చిత్రం: పరివర్తన (1954) సంగీతం: టి.చలపతి రావు నటీనటులు: యన్.టి.ఆర్, ఎ.యన్.ఆర్, సావిత్రి దర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావు నిర్మాత: చంద్ర దుర్గ వీరసింహ విడుదల తేది: 01.09.1954
Songs List:
రండోయ్ రండి ! పాట సాహిత్యం
చిత్రం: పరివర్తన (1954) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: గానం: రండోయ్ రండి ! రండోయ్ రండి ! రండోయ్ రండి పిల్లలూ, చూడండోయ్ తమ్ములూ, రంగురంగుల బొమ్మలూ, రమ్యమైన బొమ్మలూ ! రమ్యమైన బొమ్మలూ ! చిట్టిబొమ్మలూ, చూడండీ సీమబొమ్మలూ, చిలక బొమ్మలూ, అ రంగురంగులా బొమ్మలూ, రమ్యమైన బొమ్మలూ ! చూడు చూడు వేషమూ, చేసేదంత మోసమూ, వీని బ్రతుకె దోషమూ, మాయలాడిరా బలే కిలాడిరా ! లోక మెంతో ఇది భలే బొమ్మల సంతరా ! రండోయ్ రండి! లాలల్లలా లాలల్లలారలాలల్లలా! ఈ పిల్లల చూడరా, జీవితమే డోలరా, చిరునవ్వుల మాలరా మాయమర్మ మెరుగని పనివారురా! లోక మెంతో వింతరా ఇది బలే బొమ్మల సంతరా ! రండోయ్ రండీ పిల్లలూ, చూడండోయీ తమ్ములూ రంగురంగులా బొమ్మలూ రమ్యమైన బొమ్మలూ రమ్యమైన బొమ్మలూ ! చిట్టిబొమ్మలూ, చూడండీ సీమబొమ్మలూ, ఇవిగివిగో చిలక బొమ్మలూ, అరెరెరెరే రంగురంగులా బొమ్మలూ రమ్యమైన బొమ్మలూ ! రండోయ్ రండి ! రండోయ్ రండి !
ఆనందమోయీ ఆనందమూ పాట సాహిత్యం
చిత్రం: పరివర్తన (1954) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: గానం: ఆనందమోయీ ఆనందమూ, హే ! ఆనందమోయీ ఆనందమూ ! సంతోషమైనా సయ్యాటలూ, కయ్యాలు నీ నెయ్యాలురా! అనందమోయీ ఆనందమూ ! రావోయి నేస్తం ! మీ ఆట చూస్తాం ! చేస్తాం సవాలూ, మేమే గెలుస్తాం! -హాచి దూచి చింతాకు దూచి........ -చెడుగుడు గుడు గుడు........ మీరెత్తు వేస్తే పైయెత్తు వేస్తాం, మీ జిత్తులన్నీ చిత్తు చిత్తు చేస్తాం ! -బలి బలిదారం బంతికి జగడం. చెన్నాపట్నం చెడుగుడు చెడుగుడు.... కూతొదిలావ్, పాయింటు నాది! అహ, మాది ! కాదు మాది ! ఏమిటోయ్ నీ దబాయింపు నీ దబాయిం పేమిటోయ్ ? ? పొగరుబోతులే, మీవాడసలే పోకిరి కుర్రాడు ! బలే బల్ తగవులు తెస్తాడు ! తక్కువవాడా, మీవాడసలే టక్కరి కుర్రాడూ ! బలే బల్ తుంటరి కుర్రాడూ ! నువ్వెంత ! నీ బ్రతుకెంత ! ఏమన్నావ్ !! నువ్వేనున్నావ్ !! ఆ !.... ఆ !.... అగండయ్యా ఆగండి! ఏలనయ్యా ఈ తగాదా మానరయ్యా తప్పుగాదా ! పిల్లలాడిన ఆటకై పెద్దలిటుల తగవు పెంచుట న్యాయమా, తగునటయ్య! చిన్న పిల్లలు చక్కని స్నేహరీతి చూసి ఇక నైన నీతులు నేర్చుకొనరే! పిల్లలబృంద గానం: ఆనంద మోయీ ఆనందమూ, హే ! ఆనందమోయీ ఆనందమూ !
