Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Deepavali (1960)




చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల, మాధవపెద్ది సత్యం, రాఘవులు, పి.సుశీల, జమునారాణి, ఎ.పి. కోమల, ఎస్ వరలక్ష్మి
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి
దర్శకత్వం: ఎస్.రజనీకాంత్
నిర్మాత: కె.గోపాల రావు
విడుదల తేది: 28.09.1960



Songs List:



సరసిజాక్ష పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల, సత్యం, కోమల & పార్టీ

ఋషులు: 
సరసిజాక్ష నీయానతిలేనిదె జరుగదుగద ఏదేనియు జగమున ॥ సరసి॥
హిరణ్యాక్షు బాధలతో బ్రదుకే బరువాయెను కరుణగొనుమ మాపయి ॥ సరసి॥

విష్ణు:
పడసేరు మునులార మీవాంఛితముల
కడతేరు రాకాసి అచిరకాలమున
వారాహమూర్తినై అవతరించేను
దురితు హిరణ్యాక్షు సంహరించేను

ఋషులు : 
నమో నారాయణాయ ! నమో నారాయణాయ!

హిరణ్యాక్షుడు : 
ఎదురులేని నెర జోదును నేనే
నన్నెదురులేక హరి యంతటివాడే - బెదరీ బేలై పోయెనూ
హిరణ్యాకు ధాటికి బెదరీ బేలై పోయెనూ
వెలుగ దలపడు మహా తేజుడై రవి దివిని వెరపున
ప్రళయ సమయ పవమానుడు గానీ
వీచేను లోకమున మెల్లగ చల్లగ ఎదురులేదు లేది కా
హిరణ్యాకు ధాటికి ఎదురూ లేదూ లేదికా !

భూదేవి : 
కదలే భూదేవీ హరి నా
గారాలు మీ రాకదలే భూదేవీ హరిగనా గారాలు
పెదవులపై చిరునగవు చెలంగగా

హిరణ్యాక్షుడు : 
నిలువుమా ఓ లలనా నిలువుమా
చెలువుమీూర దరికిజేరి నా వలపులు దీరుపుమా

భూదేవి : నిలువరా ఓ చెనటీ నిలువరా
నిఖిలలోక నాధుడైన శ్రీ హరిసతి గోరకురా

హిరణ్యాక్షుడు : అఖిల చరాచరములకు ఆధీశుడనూ నేనె చెలీ
భూదేవి : కాదుర వైకుంఠ నాధు కోపము పాల్గకుము రా
హిరణ్యాక్షుడు: వదలను వైకుంఠుడెదిరి నిల్చిన పోనీను నిన్ను 
నిలువమా ఓ లలనా
భూదేవి : నిలువరా ఓ చెనటీ!

భూదేవి : విరాళీ సైపలేనురా అయ్యో - ఈ విరాళీ సైపలేనురా
నిరాళీ సైపలేనురా జాలీ పరాకు దయాపూనవేరా
పూలముల్కులకు తాళగ లేదా అలుకమాని ఏలుకోరా సామి
విరాళి సైపలేనురా—అయ్యయ్యో ఈ విరా? సైపలేనురా 




దాయాదులైన మా దనుజ పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: మాధవపెద్ది సత్యం

దాయాదులైన మా దనుజ వీరుల వైభ
వము కొల్లగొట్టి రాపాడినావు
జలధి మధింప రాక్షసకోటి శ్రమ పెట్టి
ఆదుకొన్నావు నీవమృతకలశము
ఆచ్చర పూబోండ్ల వెచ్చని కౌగిళ్ల
ముచ్చట దీరగా మురిసి నావు

ముల్లోకముల నేనె మొనగాడనని తెల్ల
యేనుగు నెక్కి యూరేగినావు
దేవతల వంతు నేటితో తీరిపోయె
చెల్లదగునింక దానవశ్రేణివంతు
అసుర సామ్రాట్టు ఈ నరకాసురుండు
అరుగుదెంచును నిలువుమా ఆమరనాధ!




