చిత్రం: సుపుత్రుడు (1971) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: నాగేశ్వరరావు, లక్ష్మీ దర్శకత్వం: తాతినేని రామారావు నిర్మాతలు: జాగర్లమూడి సుబ్బారావు, గోరంట్ల రాజేంద్రప్రసాద్ విడుదల తేది: 29.04.1971
Songs List:
అయ్యిందయ్యో, పాట సాహిత్యం
చిత్రం: సుపుత్రుడు (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల-సుశీల & బృందం కోరన్ : లేవిడి, లేవిడి, లేవిడి, లేవిడి, లేవిడి, లేవిడి అయ్యిందయ్యో, అయ్యిందయ్యో అమ్మాయిగారి పని అయ్యిందయ్యో ... బుగ్గమీద ఎరుపుకాస్త తగ్గిపోయింది ముద్దులుగారే ముఖము వాలిపోయింది పాపం వోడిన వాళ్ళకు వేద్దాం వాడిపోయినదండలు పక్కన అరిచినవాళ్ళకు నెత్తిన సున్నపు కుండలు కొరస్ : గోవిందా... గోవిందా.... ఓడిన వాళ్ళకు వొచ్చే లో టేముంది చీకటి వెంబడి వెన్నెల కాచుకు వుంది కోరస్ : ఆ హ హ... అల్లరి చెయ్యంగా నే ఏమయ్యింది? ఒళ్ళు విరుచుకోంగానే ఏమవుతుంది? అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో అయ్యిందయ్యో అయ్యిందయ్యో అమ్మాయిగారి పని అయ్యిందయ్యో ఎందుకొచ్చిన ఎన్నికా ఓ అందాల బాలికా గెలవడమంటే తేలికా యింటికి పదండి చాలిక షేమ్, షేమ్. షేమ్....భం....భం... ఇల్లలకంగానే పండుగ యౌనా? గెలవంగానే సంబడమౌనా? దెబ్బకు దెబ్బ తీయకుందుమా? అబ్బాయిగారి అంతు తేల్చమా? అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో అయ్యిందయ్యో అయ్యిందయ్యో - అమ్మాయిగారి పని అయ్యిందయ్యో కో కోకొలాలు బలే యిచ్చారయ్యో పచ్చనోట్లు కూడ దెచ్చి పంచారయ్యో గావుకేక లేసుకుంటూ తిరిగారయ్యో గాడిదతన్నులు బాగా తిన్నా రయ్యో బాకాలు ఉదారు కారాలు పట్టారు కా కా కాకా లుకలుకలై బెక బెకలై పొయ్యరయ్యో అయ్యింది మ్యాం - అయ్యుందయ్య అమ్మాయిగారి పని అయ్యిందయ్యో అయ్యిందయ్యో - అయ్యిందయ్యో అమ్మాయిగారిపని అయ్యిందయో అమ్మాయి గారి పని అయ్యిందయ్యో
ఓహో హో... వయ్యారి పాట సాహిత్యం
చిత్రం: సుపుత్రుడు (1971) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: సినారె గానం: ఘంటసాల, సుశీల పల్లవి: ఓహో హో... వయ్యారి వగలమారి కుమారీ వై అర్ యు సారీ... వై కాంట్ యు మారి యు..నో..నో..నో.. ఓహో హో..వయ్యారి వగలమారి కుమారీ వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ.. యు..నో..నో..నో.. చరణం: 1 నడవకు నడవకు అంతజోరుగా... నడుస్తాను నీకేం? నాకేం..హహహా.. నీ అందాలు చందాలు అలసిపోయేను నడుము నలిగిపోయేనూ నడవకు నడవకు అంతజోరుగా.. నీ అందాలు చందాలు అలసిపోయేను నడుము నలిగిపోయేనూ చూడకు చూడకు అంత కోరగా నీ చూపులోని ఎరుపు నాకు కైపులాగ తోస్తుంది నన్నేదో చేస్తుంది..అహా ఓహో హో..వయ్యారి వగలమారి కుమారీ వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ.. యు..సిల్లి.. చరణం: 2 పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము గడుసువాడు తగిలితే... కాళ్ళబేరమూ పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము గడుసువాడు తగిలితే... కాళ్ళబేరమూ ఈ రుసరుసలూ... గుసగుసలూ... ఎందుకమ్మాయి ఈ రుసరుసలూ... గుసగుసలూ... ఎందుకమ్మాయి ఇంక పస ఉంటే వేసుకొందం.., రోజూ లడాయి ప్రతి రోజూ లడాయి వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ.. అబబబభా.. చరణం: 3 బిగదీయకు బిగదీయకు పైటకొంగును ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను కౌగిట దాచమనేనూ.. బిగదీయకు బిగదీయకు పైటకొంగును ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను కౌగిట దాచమనేనూ.. ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ.. ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ.. నీవు ఎగతాళికి చేస్తే అది వెంటబడేను నీ అంతేదో... చూసేను..ఏయ్.. ఓహో హో..వయ్యారి వగలమారి కుమారీ వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ.. యు..నో..