లోక మెంతో చిత్రమురా పాట సాహిత్యం
చిత్రం: పరివర్తన (1954) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: గానం: నందారే! లోక మెంతో చిత్రమురా, భళి ! నందారే! జనులార ! వినరయ్య జరుగబోయే వింత ! తలకిందులౌతుంది కలి కాలమంత ! .... నందా రే ! ఏకు మేకతుంది, ఆకు బాకాతుంది, బక్కచిక్కిన వాళ్లు దుక్కలౌతారయా, దుక్కలాంటి వారు చిక్కిపోతారయా, పెద్దలకు పిల్లలే బుద్ధి చెపుతారయా ఆలికే మగడిక అణిగి మణగుంటాడు ! ఊరి మధ్యను మర్రి కూలిపోతుందయా, అసలు పెద్దల్లో నె ముసలమొస్తుందయా, సామాన్యులే లోకమాన్యు లౌతారయా హైడ్రొజక్ బాంబుతో అదరగొట్టేవారు | తమ నీడకే తాము హడిలి చస్తారయ్య ! జనులార ! వినరయ్య కలికాల తత్వాలు ! బ్రతుక నేర్చిన వారి సులువైన సూత్రాలు ! రైలుబండిలో జనం క్రిక్కిరిసి పోయినా, దెబ్బలాడీ తాను ఎక్కి కూచుంటాడు, తానెక్కినంతనే తలుపు బిగిస్తాడు ! టిక్కెట్టు కొంటేనె ఇన్ని యిక్కట్లండి, లేనివారికి సరాసరి కిటికీలోంచి దారి! గర్వముంటే కళ్లు పొరలు గగమ్ముతాయి, చాడీలు వింటేను చెవులు చెడిపోతాయి, పరుల దూషించితే నోరు పడిపోతుంది, నడ మంత్రపు సిరికి మిడిసిపడబోకురా, లేవిడీ చేస్తుంది లేచిపోతుందిరా! ప్రభువుల తత్వాలు పామరుల కెరుక బండ్ల వాళ్ల గోత్రాలు పోలీసుల కెరుక, వ్యాపారుల సూత్రాలు ఇన్కం టాక్స్ కెరుక పాలలో నీళ్లెన్నొ పరమాత్మ కెరుకరా ! సినిమా తీసేవాళ్ల గోత్రాలు చూసేవాళ్ళ కెరుక ! నందారే! లోక మెంతో చిత్రమురా, భళి ! నందారే!
అవునంటారా ? కాదంటారా ? పాట సాహిత్యం
చిత్రం: పరివర్తన (1954) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: గానం: అవునంటారా ? కాదంటారా ? ఏమంటారూ, మీ రేమంటారూ? మా అన్న గారూ మహమంచి వారు, చదువంత కష్టించి సాధించినారు, చదువు లో ఫస్టు ! బడిలోన బెస్టు! ఆ తెలివి అందరికీ లేదని నేనంటే మీ రేమంటారూ ? అవునంటారా ? కాదంటారా ? ఏమంటారూ, మీరేమంటారూ ? అన్నయ్య చదువే అయిపోవగానే వస్తుంది అర్డర్ తానే కలెక్టర్! - తానే కలెక్టర్! అన్నయ్య కీర్తి ! అన్నయ్య శక్తి ! ఆ పేరూ అందరికీ రాదని నేనంటే మీ రేమంటారూ ? అవునంటారా ? కాదంటారా ? ఏమంటారూ, మీరేమంటారు ?
ఇంత చల్లని వేళా పాట సాహిత్యం
చిత్రం: పరివర్తన (1954) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: గానం: ఓహో హో !.... ఇంత చల్లని వేళా వింత తలపు లివేలా ! ఇంత చల్లని వేళా! ఝల్లని మనసే పులకరించె, మనసున వల పే చిలకరించె! ఇంత మోహ మిదేలా, ఇంత చల్లని వేళా ! ఈ ముద్దు గులాబీ పూల రేకలు ప్రేమ లేఖలేనా, ఇవి ప్రేమ లేఖలేనా ! నీ అందమే నే పొందనా అని కల కల నవ్వేనా - ఓ కలకల నవ్వేనా! ఇంత చల్లని వేళా వింత తలపు లివేలా ఈ చల్ల గాలి సయ్యాటలన్నీ చిలిపి సైగలేనా, ఇవి చిలిపి సైగలేనా ! నీ అందమే నా విందులే అని వలపులు కురిసేనా ఓ- వలపులు కురిసేనా ! ఇంత చలని వేళా వింత తలపు లివేలా ! ఝల్లని తనువే పులకరించె, మనసున వలపే చిలకరించె ఇంత మోహమి దేలా ! ఇంత చలని వేళా !
