చిత్రం: సంసారం (1988) సంగీతం: రాజ్-కోటి నటీనటులు: శోభన్ బాబు, జయప్రద, శారద, రాజేంద్రప్రసాద్, రజిని మాటలు: సత్యానంద్ దర్శకత్వం: రేలంగి నరసింహారావు నిర్మాత: శాఖమూరి రామచంద్ర రావు విడుదల తేది: 01.01.1988
Songs List:
కొమ్మలో కోయిల పాట సాహిత్యం
చిత్రం: సంసారం (1988) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, సుశీల పల్లవి: కొమ్మలో కోయిల సరిగమలు కోరికల మల్లెల ఘుమ ఘుమలు ఆరాధనంతా ఆలాపనైతే పాడుకున్న పాటలీవేళ రచించే శుభలేఖ ఫలించే కలలింకా కొమ్మలో కోయిల సరిగమలు కోరికల మల్లెల ఘుమ ఘుమలు ఆరాధనంతా ఆలాపనైతే పాడుకున్న పాటలీవేళ రచించే శుభలేఖ ఫలించే కలలింకా కొమ్మలో కోయిల సరిగమలు కోరికల మల్లెల ఘుమ ఘుమలు చరణం: 1 కంటి కలలే ఏటి అలలై కంటి కలలే ఏటి అలలై తీరాలు దాటాయి రాగాలతో తీరాలు కలిసాయి కౌగిళ్ళలో కన్నె గాలి పెట్టుకున్న పూలమోగ్గులో తుమ్మెదొచ్చి అంటుకుంది ఎన్ని తేనెలో ఆ దాహమే ఈ స్నేహమై పండింది ఇన్నాళ్ళకి ఇదేలే శుభవేళా ఎదల్లో రసలీలా కొమ్మలో కోయిల సరిగమలు కోరికల మల్లెల ఘుమ ఘుమలు చరణం: 2 కన్నె ఒడిలో ప్రేమ గుడిలో కన్నె ఒడిలో ప్రేమ గుడిలో నే హారతిస్తాను అందాలనే నేహారమేస్తాను ప్రాణాలనే చేయి మీద పెట్టుకున్న లేత ముద్దుల్లో గాజులమ్మ నవ్వుకున్న మోజు మద్దెల్లో నా పల్లకీ సాగాలిలే నీ చైత్ర గీతాలతో అందాకా సెలవింకా సరేలే గోరింకా కొమ్మలో కోయిల సరిగమలు కోరికల మల్లెల ఘుమ ఘుమలు ఆరాధనంతా ఆలాపనైతే పాడుకున్న పాటలీవేళ రచించే శుభలేఖ ఫలించే కలలింకా
నీ వళ్ళు వయ్యారం పాట సాహిత్యం
చిత్రం: సంసారం (1988) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర నీ వళ్ళు వయ్యారం
రాలుగాయి రంభ లాంటి పాట సాహిత్యం
చిత్రం: సంసారం (1988) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: జొన్నవిత్తుల గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: రాలుగాయి రంభ లాంటి అమ్మాయిరో రమ్మందిరో యమా యమా గుందిరో ఆకతాయి మిరపకాయి కుర్రాడురో ఖిల్లాడిరో ఆగమంటే ఊరుకోడురో నాకు నచ్చిందిరో ముద్దు వచ్చిందిరో గుబులు పుట్టించి గుండెల్లో గువ్వల్లే నవ్విందిరో రాలుగాయి రంభ లాంటి అమ్మాయిరో రమ్మందిరో యమా యమా గుందిరో ఆకతాయి మిరపకాయి కుర్రాడురో ఖిల్లాడిరో ఆగమంటే ఊరుకోడురో చరణం: 1 గాలి పైట కోలాటము నాలో తియ్యని ఆరాటము మోహం రేపే మోమాటము అటూ ఇటూ కాని ఇరకాటము మురిసే గులబివై రావాలే సొగసే జవాబుగా ఇవ్వాలి గుండె చప్పుళ్ళతో పాల చెక్కిళ్ళతో పాల మీగడలా మురిపాలు నీ పాలు చేస్తాలే రాలుగాయి రంభ లాంటి అమ్మాయిరో రమ్మందిరో యమా యమా గుందిరో ఆకతాయి మిరపకాయి కుర్రాడురో ఖిల్లాడిరో ఆగమంటే ఊరుకోడురో చరణం: 2 పట్టు విడుపు పాటాలలో ఇట్టా నిన్ను పట్టేయనా దారే లేని సందెళ్ళలో దారం లాగ చూట్టేసుకో కులికే మయూరిలా చేరాలే సరసం వర్షంలా కురవాలే పూల పుప్పొల్లతో ప్రేమ వాకిల్లలో వలపు వత్తిల్లో కౌగిల్లో లోగిల్లో కుట్టాలే రాలుగాయి రంభ లాంటి అమ్మాయిరో రమ్మందిరో యమా యమా గుందిరో ఆకతాయి మిరపకాయి కుర్రాడురో ఖిల్లాడిరో ఆగమంటే ఊరుకోడురో నాకు నచ్చిందిరో ముద్దు వచ్చిందిరో గుబులు పుట్టించి గుండెల్లో గువ్వల్లే నవ్విందిరో
ఓ తప్ప తాగిన పాట సాహిత్యం
చిత్రం: సంసారం (1988) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: జొన్నవిత్తుల గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ, జి.ఆనంద్ ఓ తప్ప తాగిన
ఎవరమ్మ నీకు పాట సాహిత్యం
చిత్రం: సంసారం (1988) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు పల్లవి: ఎవరమ్మ నీకు జోల పాడింది ఎవరమ్మ నిన్ను నిదుర పొమ్మంది ఎవరమ్మ నీకు జోల పాడింది ఎవరమ్మ నిన్ను నిదుర పొమ్మంది ఈ నిదుర నాకు రారాద ఈ నిదుర కలే కారాద నా ఇంటి దైవమా నా కంటి దీపమా జో జో జో జో జోలమ్మ జోజో జో జో జో జో జోలమ్మ జోజో చరణం: 1 పసుపుకుంకుమలతో వెళ్లిపోవాలని ప్రతీ ఇల్లాలు కోరుకుంటుంది అది ఎంత స్వార్థమో ఇప్పుడే తెలిసింది తోడు ఉండవలసింది వయసులో కాదమ్మా వయసు మళ్ళినపడు నాకు చేయూత ఎవరమ్మా ఇది నే చేసిన పాపమా నా పాలిట శాపమా జో జో జో జో జోలమ్మ జోజో జో జో జో జో జోలమ్మ జోజో ఎవరమ్మ నీకు జోల పాడింది ఎవరమ్మ నిన్ను నిదుర పొమ్మంది చరణం: 2 కంటి రెప్పలా నన్ను ఇన్నాళ్లు కాచావే కడ చూపైన లేక వెళ్ళావే ఇది నీకు న్యాయమా చెప్పవే నా తల్లి గోరుముద్ద తినిపించి జోకొట్టిన దేవతను నోట బియ్యమే యేసి వల్లకాటికంపనా ఇది నే చేసిన ఖర్మమా నా పాలిట ప్రాప్తమా జో జో జో జో జోలమ్మ జోజో జో జో జో జో జోలమ్మ జోజో ఎవరమ్మ నీకు జోల పాడింది ఎవరమ్మ నిన్ను నిదుర పొమ్మంది ఈ నిదుర నాకు రారాద ఈ నిదుర కలే కారాద నా ఇంటి దైవమా నా కంటి దీపమా జో జో జో జో జోలమ్మ జోజో జో జో జో జో జోలమ్మ జోజో
No comments
Post a Comment