చిలకమ్మా పిలిచింది పాట సాహిత్యం
చిత్రం: సుపుత్రుడు (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, సుశీల పల్లవి: చిలకమ్మా పిలిచింది... గోరొంకా పలికింది చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో గోరొంక వాలింది... కొండంత ఆశతో చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో గోరొంక వాలింది... కొండంత ఆశతో చిలకమ్మా.... పిలిచింది గోరొంకా..... పలికింది చరణం: 1 ఉరిమేటి మబ్బులే... చిరుజల్లు కురిసేది చెఱలాడు మనసులే... చెలిమితో కలిసేది ఉరిమేటి మబ్బులే... చిరుజల్లు కురిసేది చెఱలాడు మనసులే... చెలిమితో కలిసేది చినదాని బుగ్గలకు... సిగ్గెపుడు వచ్చేది చినదాని బుగ్గలకు... సిగ్గెపుడు వచ్చేది అనుకోని వలపులూ... అప్పుడే తెలిసేది చిలకమ్మా.... పిలిచింది గోరొంకా..... పలికింది చరణం: 2 ఎఱ్ఱ ఎఱ్ఱగా పూచింది... దానిమ్మ పువ్వు కుఱ్ఱతనమంతా ఒలికావు... కులుకుల్లోనువ్వు చలిగాలి వీచింది... ప్రాణాలు జివ్వని అది గిలిగింత పెట్టితే..అనుకొంటి నువ్వని చిలకమ్మా.... పిలిచింది గోరొంకా..... పలికింది చరణం: 3 ఆ కొండ ఈ కోన... కలిశాయి మంచులో నీరెండ తోచింది... నీవున్న తావులో ఆ కొండ ఈ కోన... కలిశాయి మంచులో నీరెండ తోచింది... నీవున్న తావులో ఊగింది మనపడవ... వయ్యారి కొలనులో ఊగింది మనపడవ... వయ్యారి కొలనులో సాగాలి మనబ్రతుకు... ఈ తీపి ఊపులో చిలకమ్మా పిలిచింది... గోరొంకా పలికింది చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో గోరొంక వాలింది... కొండంత ఆశతో చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో గోరొంక వాలింది... కొండంత ఆశతో చిలకమ్మా.... పిలిచింది గోరొంకా..... పలికింది
భలే మంచి చౌక బేరమూ పాట సాహిత్యం
చిత్రం: సుపుత్రుడు (1971) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల, భలే మంచి చౌక బేరమూ రండి రండి కొనండి మాయా బజారున్నది మంచి బజారున్నదీ మాయేదో - మంచేదో నిజము మీరె తెలుసుకోండి మాటలమ్ము బూటకాల బ్లాకు మార్కెటుండి అది అచ్చమైన కల్పతరువు కామధేనువండి యిది వచ్చినవాళ్ళందరికి నిలువు దోపిడి అక్కడ కారుచౌకగా దొరికే అంగడి వున్నది యిక్కడ చేను పెన అప్పుల్చి పైరును భోంచెయ్యము ఆప్పు పెట్టి వడ్డిలకు ఆస్తి సఫా చెయ్యము రంగునీళ్ళు పోసి మ దు లంటూ మసిబుయ్యమూ బియ్యంలో రాళ్ళు గలిపి ముట్లైనా వెయ్యము వేషాలు మోసాలూ కో కొలలు అక్కడ న్యాయం ధర్మం నడిచే పద్ధతులున్నవి యిక్కడ గుత్త పెట్టుబడిదారుల గురుడున్నా దక్కడ నలుగురినీ కూడగట్టు నాయకుడున్నా డిక్కడ
ఏమివ్వను నీకేమివ్వను.. పాట సాహిత్యం
చిత్రం: సుపుత్రుడు (1971) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను నన్నే వలచి నా మేలు తలచి నన్నే వలచి నా మేలు తలచి లేని కళంకం మోసిన ఓ చెలీ మచ్చలేని జాబిలి ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను చరణం: 1 తారకలే కోరికలై మెరియగా కనులు విరియగా వెన్నెలలే వేణువులై పలుకగా మధువు లొలుకగా యుగయుగాలు నిన్నే వరియించనా నా సగము మేన నిన్నే ధరియించనా.. ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను చరణం: 2 నీ కన్నుల వెలుగులే తారకలై... నయన తారకలై నీ నవ్వుల జిలుగులే చంద్రికలై... కార్తీక చంద్రికలై జగమంతా నీవే అగుపించగా... నీ సగము మేన నేనే నివసించగా ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను నిన్నే వలచి నీ మేలు తలచి... నిన్నే వలచి నీ మేలు తలచి బ్రతుకే నీవై పరవశించు చెలినీ... నీ జాబిలినీ ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను ఆహాహా... ఆహాహా... ఆహాహహా...
No comments
Post a Comment