ఆవేదనే బ్రతుకును ఆవరించేనా పాట సాహిత్యం
చిత్రం: పరివర్తన (1954) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: గానం: ఆవేదనే బ్రతుకును ఆవరించేనా ! ఆశలన్నీ కడకు అంతరించేనా ! వెలుగు నీడల బాటరా, జీవితమె కలిమి లేముల ఆటరా ! గడియకొక రీతిగా లోకమే మారురా, వెలుగు నీడల బాటరా ! పరమాత్మ రూపాలు పసిపాపలే నేడు బ్రతుకంత భారమై పయన మాటేల !..... మర్యాద ముసుగులో మాయలూ మోసాలు పేరాశతో పరుల బలిచేయ నేలా ! నిలువ నీడేలేని నిరుపేద కైనా, వెలుగు నీడల బాటరా నిఖిల లోకము నేలు మహారాజుకైనా, సుఖదుఃఖములు బ్రతుకు సంద్రాన కెరటాలు ఏ నాటికేమౌనో ఎరుగలే మౌరా ! ఏనాటికేమానో ఎరుగలే మౌరా !
కలికాలం కలికాలం పాట సాహిత్యం
చిత్రం: పరివర్తన (1954) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: గానం: కలికాలం!! కలికాలం కలికాలం ఇది ఆకలి కాలంరా భాయీ ! ఆకలి కాలంరా ! లోకం మాయా జాలంరా, ఇది పేదల గుండెల గాలంరా ! కలికాలంరా కలికాలం ఎవరిని చూసిన ఏదో దిగులు రాత్రింబగళ్లు రగులూ, ఏడ్వలేక నవుతుంటారోయ్, నవ్వు రాక ఏడుస్తారోయ్ ! కలికాలంరా కలికాలం ఉన్నవారి నెదిరించేవారికి అసలుకు మోసం వచ్చునురా, అవునవునని తల ఆడించడమే . తారక మంత్రముగా, భాయీ ! తారక మంత్రమురా ! కలికాలంరా కలికాలం ! పదవుల వేటలో ప్రాకులాటలో నాయకులకు పోటీలురా, వినాయకులకు పోటీలురా! మాటలు, మూటలు మోసే వారికి మంచి మంచి వాటాలురా ! కోరినన్ని కోటాలురా ఏం కాలం ? కలికాలం ! కాదు, కాదు, ఆకలి కాలం! కలికాలంరా కలికాలం ఇది ఆకలి కాలంరా భాయీ ఆకలి కాలంరా !
