చిత్రం: నోము (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: రామకృష్ణ, చంద్రకళ, శరత్ బాబు, జయసుధ దర్శకత్వం: పట్టు నిర్మాణం: ఎవిఎం ప్రొడక్షన్స్ విడుదల తేది: 15.08. 1974
Songs List:
అందరి దైవం నీవన్నా పాట సాహిత్యం
చిత్రం: నోము (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: సుశీల అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా నాగుల చవితి నాగన్నా పూజలు కొనుమన్నా పాలుపోసేము నోమునోచేమా మము చల్లగ చూసేది నాగన్నా పానకాలు చమ్మిళ్ళు కానుక తెచ్చాము ముంగిటి ముత్యాలు ముగ్గులు పెట్టాను శక్తితో నినుగూర్చి పాటలు పొడాము సిరి సంపదలిచ్చి మురిపించవయ్య మల్లెలు తెచ్చామయ్య మల్లెల నాగేంద్రా చలిమిడి పెట్టామయ్యా చల్లని నాగేంద్రా కన్నెలము కొలిచే మయ్యా కరుణించవయ్యా అడిగిన వరమిచ్చి ఆలరించవయ్య
కలిసే కళ్ళలోనా పాట సాహిత్యం
చిత్రం: నోము (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. పి బాలు, సుశీల కలిసే కళ్ళలోనా కురిసే పూలవానా విరిసెను ప్రేమలు హృదయాన పెరిగి తరిగేను నెలరాజా వెలుగును నీ మోము ప్రతిరోజు ప్రతి రేయీ పున్నములే నీలో ఉంటే ఎదురుగా చెలికాడ్ని చూచాను యెంతో వులకించిపోయాను యాపొందు కలకాలంను కోరాను కౌగిలి పిలిచేరు ఎందుకని పెదవులు వని కేను దేనికని మనసులోని పరువాలు పెనవేయాలని . . .
చక్కనిదానా నునుపు చెక్కిలిదానా పాట సాహిత్యం
చిత్రం: నోము (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: చక్కనిదానా నునుపు చెక్కిలిదానా ఇంతలో బిడియమా చెంతనే విరహమా ఈ బిడియమే ఏ పడతికయినా పరమ సహజం ఈ విరహమే నీ సరసమంటే మధురం తీగలా అల్లుకో రేసేల అందుకో నీలోన కదలే రానీ సుధలే తలచుకోగా నీలో కలసి లోలో విరిసి నేనుండిపోనా ఉండిపొ ఉండిపొ గుండెలో నిండిపో
మనసే జతగా పాడిందిలే పాట సాహిత్యం
చిత్రం: నోము (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో...హ.. హహ.. మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో... హో... ఈగిలిగింత సరికొత్త వింత ఏమన్నది పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నది ఈగిలిగింత సరికొత్త వింత ఏమన్నది పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నది హో... అందుకే ఓ చెలి అందుకో కౌగిలి.. ఓ చెలీ... హే..హే.. మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో... హో మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో... నింగిని సాగే నీలాలమేఘం ఏమన్నది నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది నింగిని సాగే నీలాలమేఘం ఏమన్నది నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది హో.... అందుకే ఓ ప్రియా అందుకో పైయ్యెద ఓ ప్రియా హేహే...మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో... హో... మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో... ఈ వేళలో ఎందుకో...
తక తక తక తక తతత్త పాట సాహిత్యం
చిత్రం: నోము (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: జానకి తక తక తక తక తతత్త తక తక తక తక తతత్త తక తక తక తక తతత్త తతతా జిగిబిగి సొగసరి పిలిస్తే అలా కాదని చెప్పకురా మన గొడవలు బయటకు తెలిస్తే ఎహ్ ఖాతరు చేయకురా నీతో ఉందిరా తొందర పం నీకే తెలుసునురా ఏమిటో ఆది తక తక తక తక తతత్త తక తక తక తక తతత్త తక తక తక తక తతత్త తతతా చూడు గుసగుసలాడె మిసమిసలాడె సొంపులు నీతో తకతకలాడడే చకచకలాడే వొంపులూ రాజా ఎక్కెనా చక్కని నిషా రారా చూపరా రేపు నీ పస జిగిబిగి సొగసరి పిలిస్తే అలా కాదని చెప్పకురా మన గొడవలు బయటకు తెలిస్తే ఎహ్ ఖాతరు చేయకురా నాలో అణగని పొగరు వలపుల వగరు ఉందిరా దానికి మనసున కూడి కైపుల వాడి ముందురా ఇదిగో ముద్దుగా ఇద్దరం వుందాం ఇపుడె ఇక్కడే ఒకటయి పోదాం తక తక తక తక తతత్త తక తక తక తక తతత్త తక తక తక తక తతత్త తతతా
నోము పండించేవా స్వామి పాట సాహిత్యం
చిత్రం: నోము (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: సుశీల నోము పండించేవా స్వామి నను కరుణించ రావేమి నిను నమ్మితిరా నిను కొలిచితిరా అలక చాలించి పాలించవా అనురాగ మొలికే అందాల రాజుకు ఇల్లాలిగా చేసినావు యే వేళనైను యే ఆపదైన మమ్మెంతో కాపాడినావు యెడబాటు యెరుగని మా జంట నిపుడు యెందుకు విడదీసి నావు నీవూ యెందుకు విడదీసి నావు ఆదిశేషుని అవతారం నీవయితే నేనింతకాలము నోచిననోము నిజమయితే దైవంగా నా పతినే నేను పూజిస్తే నీ మహిమను చూపాలి మా కాపురం నిలపాలి నిజం నిరూపించాలి.... రావా... దేవా..!
No comments
Post a Comment