునలితనము ముసిరిన వాళ్లు
మాటలేమో చెబుతారు
మరులు పెంచుకుంటారు
అనుభవమ్ము చాలదు మీకు
అంత చదువు లేదులే మీకు
అన్నిటికీ చాలిన వాణ్ణి 
మన సంగతి మీకేం తెలుసు

కోరస్: తనక తనకం ఝనక ఝనకం నిన్ను వదలం

ముక్కుచూస్తే కోటేరండి
మొగం ముద్దు కారేనండి
రకం చూస్తే ఏమీ లేదు
పాత చింతకాయ పచ్చడి

పత్యానికి చాలామంచిది
తాపానికి తగిన మందిది
ఎందుకైన మంచిది వదలవద్దు మీరిది

కోరస్: తనకతనకం ఝనక ఝనకం నిన్ను వదలం



అదిగో చిన్నది పొగరు చాలా వున్నది పాట సాహిత్యం

 
చిత్రం: భలే మాస్టారు (1969)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: దాశరధి
గానం: ఏ.ఎల్ రాఘవన్

అదిగో చిన్నది పొగరు చాలా వున్నది 
కనులే కలిపితే కలత పడుతున్నది 
పొగరులోనే సొగసు వున్నది తెలుసుకోండి 
ఛం ఛమక ఛం ఛం ఛమక ఛం
తెలుసు కోండీ!
షోకైన నీటైన రోమ్యోలు
సైఁయంటే సైయంటూ రావాలి
కవ్వించీ నవ్వించీ చూడాలి
చినదానీ హృదయాన్నీ పొందాలి
అందాలు చిందించే లైలాలు
ఔనంటే కాదంటే సరికాదు
ప్రేమించే సమయంలో ఉలుకేలా
చినవాడూ జతలేనీ బ్రతుకేలా!





హలో మేడమ్ పాట సాహిత్యం

 
చిత్రం: భలే మాస్టారు (1969)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల

హలో మేడం
ఇలా చూడవేలా! అలా కోపమేలా
బుగ్గల్లో గులాబిరంగు నాదే నాదే 
నీ కన్నుల్లో చలాకి నవ్వు నాదే నాదే

అలిగేవేల... అంద చందాల వేళ
తొలిగేంత చేరేటివేళ
మదిలో మమత పైనే అలక
నీలో వలపు నాకే తెలుసు

నాలో నేడు తొంగిచూసింది ఆశ
అలలై లేచి పొంగిపోయింది ప్రేమ
నీ బిడియాలు నీ బింకాలు
అవి నావైతే అంతేచాలు




ఉండనీ వుండనీ పాట సాహిత్యం

 
చిత్రం: భలే మాస్టారు (1969)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

ఉండనీ ఉండనీ నీతోనే ఉండనీ
నీలోనే ఉండనీ ఏవేవో భావాలే - ఎదలో పొంగనీ
వాలు కళ్ళంటున్నవి నన్నే నేను చూడాలని
మనసు కలగంటున్నది మిన్నులలో తేలిపోవాలని
తీయని ఊహలే-తీవెలె సాగనీ
నీ గుండెలో ఒక దండనె విరబూయాలని
నా అందమే అనుబంధమై పెనవేయాలని
తలచే చెలియ-బ్రతుకే పండనీ



నీవే నేనై నేను నీవే నీవే పాట సాహిత్యం

 
చిత్రం: భలే మాస్టారు (1969)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. సుశీల

నీవు నేనై నేను నీవే నీవే
ఎదలే లీనములాయె
పువ్వులలోని పొంగేమైకం నీవే
నవ్వులలోని నిగనిగలన్నీ నేనే
పూల తావి మోవికావి నీవు నేనే
నీవు నేనై నేను నీవే నీవే

చల్లనిగాలి వెచ్చని ఆశ నేనే
కన్నుల వెలుగు కౌగిలిబిగువు నీవే
వీడిపోని రాగబంధం నీవు నేనే
నీవు నేనై నేను నీవే నీవే



యే దారి గోదారి పాట సాహిత్యం

 
చిత్రం: భలే మాస్టారు (1969)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: పిఠాపురం , ఎల్‌.ఆర్ ఈశ్వరి

(రాజాబాబు, రమాప్రభ లపై చిత్రీకరించారు)

ఏ దారి 
గోదారి
కాడిలాకు కారు తెమ్మంటావా?
తోడుగా ఎక్కి కూర్చుంటావా?
ఢిల్లీ బొంబాయి తిప్పమంటావా?
ఏ దారి
గోదారి
సొట్టబుగ్గల సోగ్గాడవూ
వట్టిమాటల పోస్కోలువూ
పెళ్లి అంటే బెదిరిపోతావు
ఏమిచెప్పిన చేస్తానులే
కాగితంరాసి ఇస్తానులే 
నూరుగుంజిళ్ళు తీస్తానులే
అపుడు నువ్వేచూస్తావులే
ఏదారి గోదారిరహదారి

బాసలెన్నో చేసావయ్యో
లేత లేతవి కోస్తావయ్యో
చాటుమాటు లవ్వెందుకు
తాళిగట్టను రా ముందుకు
ఏ దారి గోదారి రహదారి




వన్ టు త్రీ క్విక్ ట్విస్ట్ డాన్సులే పాట సాహిత్యం

 
చిత్రం: భలే మాస్టారు (1969)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్‌.ఆర్ ఈశ్వరి

వన్ టు త్రీ క్విక్ ట్విస్ట్ డాన్సులే
వన్ టు త్రీ జంప్ బెస్ట్ ఛాన్సులే
రౌండ్ అండ్ రౌండ్ యెంతో తమాషా
అప్ అండ్ డౌన్ ఆట హమేషా
లిప్పుకి లిప్పుకి దూరం తెలియాలి
ఎప్పటి సుఖమూ అప్పుడే పొందాలి
విస్కీలోలేని నిషాలు బ్రాందీతో దానిమజాలు
చెంతకువస్తే నేనే అందిస్తా
అంతే లేనీ వింతలు చూపిస్తా

No comments

Most Recent

Default