రాజూ వెడలే చూడరే! పాట సాహిత్యం
చిత్రం: పరివర్తన (1954) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: గానం: రాజూ వెడలే చూడరే! భూకంపములు లెగయగ రాజు వెడలె చూడరే ! చిరకాలముగా చీట్ల పేకలో చిందులు వేసిన గందరగోళపు రాజూ వెడలే చూడరే ! చతుర్ముఖ రామాయణ చక్రవర్తీ, బహుపరాక్ ! సెహబాస్ ! మదాం మహారాణీ, బహుపరాక్ ! ప్రభూ ! హు! ఓ రాజా ! ఇది కడు సంతోషపు రోజూ, నేడైనా నా మోజూ తీరదా ! ఓ రాణీ! నీ కోరికలన్నీ తీరూ, అవి యేవో నా కిపుడే తెల్పుమా ! ఆ రాజ భోగాలె లేవు, ఆ రాణీ వాసము లేదు, ఏ ఆభరణాలు లేవు ! ఓ రాణీ ! నీకే దిగులు, నీ కిస్తా వెన్నెల తోట, కట్టిస్తా బంగరు కోట, నీ కెన్నో కానుక లిస్తా ! మాట నమ్ము మనసు నిమ్ము హస్తమిమ్ము రమ్ము రమ్ము ! ఓహోహో ! ఇది కడు సంతోషపు రోజూ ఈ వేళా మన మోజూ తీరులే ! ఇది యొక లెఖ్ఖ ! కూలిపోయిన మహా సామ్రాజ్యంబును మరల లేవనెత్తెద ! ఈ సేవకాధముణ్ణి సైతము సేనాధిపతింజేసెద ! ఓ మహారాజ ! జరుగదు ! వొట్టి మాట ! సురిగిపోయిన రాజ్యాలు తిరిగి వలదు వలదయ్య మాకు నీ కొలువు, నిన్ను నమ్మి చెడితిమి పోవుచున్నాము యిపుడె అందుకోవయ్య మా రాజినామ ఇదిగొ ! ఓరీ దురాత్మా మా మాట నమ్మ వేమిరా ఓరోరి ద్రోహి ! మా మాట నమ్మ వేమిరా సేవక నీవు ! మా మాటా !- హో - హీ -హో మా మాట నమ్మ వేమిరా ! ప్రచండమగు నా పరాక్రమంతో జయించెదన్ ఈ ప్రపంచమంతా ! ఎవరు వచ్చినా ఎదురు చెప్పినా కత్తి నెత్తెదన్, శక్తి చూపెదన్ పట్టి, కట్టి, కొట్టి, మట్టి చేసెద ! మా మాట ! హు ఏరా ఒరే మా మాట మా మాట నమ్మ వేమిరా ! సేవక నీవు, భలే మంచి రాజు వేనయా ! ఇక చాలు నీ ప్రతాపము, ఆపుము ! కాలమే గతించెనయ్య భలే మంచి రాజు వేనయా ! భలే ! భలే ! భలే ! మంచి రాజువేనయా ! ఇక పోవోయ్, పో పోవోయ్ ! నీ బాజా వినమోయ్ రాజా ! ఓ మాజీ రాజా పోవోయ్, పోవోయ్ ! నకలు రాజులకు రోజులు తీరెను ! అసలే లోకపు పోకడ మారెను ! మహారాజువా ! మరలుము ! తరలుము ! పోవోయ్, పోపోవోయ్ పో, పో, పో, పో!!
జననీ జన్మ భూమిశ్చ పాట సాహిత్యం
చిత్రం: పరివర్తన (1954) సంగీతం: టి.చలపతి రావు సాహిత్యం: గానం: జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ! అమ్మా ! అమ్మా ! అమ్మా ! అమ్మా అమ్మా, అమ్మా, అవనీమాతా ! అనంత చరితా ! అమృత మూర్తీ ! అమ్మా, అమ్మా అభినందన మాలించుము తల్లీ ! ఆదరించి లాలించుము తల్లీ ! అమ్మా, అమ్మా ! అమ్మా అమ్మా అవనీమాతా ! అనంకి చరితా అమృత మూర్తీ ! అహరహరమూ ఆ సూర్య చంద్రులే అభిషేకించెద రమ్మా ! అనుదినమూ మా శ్రమ నర్పించి ఆరాధించెద మమ్మా! అమ్మా ! అమ్మా బంగరు పంటలు, పాల నదులు మా సిరులన్నీ నీ కానుకలమ్మా యోగులు, భోగులు, మహాత్యాగు లీ! నరులంతా నీ శిశువులె నమ్మా అమ్మా ! అమ్మా ! అవనీమాతా ! అనంత చరితా ! అమృతమూర్తీ! ఆకలి, ద్వేషం, లోకపు శోకం అంతరించి నీవమ్మా ! శాంతి సౌఖ్యములు సౌభాగ్యాలే జగతి నిండనీవమ్మా, ప్రగతి సాగనీవమ్మా ! అమ్మా, అమ్మా, అవనీమాతా ! అనంత్ చరితా ! అమృత మూర్తీ ! అమ్మా, అమ్మా, అవనీమాతా ! అనంత చరితా ! అమృత మూర్తీ ! అమ్మా ! అమ్మా ! అమ్మా !
No comments
Post a Comment