మహాదేవ దేవా పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఎస్ వరలక్ష్మి

మహాదేవ దేవా మహీయ ప్రభావా
మమూ దీన జీవుల కావగ రావా.
చిన్నారి తమ్ముడు బలియైపోయే - కన్నతండ్రి కడగండ్లు పాలాయే
నాయను వారే లేరాయే - దరి జేరినానుర దారి జూపరా

ఉలకవు పలుకవు యిది యేలా
నా పిలుపులు వినరావా
ధ్యానములో దీనుల మరచేవా - శరణని వేడిన కరగెడు నీ మది
కరుణయె మరగై పోయినదా - నీ శరణాగత రక్షా బిరుదము
మానవ వంచన కేనా - నీపద సేవలు వృధయేనా
ధారుణి ధర్మము తొలగేనా - లోకము చీకటి మూసేనా
నా జీవిత మిక యింతేనా




యదుమౌళీ ప్రియ సతి నేనే పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: పి.సుశీల, ఘంటసాల, కోమల

యదుమౌళీ ప్రియ సతి నేనే
నా గీటు దాటి చనజాలడుగా
లేదు భూమిని నాసాటి భామా
అంద చందాలు నీ వేనులే భామా
నీ హృదయేశ్వరి నేనేగా

హే ప్రభూ ! నీ సేవయె చాలును నాకు హే ప్రభూ !
చనువు మీర నీ సన్నిధిచేరీ - మనసుదీర నీ పూజలు చేసే
మురిసెడి వరము నా కొసగుము సామీ
సోగ కన్నుల నవ్వారబోసీ
పలుకు పంతాల బందీనిజేసి
కోరిక తీరగ ఏలేగా
హే ప్రభూ 




పోనీవోయ్ తాతా పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: రాఘవులు, ఎ.పి. కోమల

పోనీవోయ్ తాతా - నన్ను పోనీవోయ్ తాతా
ఓ మూడు కాళ్ల ముసలీ తాతా - పోనీవోయ్ తాతా
ఏమన్నావ్ ? తాతనంటావా నన్ను తాతనంటావా
ఉప్పొంగిన నా దండలు చూడు - దండలు నిండిన కండలు చూడు
గండర గండడు దండనాధుడు - ఈ దండయ్య నేనువు తాతంటావా తానంటావా ?

నేను చూశానోయ్ తాతా - జారీపోయిన చప్పిడి దవడలు
కూరుకుపోయిన చీకిరి కన్నులు - గడగడలాడె బడుగు దేహము
ఉడిగిపోని నీ ముసలి కోరికలు - చూశానోయ్ తాత
ఛెంగు చెంగునా నింగికి యెగిరి - ఖంగు ఖంగునా క్రిందికి దూకి
కరకరలాడె కోరిక తీర చెరుకు కర్రలా నమిలేస్తానే
తాతనంటవా యింకా తాత నంటావా ?




ఆగ్ని సాక్షిగ వివాహమ్మైన పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఎస్. వరలక్ష్మి.

వసుమతి 

ఆగ్ని సాక్షిగ వివాహమ్మైన పురుషుడే
తరుణులకిహపర దైవమయ్య
పతి అధర్మకుడైన, బంధు హంతకుడైన
పడతికి భర్తయే ప్రాణమయ్య
పతి కెగ్గు తలచిన సతి కధోగతి యని
భారత ధర్మముల్ పలుకునయ్య
నాధుని కెడమైన నాతికీలోక మె
నరకమ్ము, సర్వశూన్యము గదయ్య
ఆల్లుని వధించ గోరుట అన్యాయమయ్య
కోరి కూతురి గొంతుక కోయకయ్య
ధర్మపధమును దప్పించ దలచకయ్య
ఇష్టమగునేని నన్నేవధించవయ్య!




