Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Daasi (1952)




చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: వసంత కుమారి, పి.లీల, జిక్కి, ఎ.పి.కోమలి, రత్నమాల, S.దక్షిణామూర్తి, పిఠాపురం నాగేశ్వర రావు, ప్రసాదరావు 
నటీనటులు: కొంగర జగ్గయ్య, కాంచన, మణిమాల
దర్శకత్వం: సి.వి.రంగనాథ దాస్
దర్శకత్వ పర్యవేక్షణ: ఎల్.వి.ప్రసాద్
సహాయ దర్శకుడు: యస్.డి.లాల్ 
నిర్మాత: సి. లక్ష్మీరాజ్యం
విడుదల తేది: 26.11.1952



Songs List:



మారాజుల చాకిరిచేసి పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: 

మారాజుల చాకిరిచేసి, దొరసానివచ్చావే, 
ఈ పూటకు బువ్వేమయిన వండేస్తావా, 
రోజంతా బండితోలి దొరలాగ వచ్చావే, 
ఈ వారము రేషనుబియ్యం కొని తెచ్చావా, 
మనసంతా నీమీదనే, మరచానే రేషను బియ్యం 
అటులయితే నేనున్నానే, ఎందుకుబువ్వ
నా అందముచాలా

బ్రతుకంతా బానిసలయిన గుడిసెల్లో 
కాపురమయిన, అనురాగము నిండినయిల్లే 
చల్లనియిల్లు, మా చల్లనియిల్లు, 
ఓ...... బండిని తోలకురా, నీ బాబులాగా 
ఓ...... దాస్యము చేయకురా నీతల్లిలాగా, 
బడికిపోయి బాగ చదివి ప్లీడరు కారా 
మామంచివాడనిపించు, మర్యాదగజీవించు
మహరాజులే సంపాయించూ, భేషనుపించు, 
మా ఆశలు తీర్చు,

ఓ...... నీ పోలికేవస్తే చాలూ, రౌడి అవుతాడు 
ఓ..నీ తెలివిరాందేమేలు, అదే పది వేలు, 
మనలో మనకు పోట్లాటల పొందుగా వుందాము 
ఇల్లాలు నువ్వేనంటా, యిల్లంటే మన దేనంటా
మనయింట పండినపంటా పాపాయంటా
ఈ పాపాయంటా




జోర్సె ఛలో నా రాజా ఘోడా పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పిఠాపురం నాగేశ్వర రావు

జోర్సె ఛలో నా రాజా ఘోడా 
హవా ఘోడా జల్దిఛలో 
ఘర్మేదానా గరం, గరం హై 
ఖానా, పీనా జల్దిఛలో, 
పొద్దునగాడి తగిలిస్తా 
రైలుకు బస్సుకు తిప్పిస్తా 
దొరికిన పైసా సగం నీకిస్తా 
ఖుష్ రాబేటా జల్ది ఛలో

బండిలో ఎందరో వస్తుంటారు 
గుసగుసలెన్నో వింటూ వుంటాము 
గుట్టునదాస్తే బెట్టుగా వుంటాము 
హుషా రేబేటా యాదురభో 
యాదురభో, యాదురభో జోర్సె

గరీబునైనా, షరాబు నైనా, 
పైకిరమ్మనే చెప్తుంటాము 
కష్టజీవులకు గంజి కెన్నడు
భయమేలేదు, బాతుసునో
బాతుసునో, బాతుసుకో




కల కల లాడే పండుగ పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: వసంత కుమారి, పి.లీల, జిక్కి, ఎ.పి.కోమలి, రత్నమాల

కల కల లాడే పండుగ నేడీ
బిక, బిర రారండి మా పాపను చూడండి 
ఆనందముతో అనురాగముతో
మీ దీవెనలివ్వండీ!

శౌర్యము చెలువార !
యిదే మా ఆశలు తీర,
జనియించినదంట, మనయింట
ఝాన్సీ రాణీ!
ఆనందముతో, అనురాగముతో
మీ దీవెనలివ్వండి 

మాంచాలకు సాటీ కాదీ 
మరపించును, రుద్రమ దేవి
కాదే చెలియా 
నాగమ్మనుమించే నాయకి ఔ నే

ఆనందముతో, అనురాగముతో
మీ దీవెనలివ్వండీ
భారతసతి కీర్తి

యిదే మా మంగళమూర్తి
ఉదయించిన తార
ధృవతార, కస్తురిగాంధీ
ఆనందముతో, అనురాగముతో
మీ దీవెనలివ్వండి 

కన్నానమ్మనిన్ను, కానీ, దూరమైతి 
దీవించేటి భాగ్యం లేనీ తల్లి నైతి 
నూరేళ్లు చల్లగానూ మనవమ్మా కీర్తితో  
యిదే నీతల్లి ఆశ, యిదే నాదీవెనా 
ఆనందముతో అనురాగముతో
మీ దీవెనలివ్వండి





చిట్టితల్లి నవ్వవే పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: 

