చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీదేవి, జమున, జగ్గయ్య, రాజసులోచన, రేలంగి దర్శకత్వం: సి.పి. దీక్షిత్ నిర్మాత: ఎం. సోమసుందరం విడుదల తేది: 24.12.1955
Songs List:
నవ్వవోయి రాజా పాట సాహిత్యం
చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల గానం: పి. సుశీల సరస డ్యాన్సుపాట ! నవ్వవోయి రాజా రాజా ! నవయౌవ్వనము ఓ నాటి రాజా ! పకపకలాడే బతుకే సఫలమోయి రాజా ! విర పూసే పూవుల వోలె విందులయే వెన్నెల వోలె హోరు మనె నీరథి తేలె తరగలపై నురుగుల వోలె పకపకలాడే బతుకే సఫలమోయి రాజా! ఏలరా యీతీరుగా కన్నీరుగా కూలగనేలా? చిమ్మని యే చీకటి లోన కమ్మని లే వెన్నెలలోన సంబరము వాఠవోయు అంబరాల తార వోలె పకపకలాడే బతుకే సఫలమోయి రాజా !
నిలుపరా మదిలోన హరిని పాట సాహిత్యం
చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల గానం: వెంకటేష్ సాకి ! రారా జీవా శ్రీహరి దరిచేరరా, వగ వీడరా ఆలించి పాలించే లోక నాధుని శరణు వేడరా పల్లవి: నిలుపరా మదిలోన హరిని నిరామయుని, దయాపరుని చరణం: పిలచిన పలికేదేవుని మఠచీ దేవుళ్ళాడే వేరా..! తరించేవురా మూఢజీవా వరదుని దాపుచేర.... ఓ జీవా వరదుని దాపుచేరా! చీకటిలోన చిందులు మాని వెలుగు చూడనేరా...! ఇహలోకపు బంధాలను తెంచే ఈశుడు ఈ ప్రభువేరా....! మదిలోపలి వెతలు తీర, కోరికలు నెరవేర ఏకాలానికి తరుణోపాయం రామనామ స్మరణేరా..
ఎటులా బ్రతికేనో పాట సాహిత్యం
చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల గానం: ఘంటసాల ఎటులా బ్రతికేనో - నేను జాలే లేని భువిలోన ధనముల తూగే శీలవిహునులు దీనుల రాచీ, సిరిదోచీ - తమ బానిస చేసీ మురిసేరే, సిరిగల వారి సేవలకన్నా నరకమే పేదకు సుఖమేమో.... దీనులపాలిటి దిక్కనుచు దేవుని నమ్మి కొలిచాను పస్తుపడి నా జీవితమె పూజలకై వెలపోశాను కాటిని కట్టెలు కొట్టాను మూటల నెన్నో మోశాను గుండియలు పగిలేలాగున - పెను బండలు బద్దలు కొట్టాను పస్తుపడి హరి పూజలకు బతుకే వ్యర్థము చేశాను
యమునా వాటికి పాట సాహిత్యం
చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల గానం: కె. రాణి రాధ: యమునా వాటికి నీటికి చన ఏమోమో నను చేసెనే చెలీ....! గోపాలుడు, బాలగోపాలుడు గోపాలుడు, నందగోపాలుడు గోపికలు: యమునా వాటికి నీటికి చన యేమేమీ నిను చేసెనే చెలీ....? గోపాలుడు, బాలగోపాలుడు గోపాలుడు, నందగోపాలుడు రాధ: వాటము చూసి, నా చెయి లాగేనే పయ్యెద జారే, బానా తూగే కన్నుల కసరుచు ''ఊఁ హుఁ” అంటే నాదెస చూసి నవ్వెనె కొంటె తొలగి పోరా, నాదారి, తుంటరి ఆంటినే గోపికలు: కులుకులాడి గనినా వాడేల విడునే... రాధ: గోపాలా! నీ వేషాలు నాతోకాదు సొమ్మంటే గోపికలు: కోణంగి గున్నడే నీమాట లెన్నడే.... రాధ: చిలిపి నవ్వుల నల్లనివాడు, నిలువరించేనా జడలాగే.... రాధ: పిచికారి సించెనే చీరెచెరగు తడిపెనే విజయమ్ము నీదెలే, నన్ను విడువ మంటినే..... చెలికాడా? నీ వాడను కానా....? అని జాణా చేరీ నన్ను గోమూ సేయ, మైమరచి పోయితిని - నేనో చెలియా.... గోపికలు : హెయ్ ! జీవితమె ధన్యమైపోయే చెలియా.....!