అలుకా మానవయా పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల

అలుకా మానవయా జాలీ పూనవయా
నరకాధీశ్వర త్రిలోక జీవ పాలా
మృతికీ భీతిలనీ భుజబలసారమూ
అదితీ కుండలముల దోచుకొనే బీరమూ
కలిగెను నీకే జగతీ భళా భళీ




హాయీ హాయీ అందాల రాజా పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఎస్. వరలక్ష్మి.

హాయీ హాయీ అందాల రాజా
వెయ్యేళ్లు వర్ధిల్లు మాచిన్ని రాజా

సత్యాన శీలాన శౌర్యాలలోనా - వీసాటి మారాజు నీవేనటంచు 
నీ నీతీ..... నీ ఖ్యాతి

త్రిభువునాలావినుతి సేయా - వర్ధిల్లు చిన్నారి పొన్నారిరాజా 
నీ తండ్రి కంటీ పాప నీవే - తాతయ్య యింటీ దీపమీవే
చెరసాలలోనా కుమిలేటి తాతా
వెత బాపు భారము నీదే నాన్నా



కరుణా జూడవయా పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల 

కరుణా జూడవయా వరమూ జూపవయా.
మురళీ మోహన వినీల మేఘ శ్యామా
మనసూ నీపయి నా మరలిన చాలుగా
పులులే జింకలయీ లెంకలుగా మారుగా
నిరుపమలీలా నిలయా దయామయా
మదిలో నీస్మరణా సలిపిన హాయిగా
బ్రదుకే తీయనయై వెన్నెల కాయుగా
త్రిభువున పావన చరణా సనాతనా





దేవజాతికి ప్రియము సాధించగోరి పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: మాధవపెద్ది సత్యం

దేవజాతికి ప్రియము సాధించగోరి
దానవ కులమ్ములోన భేదములు పెట్టి
కృష్ణ దాసుల జేయ నుంకించినావె
నారదా ! కృష్ణ దాసుల జేయ నుంకించినావె
నారదా ! చూడు నా ప్రతీకార గరిమ!




అమరాధిపత్యమ్ము ఆపద కొరకాయె పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల

అమరాధిపత్యమ్ము ఆపద కొరకాయె
మునిజనమ్ముల గొంతుమూగవోయె
లోకమ్మునను కారుచీకటి తెరలాయె
ధర్మమ్ము దిక్కరి తరలి పోయె
తన మేలె వాంఛించు తరుణికి చెరలాయె
కొమరుడు అమ్మా అమ్మా యని కుములుటాయె
కన్నెల చెలువమ్ము కన్నీటి చెరువాయె
బాధకే భువి పైన ప్రదుకుటాయె
ఇంత యేటికి ఆ పాపికి హితవు చెప్పి
ప్రాణములతో బయల్పడి పరుగు పెట్టి
శరణు జొచ్చితి నేను నీ చరణ యుగళి
ఎన్నని వచింతునయ్య ఆపన్న శరణ!




మాదె కదా భాగ్యమూ పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల, పి.సుశీల, ఎ.పి.కోమలి

గ్రూప్ : మాదె కదా భాగ్యమూ సౌభాగ్యమూ
చరితార్ధమాయె మాకులము, గోకులము మాధవా 
చిలిపి చేతలను విడలేవా దేవా
పూతన సంహార నవనీత చోరా

కనుల మిమ్ము గన మన సొనే బాలా

గ్రూప్ : తగదూ నీ కిదీ దరి రాకో స్వామి!
గ్రూప్ : చెలువల రాగమూ పువుల సరాగమూ - పెనుగొని వెలసెను జల కేళీ
పులకరించే - మనసులోనా పువులు పూయు - మృదు భావాలూ
గ్రూప్ : సొగసులాడీ కనులలోనా చిగురు వేయు సుఖ భోగాలూ
గ్రూప్ : పలక బారీ వలపు వానై చిలికి హాయీ నించెనుగా

భజన : 
కావగ రారా గోవిందా ముకుందా
సేవలు గొనుమా జలద నీలశ్యామా
పూతన సంహార నవనీత చోరా కంస విదారా యశోదా కుమారా
దానవ వైరీ దివిజలాభ కారీ - శ్రీతజన శుభకర వేణుగానలోలా 