చిట్టితల్లి నవ్వవే, చిన్నారిపాపవే 
కన్నతల్లి చూడవే కన్నీరుమానవే 
నీ తోడునీడగా, నిలుచున్న తల్లినే
ఒకసారి నన్ను అమ్మాఅని పిలువరాదట 
నీ వేసంపదలన్నీ చిన్నా
నినుచూచినే వున్నా
కులవాలిపాప వైనా
సుఖదోలి తూగినా
మరిచేవో  నన్నుతల్లి 
నాపాలి జాబిలి
ఒకసారి నన్ను రమ్మని 
పిలువరాదటే 

లేరే నాయను వారు నాకు
బ్రతికేను నీ కొరకు
నిరు పేద దాసినైనా నినుధారపోసినా
కని పెంచే తల్లి నమ్మా 
నాపాలి భాగ్యమా
ఒకసారినన్ను అమ్మా అని 
పిలువరాదుటే




ఏడువకచ్మూ, ఏడువకు పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: 

ఏడువకచ్మూ, ఏడువకు 
ఏడుపులన్నీ పేదలకు 
ఏడువకమ్మా ఏడువకు
ఏడుపులన్నీ పేదలకు జో! జో! జో! 
నీ పుట్టుక చిరునవ్వులకు 
ఏడ్చేవారిని నవ్వించుటకు 

సిరిసంపదలుకలవు నీకు
కొరతలన్నవి లేనే లేవు, వూ 
కాన లెనంటే జాబిలి అయినా

రావలెనమ్మా నీతో ఆటకు 
ఏడువకమ్మా జో జో జో




తీరి పోయింది పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: 

తీరి పోయింది. కన్న పిల్లలకు చేకొన్న మగనికి
దూరమై భారమై నా బ్రతుకె తీరిపోయింది
ఓ... కాలానికేల యీపగ కసితీరదాయెగా
కన్నీరుతీరె కష్టాలుమీరె కడసారి ఆశే నశించే
ఓ...! కాలాని...

పతికేను పాపినైతి గతిలేని దాననైతి 
తుది లేని శోకమాయె బ్రతుకంత చీకటాయె 
నా కింక చావుమేలు బలి తీసుకో విధీ
ఓ... ఓ... కాలాని...... 




సల్లంగ సుక్కాని తిప్పరా పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: 

సల్లంగ సుక్కాని తిప్పరా అయిలెసా 
మెలంగ యీ యేకు దాటరా అయి లెసా
సామికి మొక్కరా
సాపలు దింపరా
ఆపదలన్ని ఆపునులే రావోయ్ 

పడవా నడుపుచూ పదమూ పాడుచూ 
పదమూ పాడుచూ
మాపటి వేళకూ మనూరుసేరాలి

అటుచూడర చక్కనిమావా 
భయ మేలరా మబ్బుల ధీమా!
ఆగిపోదమా ! సాగిపోదనూ!
యిల్లు చేర లేమా!

మనసిచ్చిన మామయ ప్రక్క 
భయమేటికి చక్కని చుక్క
ఆగిపోము లే సాగిపోదమే
యిల్లు చేదామె

గాలిలోన గాలు లేవో రేగినయి అయి లెసా 
ఏటిపోటు ఎదురెత్తి పొంగింది అయిలెసా 
చీలికలై తెరచాప చిరిగింది అయిలెసా 
అడలెత్తి ఆకాశం అరిచింది అయి లెసా 
అయిలేశ రయి లేశ రయిలేశా



కొత్త కాపురము నేడు నా మొగుడు పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: 

కొత్త కాపురము నేడు నా మొగుడు 
మెత్తనైపోయాడు–మెత్తనైపోయాడు 
జిత్తులమారి నా అత్తయ్య పేరెత్తితిడుతుంది. 
ఏమండోయి మిమ్మల్నే ఎక్కడున్నారండి 
ఇడ్డీన్లూ చేశాను ఇవి తినండి
వంట్లో బాగులేదు. వద్దుర కొడకా 
ఇడ్డీన్లోద్దర కొడకా
పూరీలు చేశాను రారా తినిపోరా

ఆలిమాట వింటేను అమ్మకోటి తంటా 
అమ్మమాట వింటేను ఆలి కొల్లు మంట 
ఇద్దరిమధ్య నే చేస్తున్నా నింటా
అమ్మొద్దు అయ్యయొ ఆలొద్దు అయ్యయో 
అమ్మొద్దు ఆలొద్దు గమ్మునూరుకుంటా 

ఆలిమాట వినకురా! యిడ్డెన్లు తినకురా! 
అమ్మమాట వినకండి పూరీలు తినకండి 
నా కొడు కే నువ్వెనతపు
నా మొగుడే నువ్వెవతవు
నా కొడుకే
నా మొగుడే
ఆరుపోరు లెందుకూ యీ అల్లరంతా ఎందుకు