గాలివలెతేలి పాట సాహిత్యం
చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల గానం: సరస: గాలివలెతేలి విరిబాలవలె పోలి ఈలీల పరుగేల ఓ బేలమనసా తామె. దయచేయువారు, దయచూడలేర.... దరిచేర రార, తమీ వెలాగ నయగారాలతో, నీదుకోరిక దీర నిను మురిపించర? ఓరిమి వహించనే దూరదేశాల చదివి చసుదేరు ఘనులే కనలేద జాలి, చెలి విరాళీ నిండు నెలరేనిలో మర్రి మాకుల నీడ ఇక మనియేములే పావురాల జోడుగా
రూపాయి కాసులోనే పాట సాహిత్యం
చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల గానం: పి. సుశీల రూపాయి కాసులోనే వున్నది తమాషా ఈ పూట వున్నచోట, వుండదు హమే షా... పాపిష్టి డబ్బులున్న బాధ చెప్పరాదు బతుకులోన హాయిలేదు, లేదు, లేదు... ఔనన్నా..! ఔనన్నా..! ఔనన్నా....! ఔనన్నా... ఔనన్నా... ఔనన్నా..! రూపాయలున్నవారి రూపు, చూపేవేరన్నా.. కోపాలు పెంతురన్న జాలి చూపలేరన్నా... దోపిడివారి తీరన్నా..... పైసావున్న భీతి, నీతి, పాపం బండినున్న పస్తున్న పేదవారి బతుకే హాయన్నా....! ఉండదు కంటికి నిద్దుర రవంతయు గుండియలోన నిండు - ఆశాంతియే.... స్థిరము కాని, గుణములేని డబ్బే వోజబ్బు, ఉబ్బొద్దు సిరులకు! పైసావున్న భీతి, నీతి, పాపం బండి సున్నా...! పస్తున్న పేదవారి బతుకే హాయన్నా .. |
ధనమూలముగా జగము పాట సాహిత్యం
చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల గానం: ఘంటసాల, పిఠాపురం నాగేశ్వరరావు సాకి : ధనమూలముగా జగము, థనమే జయసాధనమురా... థనమే నీ గౌరవము కొలిచే కొలమానమురా.... పైసా కలవాడే ధరలో పరబ్రహ్మరా... థనములేని మానవుడు తోలు బొమ్మరా... చరణం : నీ పాకెట్ లో రూకుంటే పరువు నీదేరా ఈలోకంలో నీకెదురు ఎవరు లేరురా...! సాకి: డబ్బులేనివాడు దుబ్బుకి కొరగాడురా భాయీ అబ్బాయి.... ఆ డబ్బే అన్ని జబ్బులకు అబ్బురమైన మందురా... చరణం : బంగారుగల గాడిదకే కలదు ఘరానా.... నిరుపేదెన రాజునకు లేదు ఠికానా.... సాకీ : ఒకనాడు లైలా నాన్నతో అన్నాడు మజ్నూ జాలిగా.... వలచాను “మావాఁ" నేను లైలాను మనసారగా ఆమాట వినగానే లైలా నాన్నకు వచ్చింది ఏమిటి..? చెప్పాడు కోపంగా మీసం దువ్వి..! చరణం: చేత కాసుంటే లైలాను పెళ్ళిచేసుకో కాసు లేకుంటే ఆశమాని నోరుమూసుకో..!
తీయనీ ఈనాటి రేయి పాట సాహిత్యం
చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల గానం: పి. సుశీల, వెంకటేష్ తీయనీ ఈనాటి రేయి హాయిని కొలిపేనే... మాయని అందాలు చిందే మాధురి తెలిపేవే...! వెన్నెలబయలా, వెలిగే నదిగో వన్నెలతారా భామా....! కిలకల రాగాలేమో, ఆకులుకు నిగారాలేమో...! అమృ: వలపించు చెలుని, కనినా చాన పులకించు నా విధాన, మూర్తి అండ్ అమ్ళు: కదలించి విరుల, కౌగిలింత పొదివేను చిరుగాలి అమృతం : పూవులలోన తేనెలసోన నవీన శోభ వరించె, ఆనందమావరించె....! మూర్తి : లేమావినున్న కోయిల కన్నె ప్రేమకథా వినుపించె అమృకం : నా మనసు పాలించ రాజా..! నా మాట ఆలించే...
చిన్నారి దానరా...! పాట సాహిత్యం
చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల గానం: జిక్కీ చిన్నారి దానరా...! నిన్నేలు జాణరా...! కన్నార చూడరా... నాకన్న సుందరి లోకాన లేదురా చేరనీయరా ఓ...బోగాల యేలికా..! సరసాలకు ఇది సరివేళ రా రారా తపోధన నన్నేలరా.. నీ వేసము, నా కోసమే. నీ వాసించే బహ్మానందం నేనే రాజా....! రారా నా రాజా..! చేకోరా రాజా....!
ఉన్నారున్నారు పాట సాహిత్యం
చిత్రం: సంతోషం (1955) సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల గానం: జిక్కీ ఉన్నారున్నారు, నరులున్నారు..! . యీ లోకంలో . . తరతరాలుగా, రకరకాలుగా తమదారీ, తీరే వేరుగా పరువుకలుగు పేదవారు, గుణములేని గొప్పలవారు కలిమి లేమీ, సుళ్లు తిరిగే వాగులో గరికల్లాగా వాకిలి కాచీ, మెచ్చులు పలికే కాకా రాయలు కొందరు వేషాల్ వేసి, లోకుల మోసం చేసేవారు కొందరు పరపీడన కోసం వెంపరలాడే వీరులు, మపనీయులు మాయామార్మం నేరని చినదానిని, మంచిగ చేరదీసి, చేతిలో చేయివేసి, ఆ మాటే మరిచావా ఎడబాటే మరిచావా ఇటు జాలీమాలీ పంచన చేసే ఈ సరి మగధీరులు
No comments
Post a Comment