చిత్రం: మాయా మశ్చీంద్ర (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి. బాలు, సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, వాణిశ్రీ
దర్శకత్వం: బాబూభాయి మిస్త్రీ
నిర్మాత: పింజలి సుబ్బయ్య
విడుదల తేది: 09.07.1975
పల్లవి:
ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..
ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..
మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ..
ప్రణయ రాగజీవనా...ప్రియా...వసంత మోహనా..
చరణం: 1
ఆ.. ఆ.. ఆ.. ఆ..
మలయ పవన మాలికలు.. చెలియా పలికే ఏమని..
మలయ పవన మాలికలు.. చెలియా పలికే ఏమని..
పొదరింట లేడు..పూవింటి వాడు..
పొదరింట లేడు..పూవింటి వాడు..ఎదురుగా వున్నాడనీ..
ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..
చరణం: 2
లలిత శారద చంద్రికలు..అలలై పాడేను ఏమనీ..
లలిత శారద చంద్రికలు..అలలై పాడేను ఏమనీ..
పదునారు కళలా.. పరువాల సిరులా
పదునారు కళలా.. పరువాల సిరులా
పసిడి బొమ్మవు నీవనీ..
ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..
మదిలో ఏవో సుధలే కురిసే
మధుర మధుర యామినీ..
ప్రణయ రాగజీవనా...ప్రియా...వసంత మోహనా..
No comments
Post a Comment