ఆలుమగల మధ్యా నింక అమ్మా  నువ్వెందుకే
ఖర్చులన్ని యిస్తాము కాశీపోరాదా నువ్వు కాశీపోరాదా !
తల్లిమాట చేదాయె పెళ్ళామె బెల్లమాయె 
కొడుగుని విడిచుండలేను కోడలుండనివ్వదు 
సమాధాన పడకపోతే సాగదునాయాట 

మూట యిదిగొ ముల్లె యిదిగో 
కాశీ దయచెయ్యత్తయ్యా-కాశీదయ చెయ్ 
మనుమణ్ణి చూడాలని మనసాయె కొడలా 
కన్నార చూసిపోతా కనవే ఓ కొడుకుని
అత్తయ్యా యిదిగొ మీ మనుమని చూడండి. 
యిపుడైనా దయచేసి కాశీ వెళ్లండి

పిల్లాడి ఆటపాట-కళ్లారా చూసిపోతా 
మళ్లీ నే రానుకదా ! మాటవినవె కోడలా 
నా మాటవినవే కోడలా ! 
మనుమడింత వాడాయె మనసుతీరదాయె
కాశీకి పొమ్మంటే కదలవేమి అత్తయ్య ! 
ఇన్నాళ్లు వున్నా నింక కొన్నాళ్లె కాదటే. 
పిల్లవాడి పెళ్లి చూసి వెళ్లిపోతా కోడలా! 
పిల్లవాడి పెండ్లాయె వెళ్లిపోరాదా 
మళ్లీ మాటాడితే మర్యాద దక్కదింక 
అత్త వయ్యావు నువు కూడ అరుపులెందు కాగవె 
కలసి పోదాం నువునేను కాశీలో కైలాసమో !

అత్తకూడ ఒకనాడు అత్తింటి కోడలే 
కోడలు తానొకనాటికి అత్తకాకమానదు 
అత్తకోడళ్ల మధ్య ఆరు పోరులు ఎందుకు
ఒకరినొకరు గౌరవించి ఒదిగుంటే పదివేలు
పది వేలు పది వేలు కలసి యిరవై వేలు




సున్న సున్న కూడుకున్న సున్నేరా పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: 

సున్న సున్న కూడుకున్న సున్నేరా 
జంగం జంగం రాసుకున్నా బూడిదరా 
సత్రం నిత్యంరా నీ జోలే భద్రం రా! 
మిల్లుగుడ్డకు రంగుమార్చరా 
పిడక బూద్దికి పేరు మార్చరా
రంగూ పేరు వేరైనా రంగడు ఒకడే
జై సద్గురుడా 

వర్షం కురిస్తే జపాలు చేస్తాం
పంటలు పండే తపాలు చేస్తాం 
చదువు లేలరా మోక్ష పదవియే 
శాశ్వతమైంది జై సద్గురుడా 

పెడితే తింటాం
తిడితే వింటాం
అభిమానాలు ఆత్మకు లేవు
అపాయము లేని తుపాకిములకు
సత్యాగ్రహమే జైసద్గురుడా




వయసు సొగసు యువరాణీ పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: 

వయసు సొగసు యువరాణీ
నీ వలపు నేను దొరరాణీ
జగాన లేని సరదాల న్నీ నీ వేజవ్వని
పూచిన పువ్వు నీ చిరునగవు పులకరించనీ
నీ దాచిన సొగసు దోచే రాజు మోజే తీరనీ
నీ కల కౌగిలిలో
రోజో మారని 

కమ్మనైన కలలుగాంచే
వయసే నీడనీ
అనురాగం పొంగి పొరలే
లేతమనసే పాడనీ
తన గాధలనే తెలుపనీ
నీకధ నిజమే కానీ
తీయని భావనగా బ్రతుకే మారనీ
మాటలన్నీ పాటలు కానీ మరులే తీరని
వెలలేని వలపులోనీ
లోతులేవో తేలనీ
నవజీవనమె కలుగనీ
పున్నమ వెన్నెల రాణీ
నో చినదానవులే ఓహో రాగిణి
శివయసు సొగసు 




నా చిన్నారిబావా వెన్నెల మావా పాట సాహిత్యం

 
చిత్రం: దాసి (1952)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామాన్, సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: 

నా చిన్నారి బావా వెన్నెల మావా ఎన్నాళ్ళకోయ్ బావా!
ఈనాడేకదా పండుగ !
యిద్దరు జంటగ వుండగా
నా చిన్నారి

ఓ...అందాల రేరాణి విరబూచెలే
ఎన్నో కలలతో
అన్ని కళలతో
నిన్నే వలచెలే
ఎదను తెరచి దోచుకో గుండెలో దాచుకో

॥నా చిన్నారి॥

ఓ....
ఆనంద రాగాలు వినిపించెలే
ఒల్లే పులకలై
కళ్లే వెలుగులై
నిన్నే పిలిచెలే
బదులుపలికి పాడుకో హాయిగా ఆడుకో

॥నా చిన్నారి॥

No comments

Most Recent

Default