చిత్రం: ఏవండీ పెళ్లి చేసుకోండి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: సుమన్, రమ్యకృష్ణ, వినీత్, రాశి
దర్శకత్వం: శరత్
నిర్మాత: ఎమ్.వి. లక్ష్మి
విడుదల తేది: 14.01.1997
పల్లవి:
అమృతం కురిసిన రాత్రి
అతనితో కలిసిన రాత్రి
వలపులా వరదలో తడిసిపోనీ ప్రియా
సందెలో చలి సావిత్రి
సందెకే రస గాయత్రి
మురళిలా పెదవితో కలిసిపోనీ ప్రియా
అస్టపది అందాలందుకో ఓ..
ఇష్టపడి ఈలే వేసుకో ఓ...
కోరస్:
గుచ్చకు గుచ్ఛకు గుమ్ముగా కసి తుమ్మెద అధరాలుగారి అందమంత మరిగిన లేతసోకు పూతరేకు రసనల ఆకతాయి తాకిడీల తపనలతో
అమృతం కురిసిన రాత్రి
అతనితో కలిసిన రాత్రి
వలపులా వరదలో తడిసిపోనీ ప్రియా
చరణం: 1
కసి కసి వయసుల పసి మనసుల వలపిసిరిన వరసలలో
పెదవులు కలిపిన వలపుల తినుమని పిలుపుల చలి చిలకల కలలో
రెప్పచాటు చుపులెన్నడో
తాను చెప్పలేని బాష లాయలే
కంటిలోని రూపమెన్నడో
కన్నె గుండెలోన దీపమాయెలే
నిన్న మాయలే - నేడు హాయిలే
కొసరి కొసరి జత కోటి కోరికలు మీటి పాడు వేళా
అమృతం కురిసిన రాత్రి
సందెకే రస గాయత్రి
వలపులా వరదలో - తడిసిపోనీ ప్రియా
చరణం: 2
ముగిసిన గతముల ముసిముసి నగవుల విరిసిన మమతలలో
తనువుల బిగువులు కరిగిన తపనలు రగిలిన చెలి అలకల కలలో
నేలమీద వాన వెల్లులే నేను వేసుకున్న రంగవల్లులే
నవ్వులన్ని పూల జల్లులే
పాలు కొంగుకున్న పంట చేనులే
నేను నేవులే - మనకు లేవులే
తెలిసి తెలిసి పెనుగింటి ప్రేమలకు వంతపాడువేళ
అమృతం కురిసిన రాత్రి
అతనితో కలిసిన రాత్రి
వలపులా వరదలో తడిసిపోనీ ప్రియా
సందెలో చలి సావిత్రి
సందెకే రస గాయత్రి
మురళిలా పెదవితో కలిసిపోనీ ప్రియా
అస్టపది అందాలందుకో ఓ...
ఇష్టపడి ఈలే వేసుకో ఓ...
కోరస్:
గుచ్చకు గుచ్ఛకు గుమ్ముగా కసి తుమ్మెద అధరాలుగారి అందమంత మరిగిన లేతసోకు పూతరేకు రసనల ఆకతాయి తాకిడీల తపనలతో
No comments
Post a Comment