చిత్రం: గృహప్రవేశం (1988)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: సుశీల
నటీనటులు: మోహన్ బాబు, జయసుధ
దర్శకత్వం: బి.భాస్కర రావు
నిర్మాత: యడవల్లి విజయేందర్ రెడ్డి
విడుదల తేది: 1988
పల్లవి:
శ్రీసత్యనారాయణుని సేవకు రారమ్మా...
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ..
శ్రీసత్యనారాయణుని సేవకు రారమ్మా...
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా..
నోచిన వారికి నోచిన వరము..
చూసిన వారికి చూసిన ఫలము..
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా..
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ..
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా...
చరణం: 1
స్వామిని పూజించే చేతులె చేతులటా...
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులటా...
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
స్వామిని పూజించే చేతులె చేతులటా...
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులటా...
తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట...
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా..
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ..
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా...
చరణం: 2
ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ
ఆ...ఆ..ఆ..ఆ..ఆ
ఏ వేళైన ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ
ఏ వేళైన ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం
అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం..ఉ...
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా..
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ..
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా...
చరణం: 3
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా...
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా ....
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా..ఆ..
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా...
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ...
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ...
మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మ
కరములు జోడించి శ్రీ చందనమలరించి
మంగళమనరే శ్రీ సుందరముర్తికి వందనమనరమ్మ
****** ****** ******
చిత్రం: గృహప్రవేశం (1988)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: ఏసుదాసు
పల్లవి:
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడిచిరా
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
చరణం: 1
మనసులేని శిలను నేను నువ్వు చూసిన నిన్నలో
మమత తెలిసి మనిషినైతి చల్లని నీ చేతిలో
కన్ను తెరిచిన వేళలో నీకేమి సేవలు చేతును
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
చరణం: 2
మరపు రాదు మాసిపోదు నేను చేసిన ద్రోహము
కలన కూడ మరువనమ్మా నువ్వు చూపిన త్యాగము
ప్రేమ నేర్పిన పెన్నిధి ఆ ప్రేమ నిను దీవించని
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడిచిరా
దారి చూపిన దేవతా ఈ చేయి ఎన్నడు వీడకా
****** ****** ******
చిత్రం: గృహప్రవేశం (1988)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: జలాది రాజా రావు
గానం: ఎస్.పి.బాలు, సుశీల
పల్లవి:
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
చరణం: 1
ఆ కనులు ఇంద్ర నీలాలుగా
ఈ తనువు చంద్రశిఖరాలుగా కదలాడు కల్యాణివే
నా హృదయం మధుర సంగీతమై
కల్యాణ వీణ స్వరగీతమై శ్రుతి చేయు జతగాడివే
ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే
నవయువ కవిరాజువో.. అభినవ శశిరేఖవో
చరణం: 2
నా వయసు వలపు హరివిల్లుగా
నవపారిజాతాల పొదరిల్లుగా రావోయి రవిశేఖరా
తొలి సంధ్య మధుర మందారమే
నీ నుదిటి తిలక సింగారమై నూరేళ్ళు వెలిగించనా
నా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనా...
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
No comments
Post a Comment