చిత్రం: నేరము శిక్ష (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు నటీనటులు: కృష్ణ, భారతి, కుమారి, పండరి భాయి దర్శకత్వం: కె.విశ్వనాధ్ నిర్మాత: ఎమ్. బాలయ్య విడుదల తేది: 27.07.1973
Songs List:
One Two One Two పాట సాహిత్యం
చిత్రం: నేరము శిక్ష (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సముద్రాల గానం: యస్.పి.బాలు, ఆనంద్ One two One two One two ఒకరికి తోడుగ ఒకరుంటూ నేడు నిజమంటూ రేపు లేదంటూ ఆడుతూ పాడుతూ సాగిపోతుంటే జీవితమంతా Joy Enjoy హాయ్ - హాయ్ - హాయ్ చరణం: 1 జేబుల్ నిండా డబ్బుంటే జల్సాచేసే దమ్ముంటే మనసుకు నచ్చిన మగువుంటే మనిషికి వేరే స్వర్గం లేదూ జీవితమంతా Joy - Enjoy హాయ్ - హాయ్ - హాయ్ చరణం: 2 బాధ్యతలన్నీ పెదల కొదిలెయ్ దేవా - ఓ దేవా పరీక్ష మాట పంతులు కొదిలెయ్ - దేవా - ఓ దేవా పరువం పోతే మళ్ళీ రాదూ జీవా - ఓ జీవా కరువుతీరా అనుభవించరా జీవా - ఓ జీవా జీవితమంతా Joy - Enjoy హాయ్ - హాయ్ - హాయ్ చరణం: 3 కొత్తసినిమా వచ్చిందంటే - ఫస్టు షోకి చెక్కే సెయ్ అమ్మ నాన్న అడిగారంటే - అలిగి అన్నం మానేసెయ్ ఫీజుకట్టే 'పైకంతో - పిక్ నిక్ పార్టీ పెట్టేసెయ్ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తే - గుడ్ బై చెప్పి వచ్చే సెయ్ జీవితమంతా Joy - Enjoy హాయ్ - హాయ్ - హాయ్
చేసిన పాపం నీది పాట సాహిత్యం
చిత్రం: నేరము శిక్ష (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డి.వి.కృష్ణ శాస్త్రి గానం: యస్.పి.బాలు చరణం: 1 చేసిన పాపం నీది చితికిన బ్రతుకింకొకరిది ఒకరిదా నేరం - వేరొకరికా శిక్ష దిక్కులేని దీన అదిగో రెక్క తెగిన పక్షి అదిగో అక్కడ గూడైనా లేదు ఎక్కడా ఒక తోడు లేదు ఏమిటింత దారుణం దీనికెవ్వరు కారణం ? చరణం: 2 కన్నులా వెలుగారిపోయె ఉన్న ఊత జారిపోయె ఊరులేదు, వాడ లేదు దారి యేదీ కానరాదు ఏమిటింత దారుణం దీనికెవ్వరు కారణం ? చేసిన పాపం నీది చితికిన బ్రతుకింకొకరిది ఒకరిదా నేరం - వేకొకరికా శిక్ష ! చరణం: 3 చేసిన పాపం నీది చితికిన బ్రతుకింకొకరిది ఒకరిదా నేరం-వేరొకరికా శిక్ష ఏమిటింత దారుణం దీనికెవ్వరు కారణం
దాగుడుమూత దండాకోర్ పాట సాహిత్యం
చిత్రం: నేరము శిక్ష (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డి.వి.కృష్ణ శాస్త్రి గానం: యస్.పి.బాలు, భాస్కర్, లత పల్లవి దాగుడుమూత దండాకోర్ చెల్లెమ్మా నీ బావొచ్చాడు భద్రం భద్రం బుల్లెమ్మా ఓ చెల్లెమ్మా సొగసరి బుల్లెమ్మా! ఒహో' చెల్లెమ్మా ! గడసరి బుల్లెమ్మా చరణం: 1 చంద్రుణ్ని అడిగాను సూర్యుడ్ని అడిగాను ఏడని ! నీ వాడేడని ? చుక్కల్ని అడిగాను - దిక్కుల్ని అడిగాను ఏడని ? మా బావేడని ? ఎక్కడా ? చిరునామా ఎక్కడా ? ఎక్కడా చిరునామా చిక్కక చక్కావచ్చాను చివరి నీ మూగమనసే చెపితే విన్నాను ఏమని ? ఇతగాడే నీ జతగాడని చరణం: 2 ఇన్నాళ్ళు నువ్వు నా చెల్లివి మరి ఈనాడో అతని మరుమల్లివి వలచే ప్రియురాలవై కొలిచే యిల్లాలివే మనసిచ్చే నెచ్చెలివై మమతలు పంచు తల్లివై నువ్వు కమ్మగా కాపురం వుండాలి నీ అన్నయ్య దీవనలే పండాలి చరణం: 3 ఏనాడు నీ బొమ్మ చూశానో ఆనాడే నాలోన దాచాను ఆనాటినుండి అనురాగం పండి అను నిమిషం నీకోసం వేచాను చెరిగిపోని తొలివలపే నీదని మచ్చలేని మలెమనసు నీదని తెలిసింది ఓ చెలీ, కలిసింది కౌగిలి కలకాలు ఈ బంధం కళతగని జాబిలి