ఓరిమి గొనుమా ఓ రాజ శేఖర పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: జమునారాణి

ఓరిమి గొనుమా ఓ రాజ శేఖర 
కూరిమి తీరక పోయేన పోనౌన 
సురపతి గెలిచిన జోదువు గావా
మరుశరముల కిటు సాగిసేవు మేలా

మురిపెము దీరును లేరా రారా రాజా
గారాల చెలిపయి నేరాలు మేరా
మారాలు సలుపకు నామాటవినరా.
అలపులు సొలపులు నే గానాలేనా
వలపుల మెళుకువ ఎరిగిన దానా
దరియగ రాదు ఈ వేళా నీపై ఆనా




దీనుల పాలీ దైవ మందురే పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల

దీనుల పాలీ దైవ మందురే 
మౌనము నీకేల ఓదేవా
నరుల చెరలకు అంతము లేదా
నరకుని పాపము పండగ లేదా
కరుణకు తరుణము రాలేదా 
శరణాగత పాల హే గోపాలా



ఓ దేవ కనలేవా మొర వినవా పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల

ఓ దేవ కనలేవా మొర వినవా  
పరీక్షింతు వేలా నీవారలా
నిరోధించ వేలా నీ వేరులా 
కొర గానీ సుతుపైన భ్రమ చాలురా
పరంధామా ఇక నైన మము బ్రోవరా 
మహిమాని పోయే నీ న్యాయమే
మహా నేరమాయే నిధ్యానమే 
నరకుని చెరలోన మన లేమురా
నరజాతి సొద మాప దయ సేయరా





పాలు త్రాగు నెపాన పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: మాధవపెద్ది సత్యం

పాలు త్రాగు నెపాన ప్ర్రాణమ్ములను లాగి
తునుమగా ముసలి పూతనను కాను
కడకాల తన్ని ముక్కలు ముక్కలొనరించి
మడియింప శకటాసురడను గాను
తలపైన లఘించి తాండవమ్మొనరించి
పరిభవించగ నీటి పామును గాను
నీ గారడీల నిలువు నీరయి పోయి
పడి పోవ పిరికి కంసుడను గాను
ఘన తపో బలతర్పిత కాల కాల 
వర దయాలబ్ధ దుర్జయ బాహుబలుడ!
అమర జీవిని దనుజ లోకాధినాధు 
నరక సామ్రాట్టు గెలువ నీతరమె తులువ!




నరకుని రక్షింప పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల

నరకుని రక్షింప పరివార సహితుడై
నిటలాక్షుడే వచ్చి నిలచు గాక
అతని యానతని కాదనలేక సురలెల్ల
శివుని వెన్నంటి వచ్చెదరు గాక
గ్రహములు భయమున గతులు దప్పును గాక
పంచ భూతము లుజ్జృంభించు గాక
భూదేవి యే వచ్చి పుత్రభిక్షాం దేహి
యంచు చే సాచి అర్థించుగాక
సత్య ధర్మాలు తప్పని జనుల కతడు - సలిపిన పరాభవమ్ములు సమసి పోవ
నరకుని శిరంబు భూమి పై బొరల జేతు - ధర్మ సంస్థాపనము జేతు ధరణిలోన.



సరియా మాతో సమరాన పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఎ. పి. కోమల

సరియా మాతో సమరాన నిలువగలడా
పెదవులా వలపు సింగార మొలకా
కన్నుకొనల కోపానల మెలయా - యదుపతీ మురియ నరకుడూ వెరవ
చలము, బలము చూపేగా

దురమునా ప్రబల దానవకోటీ - పరువు మాపి యిల గూల్చిన మేటీ
నరహరీ యెదుర నరకుని తరము దురుసు పలుకు లాడేనా
కన్నెలూ మదిని సమ్మోద పడగా - దనుజలోకమూ కంపిలి పోవా
ధనువుగొనీ మనోహరునీ - సరసనా నిలచి నరకుని గెలిచి
బిరుదు గొనక మానేనా




