చిత్రం: ఊర్వశి (1974) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: శారద, సంజీవ్ కుమార్ దర్శకత్వం: కె. బాపయ్య నిర్మాత: పి.రాఘవరావు విడుదల తేది: 20.12.1974
Songs List:
ప్రతి అందం జంటకోసం పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశి (1974) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, వాణీజయరాం పల్లవి: ప్రతి అందం జంటకోసం పలవరించి పోతుంది జతగూడే బ్రతుకులోనే ప్రతి రాగం పలుకుతుంది అనురాగం పండుతుంది చరణం: 1 కొండ కోరుకుంటుంది. కలికి మబ్బు జంటను కడలి కోరుకుంటుంది కన్నె వాగు జంటను కన్నెదాని పరువం కోరుకుంటుంది చిన్నవాని జంటను చినవాని జంటను- పెదవి కోరుకుంటుంది మరో పెదవి జంటను మేను కోరుకుంటుంది మరో మేని జంటను వలచిన హృదయం కొరుకుంటుంది తొలి వలపు పంటను తొలి వలపు పంటను చరణం: 2 రాధా కృష్ణుల జంట రస జగతికి తొలివెలుగు సీతా రాముల జంట...ఆ వెలుగుకే కనువెలుగు ఆ వెలుగే మన జీవనపధమై సాగి పోదాములే సాగి పోదాములే
ఎవరు వింటారు పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశి (1974) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల పల్లవి: ఎవరు వింటారు మూగ కన్నీట కరిగే నా పాట చరణం: 1 అన్ని వన్నెలు, ఆ దేవుని కల్పనలే ఉభయ సంధ్యలు - తెలుపు నలుపుల కలయికలే మరి తెలుపంటే ఎందుకు మోహం నలుపంటే ఎందుకు ద్వేషం చరణం: 2 నల్లని కనుపాప లేనిదే చల్లని చూపే లేదు నల్లని రాతిరి లేనిదే ఎర్రని ఉదయం లేదు మరి! వెలుగంటే ఎందుకు మోహం! చీకటంటే ఎందుకు ద్వేషం చరణం: 3 కురిసే కన్నీరు - వెలిసే ఆ రోజు వస్తుందా? కొలిచిన దైవం కోరిన వరమే యిస్తుందా? తోడు లేక నీడ లేక వసివాడివున్న నా మోడు బ్రతుకులో కళ్యాణ గీతం పలికేనా?
అందని ఆకాశం పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశి (1974) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల పల్లవి: ఆందని ఆకాశం అందుకున్నానులే ! పొందని అనురాగం పొందగలిగానులే! ఇది తొలి పొద్దులే నా అందానికి ఇక తుది లేదులే నా ఆనందానికి ! చరమం: 1 కలలే ఎరుగని నా కళ్ళకు ఒక కమ్మని రూపం దొరికింది ఇన్నాళ్ళ కన్నీళ్ళలో పున్నమి వెన్నెల విరులై సిరులై విరిసింది నింగిని పొడిచే రంగుల హరివిల్లు ముంగిట తానే నిలిచింది. నా ముంగిట తానే నిలిచింది చరణం: 2 తీగ తెగిన బ్రతుకు వీలుపై రాగ మాలిక పలికింది ! ఏగాలి ఎదిరించినా నా జీవన నావకు కోరిన తీరం దొరికింది వేకువ లేని చీకటి గుడిలో దైవమే దీపమై వెలిగింది నా దైవమే దీపమై వెలిగింది
వయసే ఊరుకోదురా పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశి (1974) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.జానకి పల్లవి: వయసే ఊరుకోదురా ! మనసే నిలువనీదురా ! అనుపల్లవి: కన్నులనిండా కైపెక్కుతుంటే వెన్నెల రాతిరి వేడెక్కుతుంటే ఒళ్ళంత ఆవిరి ఊరేగుతుంటే ఒంటరి తనం కాల్చేస్తుంటే చరణం: 1 రోజు రోజుకొక కొత్త కోరిక రాజుకుంటుంది రేయి రేయికొక వింత కోరిక రివ్వుమంటుంది రుచులెరిగిన ఫిచ్చి పరువం రెచ్చిపోతుంది ఆ రుచులే కావాలని పదేపదే కోరుకుంటుంది చరణం: 2 లేత నడుము ని పిడికిట కూతవేసింది దోర సొగసు తననుతానే ఆరవేసుకుంది తడిగాలికి పురివిప్పిన తనువూగిందీ ఊగి ఊగి నీ కౌగిట ఒదిగి ఒదిగిపోతూవుంది
పంచరంగుల చిలకల్లారా పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశి (1974) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వీటూరి గానం: కె.చక్రవర్తి, సావిత్రి, గాయత్రి, స్వర్ణ (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. ఈ పాట రాసింది వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి) పల్లవి : పంచరంగుల చిలకల్లారా ! పరువాల మొలకల్లారా ! నే మెచ్చే వారే రావాలి! మనసిచ్చే వారే కావాలి! అందం చందం చూసుకో బాగా ఎన్నిక చేసుకో ! అన్నీ కుదిరితే అప్పుడే పెళ్ళి చేసుకో దేశంలోని దరిద్రమంతా మీ దుస్తుల్లో నే కనిపిస్తోంది సిగ్గూ ఎగ్గూ లేని ఆడదాన్ని చూస్తేనే పాపం వస్తుంది ఆహాఁ అయినా అమ్మాయి వంటా వార్పూ వచ్చునా....? పిల్లల పోషణ తెలుసునా...? ఐ హేట్ చిల్డ్రన్ సంసారాన్ని బాగా నడిపే ఓర్పు, నేర్పూ మీకుందా...? ఐయామ్ సారీ ఆడా మగా తేడా లేదు ఆనందానికి హద్దే లేదు సుఖించడం మా సిద్ధాంతం రా-రా-రా-ఎందుకు రాద్ధాంతం హరి-హరె-హరె రామా- హరే హరే హరె కృష్ణా ఆడామగా తేడా తెలియని ఆడది నాకొద్దండీ! ఆదివాసుల వారసులారా ! అడవులలోకే వెళ్ళండి! మృగాల వలెనే బ్రతకండి గుంటూరు గోంగూర తినిపిస్తాను తియ్యనైన ఎంకి పాట వినిపిస్తాను గుట్టుగా కాపురం చేస్తాను పండులాంటి కొడుకునే యిస్తాను. గుమ్మడి పండులాంటి కొడుకునే యిస్తా రావే బంగరు బొమ్మా నా రమణి ముద్దులగుమ్మ!!
No comments
Post a Comment