ఏమండి సారూ పాట సాహిత్యం
చిత్రం: నేరము శిక్ష (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: యస్.పి.బాలు, జానకి ఏమండి సారూ ఓ బట్లర్ దొరగారూ అన్నీ తెలుసని అన్నారు యెన్నో కోతలు కోశారు ఇంతేనా - మీ పనితన మింతేనా అయ్యోయ్యయో అయ్యయయ్యే అయ్యయ్యయో అయ్యయయ్యో అంతటిమాట అనకండి అఖరుదాకా ఆగండి చూడండీ నా పనితనమేదో చూడండి చరణం: 1 బీరా కంద చామా యే కూరైన ఒకటే రుచి ఓ రామా కోడి పులావు కుర్మా తిందామంటే నల్లుల వాసన ఖర్మా ! యెరువులు వేసిన కాయగూరలు ఎవరు వండిన అంతేనమ్మా ! కమ్మని రుచులు కావాలంటే కల్తీలేని శాల్తీలిచ్చి చూడండి నా పనితనమేదో చూడండి ! అయ్యయ్యయో ! అయ్యయయ్యో ! అయ్యయ్యయో ! అయ్యయాయ్యో ! అందాకా ఈ ప్రాణం నిలిచేనా ! చరణం: 2 మనసు మమత మంచి కలిపి దేవుడు వండినవంటే మనిషి యెందుకు ఉప్పుకారం మీలోనే వున్నది కమ్మని మమకారం అయ్యలు మా కలలోటి తియ్యటి మాటలతోటి తీరునటయ్యా ఆకలి చేతలలో నే చూపాలి నీ చేతి మహత్యం చూపాలి
రాముని భంటునిరా పాట సాహిత్యం
చిత్రం: నేరము శిక్ష (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలు, జానకి జై రామచంద్రకీ జై రాముని బంటునురా సీతారాముని బంటునురా ! దిక్కుల కాంతులు పిక్కటిల్లగా గుప్పున కన్నుల నిప్పులు రాలగ బర బర బర బర అంబర వీధిని వాలము దిప్పుడు వచ్చినాడురా..... చరణం: 1 ఇక్కడ వున్నాడొక రావణుడు నక్కలాగ పొంచున్నాడు గుంట సక్కలాగ పొంచున్నాడు వాడిని పట్టి నేలకు కొట్టి కండలు కోసి గుండెలు చీల్చి కాకుల కెగరేసాడు నీడు చరణం: 2 పిచ్చివాడిని నేనురా మద పిచ్చివాడిని కానురా చచ్చు పుచ్చు లోకానికి చదుపు చెప్పే వాడ్నిరా పచ్చపచ్చని కాపురాలకు చిచ్చు పెట్టి వాళ్ళ మెడకు ఉచ్చులాంటి వాడ్నిరా కార్చిచ్చులాంటి వాడ్నిరా.... చరణం: 3 అమ్మా ! సీతమ్మా ! ఆ రాముడు సంపగ వచ్చానమ్మా రఘురాముడు పంపగ వచ్చానమ్మా ! కష్టాలన్నీ కడతేరే ఆ మంచిరోజు వచ్చేనమ్మా అమ్మా ! సీతమ్మా ! ఈ రక్కసి బాధల నుక్కడంప నీ రక్షణకై వచ్చానమ్మా.....
వేశావు భలే వేషాల పాట సాహిత్యం
చిత్రం: నేరము శిక్ష (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పి.గణపతి శాస్త్రి గానం: సుశీల పల్లవి: రాజ నా రాజా! వేశావు బలే వేషాలు చేశావులే తమాషాలు తెలిసెనులే - ఇక తెలిసెనులే తెరలో దాగిన దెవ్వరో -- నీ వెవరో తెలిసె తెలెసెలే తెలిసెనులే.... చరణం: 1 మింటి నడుమ జాబిల్లీ నీవే వంటఇంటి కుందేలై నావే మగసిరులొలికే మహరాజ మగువల చేతలు తమకేల? పసందైన ఈ కోడె వయస్సులో హుషారులేదా - విషాదమే రాజా.... నా రాజా.... || వేశావు|| చరణం: 2 ఉలకపు పలకవు పెదవి కదిపితే వొలికి పోవునా వరహాలే ఒక్క మాటతో - ఓరచూపుతో ఒళ్ళు పులకరించేనే నా గుండె జలదరించేనే.... బెట్టు చేయనేల ? పట్టు విడచి రావా ? లెక్కచేయవేల ! అక్కున చేర్చుకోవా ? రాజా.... నా రాజా.... || వేశావు||
No comments
Post a Comment