చిత్రం: చిత్రలహరి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేద పేతురాజ్ దర్శకత్వం: కిషోర్ తిరుమల నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ , మోహన్ చెరుకూరి బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ విడుదల తేది: 12.04.2019
Songs List:
పరుగు పరుగు పాట సాహిత్యం
చిత్రం: చిత్రలహరి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్ గానం: డేవిడ్ సైమన్ పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు జరుగు జరుగు అంటుందె లైఫు ఎంత పెంచుకుంటున్న నా వేగం నన్ను దాటిపోతుందె లోకం చక్రాల్లేని సైకిల్ లాగ రెక్కల్లేని ఫ్లైట్ లాగ బుల్లెట్ లేని రైఫిల్ లాగ దారం లేని కైట్ లాగ నేను కూడ మిగిలిపోయా పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు జరుగు జరుగు అంటుందె లైఫు ఎంత పెంచుకుంటున్న నా వేగం నన్ను దాటిపోతుందె లోకం రేపనేది కలల్లోనేనా నిజంగా అది రాద నిన్నలోనె నేనుండిపోవాల దాటి వెల్లె దారి లేదా మబ్బుల లోని ఫుల్ల్ మూన్ లాగ ఆర్కెస్ట్రా లేని ట్యున్ లాగ నేను కూడ మిగిలిపోయా పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు జరుగు జరుగు అంటుందె లైఫు ఎంత పెంచుకుంటున్న నా వేగం నన్ను దాటిపోతుందె లోకం Yeah, You Got to Run You Got to Run You Got to Run You Got to Do What You Got to Do To Get to Where You Wanna Be Life Is Not A Bed of Roses Man You Got to Get That in Your Head Let’s Go ఒక్క అడుగు నన్ను ముందుకెయ్యనివ్వదె వెనక్కి తోసె ఎదురు గాలి ఒక్క మెట్టు నన్ను పైకి ఎక్కనివ్వదె నన్ను తొక్కె ఫోర్స్ నేమనాలి అంతం లేని నిరీక్షణ లాగ ఫలితం లేని పరీక్షలాగ నేను కూడ మిగిలిపోయా పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు జరుగు జరుగు అంటుందె లైఫు ఎంత పెంచుకుంటున్న నా వేగం నన్ను దాటిపోతుందె లోకం
గ్లాస్మెట్సు…పాట సాహిత్యం
చిత్రం: చిత్రలహరి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: రాహుల్ సిప్లిగంజ్ , పెంచల్ దాస్, దేవి శ్రీ ప్రసాద్ స్కుల్ కెల్లె వరకేరా క్లాస్మెట్సు రెంట్ కట్టె వరకేరా రూమెట్సు స్కుల్ కెల్లె వరకేరా క్లాస్మెట్సు రెంట్ కట్టె వరకేరా రూమెట్సు వీకెండ్ వచ్చె వరకేరా ఆఫిస్మెట్స్ లైఫె ఎండ్ అయ్యె వరకేరా సోల్మెట్స్ అరెయ్..ఎండ్ అంటు లేని బెండ్ అంటు కాని.. రియల్ రెలేషన్షిప్ యే గ్లాస్మెట్సు…గ్లాస్మెట్సు గల గల గల గల గ్లాస్మెట్సు గ్లాస్మెట్సు…గ్లాస్మెట్సు గల గల గల గల గ్లాస్మెట్సు హెయ్ పప్పు రేటు పెరిగితె పెరగని పెరగని ఉప్పు రేటు పెరిగితె పెరగని పెరగని పెత్రోల్ దర తగ్గితె తగ్గని తగ్గని ఏ పార్టి ఓడని నెగ్గని నెగ్గని మన స్నాక్స్ ఫ్రెష్గుండని మన ఐస్ చల్లగుండని మన మంచింగ్ మంచిగుండని మన గ్లాస్ ఫుల్లుగుండని అరెయ్ ముంచేద్దాం దాన్లొ మన గుండెని గ్లాస్మెట్సు మనం గ్లాస్మెట్సు గల గల గల గల గ్లాస్మెట్సు గ్లాస్మెట్ మనం గ్లాస్మెట్సు గల గల గల గల గ్లాస్మెట్సు గల గల గల ఇది గ్లాస్మెట్స్ కల గల గల గల ఒక గుటకేస్తె భలా గల గల గల ఇది గ్లాస్మెట్స్ కల గల గల గల ఒక గుటకేస్తె భలా ట్రంప్ మనకు విసాలె ఇవ్వని మానని పంపు నీల్లు ప్రతిరోజు నిండని యెండని బయ్ వన్ కి గెట్ వన్ అమ్మని ఆపని ఐఫోన్ కి న్యూ మోడల్ దించని ముంచని మన బీర్ పొంగుతుండని మన బార్ రస్ గుండని ఈ సిప్ సాగుతుందని ఈ కిక్కు వూగుతుండని ఈ ఒక్కటుంటె లోకం తొ ఇంకేం పని… గ్లాస్మెట్స్ మనం గ్లాస్మెట్స్ గల గల గల గల గ్లాస్మెట్స్ గ్లాస్మెట్స్ మనం గ్లాస్మెట్స్ గల గల గల గల గ్లాస్మెట్స్ వి ఆర్ ఆల్ గ్లాస్మేట్స్
ప్రేమ వెన్నెలా పాట సాహిత్యం
చిత్రం: చిత్రలహరి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: సుదర్శన్ అశోక్ రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా వానలా వీణలా వాన వీణ వాణిలా గుండెలో పొంగిన కృష్ణ వేణిలా ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా సరిగమల్ని తియ్యగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల మారదా పగలిలా అర్థరాత్రి లా నవ్వితే నువ్వలా మెల్లగా మిల మిల కలవరం గుండెలో కలత పూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయెనేమో నీ రెండు కళ్లలా నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన నిన్ను చూసే రాసినాడలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా నడకే నువ్వలా కలలలో కోమలా... నడకే నువ్వలా కలలలో కోమలా పాదమే కందితే మనసు విల విలా విడువకే నువ్వలా పలుకులే గల గల పెదవులు అదిరితే గుండె గిల గిల అంతు లేని అంతరిక్షమంతు చూడకే అలా నీలమంతా దాచిపెట్టి వాలు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా ప్రాణమంతా పొంగిపోయేలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రయత్నమే పాట సాహిత్యం
చిత్రం: చిత్రలహరి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కైలాష్ కెహర్, విష్ణు ప్రియ రవి ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే అడుగు అడుగు వెయ్యనిదే అంతరీక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసి పాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనిదే మహా సంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురా నీ సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం (2) ఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే వెళ్లే దారుల్లోన రాళ్ళే అడ్డొస్తున్నా అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి అడుగంటూ వేసాక ఆగకుండ సాగాలిర నీ సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం (2) ఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
No comments
Post a Comment