జయవిజయీభవ గోపాలా పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: పి.సుశీల & కోరస్

సోలో: జయవిజయీభవ గోపాలా ప్రతి - వీర భయంకర బాహుబలా 
జీవకోటి నీ కల్పన జేసీ – స్వేచ్ఛగావ జన్మించిన దేవా
శాంతి దూతవై ముందు సాగుమా - విజయుడవై రమ్మా

కోరస్: జయవిజయీభవ గోపాలా ప్రతి - వీర భయంకర బాహుబలా
సోలో: సమర కేళిలో ప్రణయ లీలలో సాటిలేని యీ శౌర్య విధానా
తోడు నీడగా - కూడి మాడగా - విజయుడవై రమ్మా

కోరస్: జయ విజయీభవ గోపాలా ప్రతి - వీర భయంకర బాహుబలా
మేల్ కోరస్: జయ జయ జయ జయ
జయ జయ జయ జయహో 

వరకుడు: రణాంగణమున నన్నెదిరించే - ధనుర్ధరుండీ జగమున లేడూ 
నరులా యెదిరీ గెలిచేవారూ - త్రిభువన - విభుడనూ - నేనేగా

కోరస్ : జయహో! జయహో!
నరకుడు: గిరి హరి రానీ మురహరి రానీ
పెరగ బోనూ విడువగ బోనూ
బరిలో దుమికి పొగరడగింతూ - నరకుని బిరుదమ చూపింతు
జయ జయహో! జయహో!




కంస భీతిని తండ్రి పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: మాధవపెద్ది సత్యం

కంస భీతిని తండ్రి కాల్వట్టి అర్ధించి
కులగోత్ర గౌరవమ్ములు గంగ పాల్జేసి
పలు వేసములు వేయు వంచకుండ
సంగరమ్మున జరాసంధున కోడి సాగరములో
దాగిన పిరికి పంద
వీరసింహు నెదిర్చి పోరాడ వెరగంది
నిరుపమాన భుజాబలనిర్జితామ
దానవేంద్రుని వెరపింప తరమె నీకు

ఆడు సాయము తెచ్చుకొన్నట్టి అనద
రేంద్ర గర్వాంధ తిమిర దినేంద్ర నరక
విక్రమించుము వీరుడ వేని తులువ



నే నే శ్రీహరి పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: పి.సుశీల 

నే నే శ్రీహరి పాద పద్మ భజనానిష్ఠా గరిష్ఠాత్మ నౌ
దేనిన్, కాళి సమాన భారత సతీ దివ్య ప్రతాపంబు నా
లోనన్ వెల్గున యేని సర్వ వనితాలోకంబు మోదింప యీ
బాణోగ్రాహతి గూలుగాత నరక వాత్యుండు భూమి స్తలిన్.




సురలను గొట్టువాడు పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల

సురలను గొట్టువాడు, సురలను కొట్టునాడు అదితి సుందర కుండలముల్
హరించి అచ్చరలను బట్టునాడు చెరసాలల మౌనుల నెట్టినాడు 
ఏమయింది నీ ధర్మం
మా పురమున దూరి కన్నెలను మ్రచ్చిలి నా పయి బెట్టువాడు నీ
వెరుగవు ధర్మమన్న పదమే నీవెరుగవు ధర్మమన్న పదమే కనిపించెన
నేడు నీచుడా!



వచ్చింది నేడూ దీపావళీ పాట సాహిత్యం

 
చిత్రం: దీపావళి (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: ఘంటసాల, పి.సుశీల & పార్టీ

వచ్చింది నేడూ దీపావళీ పరమానంద మంగళ శోభావళీ
హరియనుమతిగా నరకుని స్మృతిగా ఆయె ఈ నాడు దీపావళీ
వచ్చింది నేడూ దీపావళీ పరమానంద మంగళ శోభావళీ

No comments

Most Recent

Default