చిత్రం: ఈడు జోడు (1963) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు నటీనటులు: కొంగర జగ్గయ్య, కాంచన, మణిమాల నిర్మాత, దర్శకత్వం: కె.బి.తిలక్ విడుదల తేది: 17.05.1963
Songs List:
ఇదేమి లాహిరి పాట సాహిత్యం
చిత్రం: ఈడు జోడు (1963) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల, ఘంటసాల ఇదేమి లాహిరి ఇదేమి గారడి ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి ఇదేమి లాహిరి ఇదేమి గారడి ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి ఇదేమి లాహిరి కోరుకున్న చిన్న దాని నవ్వు కోటి కోటి పరిమళాల పువ్వు చిన్ననాటి సన్నజాజి చెలిమి కన్నులందు దాచుకున్న కలిమి ఆనాటి కూరిమి చలువలోన వేడిమి అనురాగపు మేలిమి ఇదేమి లాహిరి ఇదేమి గారడి ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి ఇదేమి లాహిరి రామచిలుక ప్రేమమాట పలికి రాజహంసలాగ నడిచి కులికే గోరువంక చిలుక చెంతవాలె కొసరి కొసరి కన్నెమనసు నేలె కాబోయే శ్రీమతి మది నీకే బహుమతి అది ఆరని హారతి ఇదేమి లాహిరి ఇదేమి గారడి ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి
చిరుగాలి వంటిది పాట సాహిత్యం
చిత్రం: ఈడు జోడు (1963) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి.సుశీల చిరుగాలి వంటిది ఆరుదైన చిన్నది చెలగాటమాడి కనరాకదాగి కదలాడుచున్నది ॥చిరు॥ పూలకన్న సుకుమారపు మదిలో జ్వాలలు దాచిన కోమలి వేచిన ప్రియులకు వివరహపు కానుక ఇచ్చే వెచ్చని జాబిలి చిరు వేడిన కొలది వేధన పెంచే అడనైజము వీడనిది వియోగ గీతిక వినోదమనుకొని వీనుల విందుగ కోరునది ఆశ పెట్టి తానందీ అందక - బాసలు తీర్చని భామిని ఆలాహలము అమృతరసము - అందించేనవ మోహిని
పంచరు పంచరు పాట సాహిత్యం
చిత్రం: ఈడు జోడు (1963) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: పి.బి.శ్రీనివాస్ & పార్టీ పంచరు పంచరు పంచరు పంచరు తలకోన మోస్తరు పంచమందున ప్రతి విషయం పంచరగుట గమనించరు పంచరు పంచరు పంచరు పంచరు తలకోన మోస్తరు బస్సు తీసుకెళ్లే అబ్బాయిగారు బలాదూరుగా తిరిగితే పల్లె పట్టున తల్లిదండ్రులు బంగారు కలలే పంచరు ఆడపిల్లలకు ప్రేమలేఖలు అందించును నవ యువకుడు పెద్దవాళ్లకు రిపోర్ట్ ఇస్తే ప్రేమా గీమా పంచరు ప్రజల మేలుకై పన్నుల పెంచి ప్లానులు వేయును ప్రభుత్వం కాంట్రాక్టర్ల కైంకర్యంచే కమ్మని ప్లానులు పంచరు ఎన్నికలందున ఎన్నో చెప్పి నిలిచిన గెలిచిన మెంబరు రాజధాని లో మోజులు మరిగితే ప్రజా జీవితం పంచరు అడుగడుగునా రిపేరొచ్చిన ఆగదు మానవ జీవితం ఆశ్యాలకల మంచి మనస్సు అవనే అవదు పంచరు
విష్ణు పాదము పాట సాహిత్యం
చిత్రం: ఈడు జోడు (1963) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: మాధవపెద్ది రమేష్ & పార్టీ విష్ణు పాదము మేము విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వెర్రిగ తీర్థాలు చుట్టను ఖలుల విత్తము కొంగున గట్టము పాపఖర్ముల గడప మెట్టము పతిక పావనుడే మాకు చుట్టము గోపబాలుని భజనె దిట్టము యముని గొడవెందు కిది వేరే ఘట్టము రక్షించమని రవ్వ సేతుము ఎదుట రాకుంటే ఒక చెయ్యి చూతుము పక్షివాహన యని కూతుము మారు బలకకుంటె - సిగ్గుదీతుము తత్త తరి కిటకక తక్క ధిక్కు తకఝణుత దిగిత తద్దితరికిట - తకతళాంగుతక ధిత్తోంతా ధిగ్తోం... తా-ధీ-గీ-ణా తోం-తా... తధిగిణతోం - తధిగణతోం...
సూర్యుని చుట్టు పాట సాహిత్యం
చిత్రం: ఈడు జోడు (1963) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: వసంత, పి.బి.శ్రీనివాస్ సూర్యుని చుట్టు తిరుగుతుంది భూగోళం ఈ సుందరి చుట్టూ తిరుగుతుంది నా హృదయం ఏయ్ తనలో తానే తిరుగుతుంది భూగోళం తలలో తిరగను ఏదో తెలియని గందరగోళం యవ్వనమందున ఎవరైనా కమ్మని కలలే కంటారు ఆఁ.... కన్న కలలే ఫలించక పోతే కలవరపడతారు ఆలయమైనది నీ హృదయం అంకితమైనది నా రూపం ఆలయాన అడుగడు హక్కు లేదు నీకు పాపం కోరిన కోరిక తీరనిచో ధారున ప్రాణము పోయెను అయ్యో.. పెద్దవాళ్లు ప్రాణం పోయని పిండి బొమ్మను నేను
చిరుగాలి వంటిది పాట సాహిత్యం
చిత్రం: ఈడు జోడు (1963) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల చిరుగాలి వంటిది అరుదైన చిన్నది చెలగాటమాడి కనరాకదాగి కదలాడుచున్నది పూలకన్న సుకుమారపు మదిలో జ్వాలలు దాచిన కోమలి వేచిన ప్రియునకు విరహపు కానుక ఇచ్చే వెచ్చని జాబిలి ఆశ పెట్టి తానందీ అందక - బాసలు తీర్చని భామినీ హాలాహలము అమృతరసము అందించే నవమోహిని
లావొక్కింతయు లేదు పాట సాహిత్యం
చిత్రం: ఈడు జోడు (1963) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల లావొక్కింతయు లేదు
No comments
Post a Comment